ఆత్మిక దీపం మరియు మూడు రకాలైన ఆత్మిక దీపపు
పురుగులు.
అన్ని రకాల చక్రాల నుండి విడిపించి చక్రవర్తి
మహారాజుగా తయారు చేసేవారు, సదా జాగృతి జ్యోతి, ఆత్మిక దీపం అయిన పరమపిత శివుడు
అన్నారు --
ఈరోజు ఆత్మిక దీపం ఆత్మిక దీపపు పురుగులను
చూస్తున్నారు. దీపపు పురుగులన్నీ ఒకే దీపానికి స్వాహా అయ్యేటందుకు నెంబరువారీగా
తమ ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. నెంబరువన్ దీపపు పురుగులకి స్వయం యొక్క అంటే ఈ
దేహాభిమానం యొక్క రాత్రి పగలు, అకలి దప్పికల గురించి, తమ సుఖ సాధనాల గురించి,
విశ్రాంతి గురించి ఇలా ఏ విషయం యొక్క ఆధారం లేదు. దేహం యొక్క అన్ని రకాల
స్మృతులను కోల్పోయారా అంటే నిరంతరం దీపం యొక్క ప్రేమలో లవలీనం అయ్యారా? ఎలాగైతే
దీపం జ్యోతిస్వరూపమో, ప్రకాశ మరియు శక్తి రూపమో అదేవిధంగా దీపం సమానంగా స్వయం
కూడా ప్రకాశం మరియు శక్తి రూపమేనా? రెండవరకమైన దీపపు పురుగులు దీపం యొక్క
ప్రకాశం మరియు శక్తిని చూసి దీపానికి తప్పక ఆకర్షితం అవుతారు, దీపానికి సమీపంగా
వెళ్ళాలనుకుంటారు. సమానంగా అవ్వాలనుకుంటారు కాని దేహాభిమానం యొక్క స్మృతి లేదా
దేహ సంబంధాల యొక్క స్మృతి, దైహిక వైభవాల స్మృతి ఇలా దేహాభిమానానికి వశమై ఆ
తమోగుణి సంస్కారాల యొక్క స్మృతి దీపానికి సమీపంగా వెళ్ళే సాహసాన్ని లేదా
ధైర్యాన్ని ధారణ చేయనివ్వటం లేదు. ఇలా భిన్న భిన్న స్మృతుల యొక్క చక్రంలో
తిరుగుతూ సమయాన్ని పోగొడుతున్నారు.
మొదటి నెంబరు - లవలీన దీపపు పురుగులు అంటే బాబా సమాన
స్వరూపాన్ని మరియు శక్తులను ధారణ చేసేవారు, బాబా యొక్క సర్వ ఖజానాలను స్వయంలో
నింపుకునేవారు. సమానంగా అయ్యేవారు అంటే లీనం అయిపోయేవారు అంటే అర్పణ అయిపోయేవారు.
రెండవ నెంబరు - అనేక రకాలుగా చుట్టు తిరిగేవారు అంటే
అనేక స్మృతులనే చక్రం తిరిగేవారు. వారు లీనం అయిపోయేవారు, వీరు ఆలోచించేవారు.
మూడవ నెంబరు - వీరు దీపాన్ని చూసి ఆకర్షింపబడతారు కూడా,
ఆలోచిస్తారు కూడా కానీ సంశయం యొక్క చక్రంలో ఉంటారు. అంటే రెండు పడవల్లో కాలు
పెట్టాలనుకుంటారు. అంటే మాయ యొక్క అల్పకాలిక సుఖాలను కోరుకుంటారు మరియు దీపం
ద్వారా అంటే బాబా ద్వారా అవినాశి ప్రాప్తిని కూడా కావాలనుకుంటారు. వీరు
మాటిమాటికీ అడుగుతూ ఉండేవారు. రెండవ నెంబరు వారు ఆలోచించేవారు, వీరు అడుగుతూ
ఉండేవారు - ఇలా చేయనా, వద్దా? ప్రాప్తి లభిస్తుందా, లభించదా? అవుతుందా, అవ్వదా?
కష్టమా, సహజమా? ఈ ఒక్క మార్గమే సరైనదా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? .... ఇలా స్వయంతో
లేదా ఇతర అనుభవీ ఆత్మలను అడిగేవారిగా ఉంటారు. కోరిక ఉంది కానీ కోరికంటే ఏమిటో
తెలియనివారిగా అయ్యే సాహసం లేదు. కలుసుకోవాలని కూడా అనుకుంటారు కానీ జీవిస్తూ
చనిపోవాలని అనుకోరు. జీవిస్తూ చనిపోవటంలో లేదా వదలటంలో హృదయం బద్దలైపోతుంది. ఇలా
మూడు రకాలైన పురుగులు దీపం దగ్గరకి వస్తాయి.
నేను ఎటువంటి దీపపు పురుగు? అని మిమ్మల్ని మీరు అడగండి.
అనేక రకాల స్మృతులనే చక్రాలన్నీ సమాప్తి అయిపోయాయా లేక ఇప్పటికీ కూడా ఏదోక చక్రం
తనవైపుకి ఆకర్షించుకుంటుందా? ఒకవేళ ఇప్పటికీ కూడా ఏదోక వ్యర్థ స్మృతి అనే చక్రం
తిరుగుతూ ఉంటే స్వదర్శన చక్రధారి అనే సంగమయుగి బ్రాహ్మణుల బిరుదు పొందలేరు.
స్వదర్శన చక్రధారియే కాదు; భవిష్యత్తులో చక్రవర్తి రాజుగా కూడా కాలేరు. 63
జన్మలు భక్తిమార్గంలో అనేక రకాల వ్యర్థ చక్రాలు తిరగటంలో సమయం పోగొట్టుకున్నారు.
అదే సంస్కారం ఇప్పుడు అంటే సంగమయుగంలో కూడా వద్దనుకున్నా కానీ ఎందుకు
వచ్చేస్తుంది? చుట్టు తిరగటంలో ప్రాప్తి అనుభవం అవుతుందా లేక నిరాశ అయిపోతారా?
63 జన్మలు తిరుగుతూ అన్నీ పోగొట్టుకుని స్వయాన్ని మరియు బాబాని మర్చిపోయారు.
అయినా కానీ ఇప్పటికీ ఇంకా అలసిపోలేదా? గమ్యం దొరికినా కానీ ఎందుకు
తిరుగుతున్నారు? అవినాశి ప్రాప్తి లభిస్తున్నా కానీ వినాశి అల్పకాలిక అప్రాప్తి
ఇప్పుడు కూడా ఆకర్షిస్తుందా? ఇప్పటికి కూడా ఇతరులు ఎవరైనా గమ్యానికి
చేర్చేవారిగా కనిపిస్తున్నారా? శ్రేష్ట గమ్యాన్ని తెలుసుకుని కూడా అవసర సమయంలో
ఉపయోగపడుతుందని అల్పకాలిక గమ్యాన్ని కూడా చూసుకుని ఉంచుకున్నారా? ఇలా చాలా
చతురమైనవారు కూడా చాలామంది ఉన్నారు. తీసుకునే సమయంలో తీసుకోవటంలో అందరూ
తెలివైనవారు కానీ వదిలే సమయంలో బాబాకి చతురత చూపిస్తున్నారు. ఏమి చతురత
చూపిస్తున్నారు? వదిలే సమయంలో భోళాగా అయిపోతున్నారు. పురుషార్థులం, సమయానికి అవే
పోతాయి, పరిస్థితులు ఆవిధంగా ఉన్నాయి, కర్మలఖాతా కఠినంగా ఉంది,
చేయాలనుకుంటున్నాను కానీ ఏం చేయను? నెమ్మది నెమ్మదిగా అదే అయిపోతుంది ఇలా భోళాగా
విషయాలు తయారుచేస్తున్నారు. జ్ఞాన సాగరుడైన బాబాకే జ్ఞానం చెప్పటం
ప్రారంభిస్తున్నారు. కర్మల గుహ్యగతి జ్ఞాతకే తమ కర్మకథలను వినిపిస్తున్నారు
మరియు తీసుకునే సమయంలో మాత్రం చతురులు అయిపోతున్నారు. చతురతతో ఏమంటున్నారంటే -
బాబా నీవు దయాహృదయుడవు, వరదాతవు. నేను కూడా అధికారిని, నీ బిడ్డగా అయ్యానంటే
పూర్తి అధికారం నాకు లభించాలి అని అంటున్నారు. తీసుకోవటంలో పూర్తిగా తీసుకోవాలి
కానీ వదలటంలో ఎంతో కొంత దాచుకోవాలి అంటే ఏదోక తమ పాత సంస్కారాన్ని, స్వభావాన్ని
లేదా సంబంధాన్ని కూడా వెనువెంట ఉంచుకుంటున్నారు. అంటే చతురులే కదా? తీసుకునేది
పూర్తిగా కానీ ఇచ్చేది మాత్రం శక్తిననుసరించి. ఇలా చతురత చూపించేవారు ఏ పదవి
పొందుతారు? ఇటువంటి చతుర పిల్లలకు డ్రామానుసారం ఏ చతురత జరుగుతుంది? స్వర్గానికి
అయితే అందరూ అధికారి అయిపోతారు. కానీ రాజధానిలో నెంబరువారీగానే ఉంటారు కదా!
స్వర వారసత్వాన్ని బాబా అందరికీ ఇస్తారు కానీ పదవి మాత్రం ప్రతి ఒక్కరి తమ
నెంబరు అనుసరించి లభిస్తుంది. అందువలన డ్రామానుసారం ఎటువంటి పురుషార్ధమో అటువంటి
పదవి స్వతహాగానే ప్రాప్తిస్తుంది. బాబా నెంబరు తయారుచేయటం లేదు; కొందరిని
రాజులుగా తయారుచేసే జ్ఞానం, కొందరికి ప్రజలుగా తయారుచేసే జ్ఞానం చెప్పటం లేదు.
ఇలా వేర్వేరుగా చెప్పటం లేదు; సూర్యవంశీయులని, చంద్రవంశీయులని వేర్వేరుగా
చదివించటం లేదు. కొందరికి మహారథి అని, కొందరికి గుఱ్ఱపు సవారీ అనే ముద్ర వేయటం
లేదు కానీ డ్రామానుసారం ఎటువంటి మరియు ఎంత ఎవరు చేసుకుంటారో అంత పదవిని పొంది
వెళ్తారు. అందువలన తీసుకోవటంలో ఎలా అయితే చతురులు అవుతున్నారో అదేవిధంగా
ఇవ్వటంలో కూడా చతురులు అవ్వండి, భోళాగా అవ్వకండి. మాయ యొక్క చతురతని తెలుసుకుని
మాయాజీత్ అవ్వండి. ఒకే యధార్థ గమ్యానికి బదులు ఏదైనా అల్పకాలిక గమ్యం ఇప్పటికీ
మిగలలేదు కదా అని పరిశీలించుకోండి. వద్దనుకున్నా కానీ బుద్ది అక్కడికి
వెళ్ళిపోతుందా? బుద్ధి ఎక్కడికైనా వెళ్తుందంటే మరో గమ్యం ఏదో ఉన్నట్లు. కనుక
హద్దులోని గమ్యాలన్నింటినీ పరిశీలించుకుని ఇప్పుడు సమాప్తి చేసుకోండి. లేకపోతే
ఇవి సదాకాలిక శ్రేష్ఠ గమ్యం నుండి దూరం చేస్తాయి. ఇలా చేయండి అని బాబా స్పష్టంగా
శ్రీమతం ఇస్తున్నారు కానీ పిల్లలు ఇలా అనే దానిని ఎలా అనే దానిలోకి
మార్చేసుకుంటున్నారు. ఎలా అనే దానిని సమాప్తి చేసి బాబా ఎలా నడిపిస్తున్నారో అలా
నడవండి. మంచిది.
ఈవిధంగా దీపం సమానంగా లైట్హౌస్, మైట్హౌస్ అయ్యే
నెంబర్ వన్ దీపపు పురుగులకి, అనేక చక్రాలను సమాప్తి చేసి స్వదర్శనచక్రధారిగా
అయ్యేవారికి, విశ్వయజమానిగా అయ్యే అధికారాన్ని ప్రాప్తింప చేసుకునేవారికి, ప్రతి
అడుగు బాబా శ్రీమతానుసారంగా వేసేవారికి, ఒక్క అడుగులో కోటానుకోట్ల శ్రేష్ఠ
సంపాదన చేసుకునేవారికి, సదా లవలీనంగా ఉండే దీపపు పురుగులకి దీపం అయిన బాబా
యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.