భక్తులు మరియు పాండవుల మొదలైన వారి చార్టు.
భక్తులకు భక్తి యొక్క ఫలం ఇచ్చే భగవంతుడు మరియు
పాండవులకు విశ్వ పరివర్తనార్థం శక్తిని, ప్రేమని మరియు సహయోగాన్ని ఇచ్చే ఆత్మిక
తండ్రి శివబాబా మాట్లాడుతున్నారు --
ఈరోజు బాప్ దాదా తన యొక్క మూడు రకాల పిల్లల యొక్క లెక్కాచారాన్ని చూస్తున్నారు.
ఆ మూడు రకాలు ఎవరు?
1. ముఖ వంశావళి బ్రాహ్మణులు. వీరు బాప్ దాదాతో పాటు
క్రొత్త ప్రపంచ స్థాపనా కార్యంలో సహయోగులు.
2. బాప్ దాదా లేదా బ్రాహ్మణుల యొక్క స్మరణలో లేదా
పిలవటంలో నిమగ్నమై ఉండే భక్తులు.
3. పాత ప్రపంచాన్ని పరివర్తన చేయటం కోసం నిమిత్తమైన
యాదవులు.
ఈ ముగ్గురి సంబంధం ద్వారా స్థాపన కార్యము సంపన్నం
అవుతుంది. అందువలనే ముగ్గురి కర్మల లెక్కాచారాన్ని చూస్తున్నారు. అయితే ఏమి
చూశారు? కార్యార్థం నిమిత్తం అయి ఉన్న ఈ మూడు రకాల పిల్లలు తమ తమ కార్యాల్లో
తప్పక నిమగ్నమై ఉన్నారు. కానీ ముగ్గురి కార్యకర్తల కార్యంలో తీవ్రతలో అతి
రాకపోతే అప్పటి వరకు అంతము కూడా అవ్వదు. ఎందుకంటే అంతిమానికి గుర్తు - అతి.
ముగ్గురిలో కర్మ యొక్క తీవ్రత ఉంది కానీ పూర్తి తీవ్రత కావాలి. అప్పుడే కార్యం
యొక్క కోర్సు సమాప్తి అవుతుంది.
భక్తుల లెక్కాచారాన్ని చూసినట్లయితే భక్తులకు అల్పకాలిక ఫలం ఏదైతే
ప్రాప్తిస్తుందో దానిలో 75% భక్తులు తమ పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కోసం
స్వార్థ స్వరూప భక్తులుగా ఉన్నారు. అందువలన వారి కర్మ ఫలం యొక్క ఖాతా సమాప్తి
కానున్నది. బాబా వారికి ఫలం ఇవ్వవలసిన పనిలేదు. మిగిలిన 25% భక్తులు నెంబర్
వారీగా సంలగ్నత అనుసారంగా భక్తి చేస్తున్నారు. వారి భక్తికి ఫలం ఈ పాత
ప్రపంచంలోనే లభించాలి. ఎందుకంటే భక్తి యొక్క ఖాతా ఇప్పుడు అర్ధకల్పం వరకు
సమాప్తి కానున్నది. వారి యొక్క గతి విధులను ఎలా చూశారంటే భక్తులకు కూడా వారి
భక్తి యొక్క ఫలితం - ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే పొందారు. అంటే
అల్పకాలిక సంలగ్నతకు ఫలితముగా ఇప్పుడే అల్పకాలికంగా ప్రాప్తి లభిస్తుంది.
భవిష్యత్తుకు జమా అవ్వదు. భక్తుల యొక్క ప్రాప్తి రూపం ఎలా ఉంటుందంటే వర్షాకాలం
చీమలకు రెక్కలు వస్తాయి, అవి చాలా సంతోషంతో ఎగురటం మొదలు పెడతాయి. కానీ అది
అల్పకాలికం. తిరిగి ఆ కాలంలోనే అది సమాప్తి అయిపోతుంది. అప్పుడే ప్రాప్తి
అప్పుడే సమాప్తి. అదేవిధంగా ఇప్పటి భక్తులు అంటే కలియుగీ తమోప్రధాన భక్తులు
అల్పకాలిక ఫలం యొక్క ప్రాప్తిలో సంతోష పడిపోయేవారు. అందువలన వారి యొక్క ఫల
ప్రాప్తి యొక్క కార్యము డ్రామానుసారం సమాప్తి కానున్నది. కేవలం 5% మందికి
ప్రాప్తి ఇవ్వాల్సిన సమయం మిగిలియుంది. కనుక ఇప్పుడు అతిగా అంటే పూర్తి శక్తితో
అరుస్తారు. విశేషమైన శక్తులని అడుగుతూ ఉంటారు. దీంట్లో కూడా విశేషంగా శక్తులను
పిలుస్తారు - వరదానం ఇవ్వండి, శక్తి ఇవ్వండి, ధైర్య సాహసాలు ఇవ్వండని. ఇప్పుడు
ఇది అతిలోకి వెళ్ళి మరలా సమాప్తి కానున్నది. కనుక భక్తుల లెక్కాచారం యొక్క
రిజిష్టరు సమాప్తి కానున్నది. మిగిలిన కొద్దిమందిది ఇప్పుడిప్పుడే కర్మ,
ఇప్పుడిప్పుడే ఫలం రూపంలో సమాప్తి అయిపోతుంది. ఇది భక్తుల సమాచారం.
రెండవది - యాదవ సేన యొక్క సమాచారం. వీరి యొక్క
లెక్కాచారంలో ఏమి చూసారు? ప్రతి అడుగులో వారికి ప్రశ్నార్థకం ఉండటం చూసారు.
వేగాన్ని పెంచడానికి చాలా ఛాత్రకులుగా ఉన్నారు. కానీ ఎంత వేగం పెంచుతున్నారో
అంతగా ప్రశ్నలనే గోడలు మాటిమాటికీ వస్తున్న కారణంగా వేగాన్ని పెంచలేకపోతున్నారు.
అవి ఏ ప్రశ్నార్ధకాలు? 1. ఎవరు మొదలు పెట్టాలి? నేను చేయాలా? వాళ్ళు చేస్తారా?
2. ఇప్పుడు చేయనా? తర్వాత చేయనా? 3. దీని ఫలితం ఎలా ఉంటుందో? ఇలా అప్పుడప్పుడు
క్రోధాగ్ని ప్రజ్వలితం అవుతుంది. మరలా ఏమవుతుందో అనే సంకల్ప రూపీ నీరు అగ్నిని
చల్లార్చేస్తుంది. 4. ఇదంతా చేసేవారు ఎవరు? ప్రేరకులు ఎవరు? దీనితో అయోమయం
అయిపోతున్నారు. వీరి యొక్క గతి, విధి ఏమి చూశారు? తమని తామే అర్థం
చేసుకోలేకపోతున్నారు. కాసేపు వివేకం, కాసేపు ఆవేశం ఇదే ప్రపంచంలో ఉన్నారు.
అందువలన తమతో తామే అలజడి అయిపోతున్నారు. ఏకాంతవాసిగా కావాలనుకుంటున్నారు కానీ
బుద్ది ఏకాగ్రం అవ్వటం లేదు. అందువలన మాటిమాటికీ ఆవేశంలోకి వచ్చేస్తున్నారు.
చాలా వేగంగా ప్లాన్ తయారుచేస్తున్నారు. పూర్తిగా అన్ని తయారుచేస్తున్నారు. సమయం,
సేన, శస్త్రములు, స్థానం అన్నీ తయారుచేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక అయిపోతుంది
అనుకుంటున్నారు. చాలా తీవ్రంగా తయారుచేస్తున్నారు. కానీ చివరకు చేసేటప్పుడు
అయోమయం అనే సిగ్నల్ పడిపోతుంది. తయారుగా ఉన్నారు కానీ ప్రేరకుల యొక్క ప్రేరణ
కోసం ఎదురుచూస్తున్నారు. తయారుగా ఉన్నారు కానీ ప్రేరకుల ప్రేరణ కోసం ఒక్క సెకను
తేడాతో ఉన్నారు. వారు ఒక్క సెకనులోకి చేరిపోయారు. అన్నీ తయారుచేసుకుని ఆ ఒక్క
సెకను కోసం ఎదురుచూస్తున్నారు. వారు సంపన్నంగా తయారయిపోయారు. ఇలా బాబా చూసారు.
వాళ్ళు వివేకం ద్వారా వాళ్ళకి వాళ్ళు పూర్తిగా తయారయిపోతున్నారు. సమాప్తి చేసేదే
మిగిలి ఉంది. ఇది యాదవుల సమాచారం. ఇప్పుడు మీది వినాలి అని కోరిక ఉందా?
ప్రేరణ ఇచ్చేవారు తయారుగానే ఉన్నారు. కానీ
తీసుకునేవారి పరిస్థితి ఎలా ఉంది? ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. తీసుకునేవారు
అలసిపోతున్నారు అంటారు. కానీ ఈ విషయంలో తీసుకునేవారు లభించని కారణంగా
అలసిపోతున్నారు. తీసుకునేవారు తీసుకోవడానికి తయారు ఉన్నారు. కానీ ఇచ్చేవాళ్ళు
ఇప్పటి వరకూ ఇంకా స్వయంతోనే నిమగ్నమై ఉన్నారు. ముఖ వంశావళి బ్రాహ్మణులలో ఏమి
చూసారు? అది మీకు తెలుసా? చెప్పాలా? విశ్వ పరివర్తన లేదా విశ్వకళ్యాణం యొక్క
శుభభావన ఎక్కువ మందిలో ఉంది. కానీ యాదవులలో ప్రశ్నార్ధకాలు అనే గోడలు ఎలా అడ్డు
వస్తున్నాయో, అలాగే బ్రాహ్మణులలో కూడా శ్రేష్ఠ భావనకు ప్రత్యక్ష ఫలం వస్తుంది.
కానీ మధ్య మధ్యలో కోరిక అనేది శుభకామనను సమాప్తి చేస్తుంది. బ్రాహ్మణుల గతి ఎలా
ఉందంటే శుభభావన, కోరిక రెండింటి ఆట నడుస్తుంది. ఏవిధంగా అయితే ముగ్గిన పండును,
అదేవిధంగా భావనకి లభించిన ఫలాన్ని కోరిక రూపీ పక్షి తినేస్తుంది. బ్రాహ్మణులకి
పరివర్తనా అయ్యే విధి లేని కారణంగా భావన కామనలోకి మారిపోతుంది. అందుకని
పురుషార్థం జ్వాలా రూపంగా ఉండటం లేదు. బ్రాహ్మణుల జ్వాలా రూపమే వినాశి జ్వాలా
రూపాన్ని ప్రజ్వలింప చేస్తుంది. అందువలన బ్రాహ్మణులలో ఇప్పుడు జ్వాలారూపం యొక్క
అంతిమ పురుషార్థం మిగిలి ఉంది. యాదవుల యొక్క కార్యం ఎలాగైతే సంపన్నం కానున్నదో
అలాగే పాండవుల యొక్క కార్యం కూడా సంపన్నం కానున్నది. పాండవుల కారణంగానే ఆగి
ఉన్నారు. పాండవుల యొక్క శ్రేష్ఠ ఆత్మిక స్వమానం యొక్క స్థితే యాదవుల యొక్క అలజడి
పరిస్థితి సమాప్తి చేస్తుంది. కాబట్టి మీ స్వమానం ద్వారా అలజడి ఆత్మలకి శాంతి
సుఖం యొక్క వరదానం ఇవ్వండి. అర్థం అయ్యిందా? ముగ్గురి పరిస్థితి విన్నారా?
మంచిది.
ఈవిధంగా జ్వాలా స్వరూప సర్వ వినాశీ కామనలని శ్రేష్ఠము
మరియు శుభభావనగా పరివర్తన చేసేవారికి, భక్తుల యొక్క అల్పకాలిక అంతిమ ఫలం ఇచ్చే
మహాదానులకి, వరదానం ఇచ్చే దాతలకు, సదా బాబా సమానంగా సర్వుల యొక్క మనో కామనలు
పూర్తి చేసేవారికి, సంపూర్ణ ఫరిస్తా ఆత్మలకి, బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు
మరియు నమస్తే.