విదేశీ బాబా విదేశీ పిల్లలతో కలయిక.
అవినాశి సంతోషం లేక అతీంద్రియ సుఖం ఇచ్చేవారు, మాయ
ఫ్రూఫుగా తయారుచేసే బాప్ దాదా విదేశీ పిల్లలతో మాట్లాడుతున్నారు -
ఈరోజు విదేశీ బాబా ఈ సాకార ప్రపంచంలో విదేశీ పిల్లలను
కలుసుకోవటానికి వచ్చారు. ఇద్దరు విదేశీయులే. ఈ రోజు విశేషంగా విదేశీ పిల్లలను
కలుసుకునేటందుకు ఎందుకు వచ్చారు, మీ విశేషతను తెలుసుకుంటున్నారా? ఏ విశేషత
కారణంగా బాబా కూడా విశేష రూపంలో వచ్చారు! విదేశీయులలో ఏ విశేషత ఉంది? బాబాకు
తెలుసు, నా కల్పపూర్వం పిల్లలే ఈ వ్యక్త దేశంలో దూరంగా భిన్న భిన్న నామాలు,
రూపాలు , ధర్మాలలోకి వెళ్ళిపోయారు. వారే మరలా తిరిగి బాబాను, పరివారాన్ని
కలుసుకునేటందుకు తమ అసలైన స్థానానికి చేరుకున్నారు అని. ఇలా అనుభవం అవుతుందా?
మీకు ఎంతగా బాబాను, మీ పరివారాన్ని పొందిన సంతోషం ఉందో దాని కంటే ఎక్కువగా
బాబాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలే ఇంటికి శృంగారం అని బాబాకు తెలుసు. ఎలా
అయితే ఏ వ్యక్తి కానీ, స్థానం కానీ శృంగారం లేకుండా మంచిగా అనిపించదో అదేవిధంగా
బాబాకు కూడా పిల్లల యొక్క శృంగారం లేకుండా మంచిగా అనిపించదు. విదేశీ ఆత్మలలో ఒక
విశేషత కారణంగా బాబాకు విశేషంగా ప్రేమ ఉంది. ఆ విశేషత ఏమిటి? భారతదేశంలో ఒక ఆట
ఆడుతూ ఉంటారు, అది ఏమిటంటే ఏవో కొన్ని వస్తువులు బట్టలో దాచి పెడతారు. ఆ దాచి
పెట్టిన వస్తువులను ఒకసారి తీసి పిల్లలకు చూపించి మరలా బట్టలో దాచి పెడతారు.
అప్పుడు పిల్లల బుద్ధికి పరీక్ష పెడతారు, ఆ చూసిన వస్తువులు ఏమిటో, ఎన్నో
చెప్పాలి. ఎవరు ఏ వస్తువులు ఎన్ని అనేది గుర్తు పెట్టుకుని చెప్తారో వారికి
నెంబర్ లభిస్తుంది. ఇలా బుద్ధికి సంబంధించిన ఆట పిల్లల చేత ఆడిస్తారు. అలాగే
విదేశీ పిల్లలు కూడా రకరకాలైన ధర్మాలు, రకరకాలైన ఆచారవ్యవహారాలు, రకరకాలైన
జీవిత విధానాలనే ఈ కవర్లలో దాచిపెట్టబడి ఉన్న బాబాని ఎవరు, ఎలా ఉంటారో అలా
తెలుసుకున్నారు. ఈ బుద్ధి యొక్క అద్భుతం కారణంగానే విదేశీ పిల్లలతో బాబాకు
విశేష స్నేహం ఉంది. అర్థమైందా?
ఈ బుద్ధి యొక్క ఆటలో కోట్లలో కొద్దిమందే పాస్ అయ్యారు.
అటువంటి పిల్లలను చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. మీరందరు కూడా
సంతోషిస్తున్నారా! బాబా ఎక్కువ సంతోషిస్తున్నారా లేక మీరు ఎక్కువ
సంతోషిస్తున్నారా? సదా “పొందవలసిందేదో పొందాము" అనే సంతోషం యొక్క పాట పాడుతూ
ఉండండి - ఈ సంతోషంలో ఉండటం ద్వారా ఏ విధమైన అలజడి, ఉదాసీనత రాదు అంటే మాయ
ప్రూఫుగా అయిపోతారు. మీ ఉదాహరణ బాప్ దాదా అందరికీ చూపించే విధమైన మాయా ప్రూఫుగా
అవ్వండి. ఇలా ఉదాహరణగా అయ్యారా? విశ్వం ముందు బాప్ దాదా మమ్మల్ని పెట్టే విధంగా
ఉదాహరణగా అయ్యాము అని ఎవరు అనుకుంటున్నారు? ఎవరెడీగా ఉన్నారా? రెడీగా కాదు.
విదేశీ పిల్లలకు ఒక విశేష లిఫ్ట్ కూడా ఉంది. అది ఏమిటంటే స్వయాన్ని విశ్వం ముందు
ప్రఖ్యాతి చేసుకుని బాబా పరిచయాన్ని ఇస్తున్నారు. ఈ సేవ చేయటం ద్వారా అదనపు
మార్కులు లభిస్తాయి. ఇటువంటి సేవ చేసారా లేక చేయాలా? భారతవాసీయులు మిమ్మల్ని
చూసి వీరు బాబాని గుర్తించారు. కానీ మేము గుర్తించలేదు అని అర్థం చేసుకుంటారు.
మీరు గ్రహించిన ముఖాన్ని చూసి భారతవాసీయులు మేము మా భాగ్యాన్ని పోగొట్టుకున్నాం
అని పశ్చాత్తాప పడతారు. అందువలనే మీరందరు సేవకు నిమిత్తులు కండి. ఇప్పుడు ఢిల్లీ
కాన్ఫరెన్స్ లో కూడా విదేశాల నుండి వచ్చిన మీ పిల్లలందరిలో విశేషంగా ఏ ఆత్మను
ఎవరు చూసినా ప్రతి ఒక్కరి ముఖం ద్వారా బాబా ద్వారా లభించిన అవినాశి సంతోషం,
అతీంద్రియ సుఖం యొక్క, అవినాశి శాంతి యొక్క మెరుపు కనిపించాలి. మీ అందరి ముఖం
బాబా ద్వారా లభించిన వారసత్వాన్ని చూపించే దర్పణంగా అవ్వాలి. ఇలా సేవ చేసేవారికి
బాప్ దాదా ద్వారా విశేషమైన మార్కుల యొక్క బహుమతి లభిస్తుంది. ఈ సేవ సహజమే కదా
లేక కష్టమా?
ఎలా అయితే ఎటువంటి లైట్ అయినా తప్పకుండా తన వైపు
ఆకర్షించుకుంటుందో అలాగే ఆత్మలైన మీరందరు కూడా లైట్, మైట్ స్వరూపులు. బాబా వైపు
ఆకర్షితం చెయ్యండి. కాన్ఫరెన్స్ లో ఏ సేవ చేయాలో అర్థమైందా? విదేశాలలో ఉండే
పిల్లల దగ్గరకు మాయ వస్తుందా? భయపడేవారు కాదు కదా? ప్రతిజ్ఞ చేసేవారే కదా? మాయకు
రా వచ్చి వీడ్కోలు తీసుకుని వెళ్ళు అని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా! మాయ రావటం
అంటే అనుభవీలుగా అవ్వటం. అందువలన మాయకు ఎప్పుడు భయపడకూడదు. భయపడితే అది కూడా
విరాఠరూపం ధరిస్తుంది. భయపడకపోతే నమస్కారం చేస్తుంది. మాయ ఏమీ కాదు, కాగితం పులి.
కాగితపు పులికి భయపడేవారా? విరాఠరూపం ధరిస్తుంది కానీ శక్తిహీనమైనది. ఎలా అయితే
ఇక్కడ కూడా భయంకరమైన ముఖాలు తగిలించుకుని భయ పెడతారు కదా కానీ లోపల మనిషే ఉంటారు.
బయటి కవరు తీసేస్తే భయం ఏమీ ఉండదు. కానీ ఒకవేళ బయటి రూపాన్ని చూసి భయపడితే
ఫెయిల్ అయిపోతారు. మాయతో ఓడిపోవటం ఎక్కువగా ఉంటుందా? విజయం పొందటం ఎక్కువగా
ఉంటుందా?
విదేశాల నుండి వచ్చిన పిల్లలలో "మేము 108 మాలలో మణులం” అని ఎవరు భావిస్తున్నారు?
నిశ్చయానికి విజయం లభిస్తుంది. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని బలహీనం చేసుకోకూడదు.
మేమే కల్ప పూర్వం విజయీలుగా అయ్యాము మరియు సదా అవుతాము అని సదా శ్రేష్ఠ లక్ష్యం
ఉంచుకోవాలి. అప్పుడు సదా స్వయాన్ని విజయీ రత్నంగానే అనుభవం చేసుకుంటారు.
చాలా దేశాల నుండి వచ్చారు. ఏయే దేశాల నుండి బాబా పిల్లలు వచ్చారో ఆ స్థానాలకు
కూడా గొప్పతనం ఉంటుంది. ఆ స్థానం కూడా ఏదో ఒక రూపంలో స్మృతిచిహ్నంగా అవుతుంది.
మీరు విశేషంగా ఆ స్థానాలలో చక్రం తిరుగుతూ ఉంటారు. (కరెంటు పోయింది) ఎలా అయితే
స్థూల వస్త్రాన్ని తీసేస్తామో అలాగే ఈ దేహాభిమానం అనే వస్త్రాన్ని కూడా ఒక్క
సెకనులో తీసేయాలి. ఇలా అశరీరీ స్థితి ఇంత సహజంగా ఉండాలి. ఎప్పుడు కావాలంటే
అప్పుడు ధారణ చేయాలి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతంగా అయిపోవాలి. కానీ ఏ
రకమైన బంధనాలు లేనప్పుడే ఈ అభ్యాసం అవుతుంది. ఒకవేళ మనసా సంకల్పంలో అయినా బంధన
ఉంటే అతీతం కాలేరు. ఎలా అయితే ఏదైనా బిగువైన వస్త్రం ఉంటే దానిని సహజంగా మరియు
త్వరగా తీయలేరు, అలాగే మనసా, వాచా, కర్మణా, సంబంధంలో తగుల్పాటు ఉంటే అతీతం
కాలేరు. ఈ విధమైన అభ్యాసం సహజంగా చేస్తున్నారా! ఏవిధమైన సంకల్పం చేస్తారో ఆ
స్వరూపంగా అయిపోండి. సంకల్పంతో పాటు స్వరూపంగా అయిపోతున్నారా? లేక సంకల్పం
చేసిన తర్వాత స్వరూపంగా అవ్వటానికి సమయం పడుతుందా? సంకల్పం చేయగానే అశరీరి
అయిపోండి. సంకల్పం చేయగానే మాస్టర్ ప్రేమసాగరుని స్థితిలో స్థితులైపోండి మరియు
ఆ స్వరూపంగా అయిపోండి. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని పెంచుకోండి. ఈ అభ్యాసం ద్వారానే
స్కాలర్ షిప్ తీసుకుంటారు. ఇప్పటివరకు విదేశీయులు ఒక ప్లాన్ ప్రత్యక్షంలోకి
తీసుకురాలేదు. ఏ ప్లాన్ ఇచ్చానో గుర్తు వచ్చిందా? ఇప్పుడు భారతదేశం యొక్క
కుంభకర్ణులు బాగా నిద్రపోతున్నారు. ఇప్పుడు కాన్ఫెరెన్స్ లో బిందువు ఎలా
వేస్తారో చూస్తాను. ఎవరైతే పూర్తి నిద్రలో ఉంటారో వారిపై నీటిని చిలకరించి
నిద్ర లేపాల్సి ఉంటుంది కదా! ఈ పద్ధతిని ప్రత్యక్షంలోకి తీసుకురండి. ఎవరైతే
భారతదేశం వారు వస్తారో వారు మేము కూడా మేల్కోవాలి, తయారవ్వాలి అని అనుకోవాలి.
అందరికి అనుకోకుండానే ఆ ధ్వని వైపు ధ్యాస వెళ్ళాలి. ఏ వైపు నుండైనా ఇలా ఎవరైనా
తయారు చేసారా?
అందరి సేవా స్థానాలు నడుస్తున్నాయా? అందరు స్వయం మరియు
సేవలో సంతుష్టంగా ఉన్నారా? మీరు చాలా అదృష్టవంతులు. మేము చాలా ప్రియమైన
అల్లారుముద్దు బిడ్డలం అని భావిస్తున్నారా? అన్ని సేవాకేంద్రాలలో పరుగులో నెంబర్
వన్ ఎవరు? ప్రతి దేశానికి విశేషత ఉంది. లండన్ అయితే నిమిత్తమైన కారణంగా
ప్లానింగ్ సెంటర్ అయ్యింది. ఈ విశేషత కారణంగా లండన్ ను నెంబర్ వన్ అంటారు. కానీ
సేవాధారులుగా మరియు ధ్వనిని వ్యాపింపచేసే విశేషమైన క్వాలిటీ సేవలో గయానా నెంబర్
వన్. సంఖ్య లెక్కలో అయితే మారీషియస్ నెంబర్ వన్. అన్నీ సహిస్తూ, పరిస్థితులను
దాటడంలో, అలజడి పరిస్థితులలో కూడా అచంచలంగా ఉండటంలో లుసాకా నెంబర్ వన్.
ఆస్ట్రేలియాకు కూడా విశేషత ఉంది. ఒక్కొక్క దీపం ద్వారా అనేక దీపాలను వెలిగించి
దీపమాల చేయటంలో నెంబర్ వన్. ఆస్ట్రేలియా ఇంకా ముందుకు వెళ్తుంది. ప్లానింగ్
బుద్ధి కూడా మరియు ప్లాన్స్ కూడా చాలా బాగా తయారు చేస్తారు. ఆ పద్దతులన్నీ
ప్రత్యక్షంలోకి తీసుకువస్తే లండన్ కంటే కూడా నెంబర్ వన్ అయిపోతుంది. కానీ
ఇప్పుడు ఆ ప్లాన్స్ బుద్ధి వరకే ఉన్నాయి. ప్రత్యక్షంలోకి తీసుకురాలేదు.
ఒక్కొక్కరత్నం విలువైనది కానీ మీ విలువను వేదిక వరకు
తీసుకురాలేదు. ఇది మారియా వారు చేయగలరు అని బాబా యొక్క ఆశ. త్యాగం మరియు తపస్య
అనే డ్రెస్ ధరించి వేదిక పైకి వస్తే విజయం మీ మెడలో హారంగా అయిపోతుంది. సేవ చేసి
ఎవరోకరిని మీ వెంట భారతదేశానికి తీసుకురండి. ఆస్ట్రేలియా యొక్క భూమి కూడా మంచిది.
జర్మనీ నుండి కూడా ధ్వనిని వ్యాపింపచేసే ఆత్మలు
వస్తారు. శ్రమ బాగా చేస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుండి కూడా ఎవరోకరు ప్రత్యక్ష
ఉదాహరణగా అవ్వాలి. వారిని ఎదురుగా చూస్తూనే ఆత్మలకు విశేషమైన ప్రేరణ లభించాలి.
కానీ ధైర్యం మరియు ఉల్లాసంలో నెంబర్ వన్. లేస్టర్ లండన్ లో ఉంది. లేస్టర్ వారిది
కూడా అద్భుతం. లేస్టర్ లో నిశ్చయబుద్ధి విజయంతి పిల్లలు చాలా మంచిగా ఉన్నారు.
పరివారం వారికి ఉదాహరణ ఇవ్వటానికి చాలా బాగా తయారయ్యారు. బాప్ దాదా మనస్సుకి
ఇష్టమైనవారు. నైరోబీ, బులవాయా వారు తీవ్ర పురుషార్థులు, సంలగ్నతలో
నిమగ్నమవ్వటంలో తక్కువ కాదు. ముందు నెంబరులో ఉన్నారు. దీపం యొక్క దీపపు
పురుగులుగా అయ్యే ఉదాహరణ ప్రత్యక్షంలో చూసారు కదా! అక్కడ నిమిత్తంగా అయిన ఆత్మలు
ఎక్కడైనా తన అనుభవాన్ని వినిపిస్తే వారి మాట కూడా కొద్దిగా పని చేస్తుంది.
హాంకాంగ్ యొక్క భూమిలో కూడా స్నేహి, సహయోగి ఆత్మల విశేషత ఉంది మరియు శక్తిశాలి
ఆత్మలు కూడా హాంకాంగ్ భూమిలో ఉన్నారు కానీ ఇప్పుడు దాగి ఉన్నారు. సమయం
వచ్చినప్పుడు హాంకాంగ్ లో దాగి ఉన్న రత్నాలు మీ అందరి ముందు కనిపిస్తారు. ప్రతి
ఒక్క విదేశీ కేంద్రానికి ఎవరి విశేషత వారికి ఉంది. అందువలన అందరు నెంబర్ వన్.
కెనడా కూడా ఇప్పుడు దీనిలో నెంబర్ తీసుకుంటుంది. రెడీ అవుతుంది. కెనడా భూమిలో
కూడా విశేషత ఉంది. అక్కడి నుండి ఎవరైనా ఒకరు వచ్చినా సహజంగానే ఒకరు అనేకులను
తీసుకు వస్తారు. నమ్మకదారులు ఒకరు వచ్చినా ఇక ఆలస్యం అవ్వదు. చివర వచ్చినా
వేగంగా ముందుకి వెళ్ళిపోతారు. శ్రమ కూడా మంచిగా చేస్తున్నారు, సంలగ్నత కూడా
మంచిగా ఉంది. శుభ భావన కూడా మంచిగా ఉంది. శుభ భావన తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది.
జానకి దాదీదే అద్భుతం. విదేశ భూమిలో సదా ఉత్సాహ,
ఉల్లాసాలు పెంచడానికి నిమిత్తమయ్యారు. సహయోగి హస్తాలు చాలా బాగున్నారు. వినాశన
సమయం సమీపంగా వచ్చేసరికి వాతావరణాన్ని చూసి మాకు బాబా పరిచయాన్ని ఇచ్చిన
ఫరిస్తాలు ఎవరు? అని సందేశం ఇచ్చినవారిని వెతుకుతారు. సేవలో ఎక్కడ పాదం పెట్టినా
అక్కడ సఫలత లభించకపోవటమనేది ఉండదు. కొన్ని భూములు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి,
కొన్ని భూములు ఫలించడానికి సమయం పడుతుంది. కానీ ఫలం తప్పకుండా ఇస్తుంది.
ఎలా అయితే భారతదేశంలో రైలులో వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో
మన సేవాకేంద్రాలు ఉంటాయో అదేవిధంగా విమానం కూడా ఎక్కడెక్కడ ఆగుతుందో అక్కడ
సేవాకేంద్రం ఉండాలి. విదేశీ ఆత్మల పరుగు మంచిగా నడుస్తుంది, జరగవలసిందే. మంచిది.