ప్రియమైన బిడ్డగా అయ్యి మీ స్థితిని యోగయుక్తంగా
మరియు యుక్తియుక్తంగా తయారుచేసుకోండి.
నిర్బల ఆత్మలను బలవాన్ గా తయారుచేసేటువంటి ,
సర్వాత్మల సంస్కారాలను లేదా స్వభావాలను శ్రేష్టంగా తయారుచేసేటువంటి
జ్ఞానసాగరుడైన బాబా మాట్లాడుతున్నారు -
ఈ రోజు విశేషంగా బాబా ఎవరిని కలుసుకునేటందుకు వచ్చారు? ఈ రోజు ఈ సంఘటన ఏ సంఘటన?
బాప్ దాదా ఈ సంఘటనను చూస్తూ సంతోషిస్తూ ఇదే టైటిల్ ఇస్తున్నారు - బాప్ దాదాకి
ప్రియమైన పిల్లల యొక్క సంఘటన అని. ఎవరైతే ప్రియమైన పిల్లలుగా ఉంటారో వారు బాబాతో
కలిసి అడుగుపై అడుగు వేస్తూ ప్రతి కార్యంలో సదా మరియు స్వతహగా సమయోగిగా అవుతారు.
వారు తయారవ్వాలని ఉండదు మరియు తయారవ్వడానికి ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు.
ప్రియమైన పిల్లలు స్నేహ సంబంధంతో సదా సహయోగిగా ఉంటారు. ప్రియమైన పిల్లలకు
డ్రామానుసారం స్నేహనికి బదులు వరదాన రూపంలో సహయోగిగా అవ్వటం సహజంగా
ప్రాప్తిస్తుంది. నేను ప్రియమైన బిడ్డను అని అనుకోండి. ప్రియమైన బిడ్డ యొక్క
స్థితి సదా యోగయుక్తంగా మరియు యుక్తీయుక్తంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డ అంటే బాబా
సమానంగా సర్వగుణాల స్వరూపంగా బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను సాకారం
చేసేవారినే ప్రియమైన బిడ్డ అని అంటారు. ఇది ఆవిధమైన గ్రూప్ మరియు వీరు సేవకు
నిమిత్తమైన బాధ్యతాధారి ఆత్మలు.
సేవార్థం నిమిత్తం అని అందరు అంటారు. అంటే బాబా యొక్క
గుణాలను సాకారం చేసేటందుకు నిమిత్తులు, దీనినే సేవ అని అంటారు. దానాన్ని వర్ణన
చేయటమనేది సాధారణ విషయం , ఇది సేవ కాదు. సేవా విశేషత ఏమిటంటే - బాబా యొక్క
సర్వగుణాల స్వరూపంగా అయ్యి మీ స్వరూపం ద్వారా బాబా యొక్క సాక్షాత్కారం చేయించాలి.
వినటం, వినిపించటం ఇదైతే ద్వాపరయుగం నుండి నడుస్తూ వస్తుంది. కానీ మీ
విశేషాత్మల విశేషత ఏ విషయంలో ఉంటుంది? బాబా సమానంగా అయ్యి సర్వులకు బాబా యొక్క
సాక్షాత్కారం చేయించాలి మరియు సాక్షాత్ స్వరూపంగా అయ్యి సాక్షాత్కారం చేయించాలి.
ఇది కేవలం విశేషాత్మలే చేయగలరు. ఇక ఏ ఆత్మ చేయలేదు. భక్తిమార్గం వారు చేయలేరు
మరియు జ్ఞానమార్గంలో సాధారణ ఆత్మలు కూడా చేయలేరు. ప్రియమైన పిల్లల కర్తవ్యం కూడా
విశేషంగా ఇదే.
సాధారణ ఆత్మలలో మరియు విశేషాత్మలలో ముఖ్యంగా ఏ విషయంలో
తేడా ఉంటుంది? ఏదైనా గుహ్యమైన తెడా చెప్పండి. ముఖ్యమైన తేడా ఇదే - విశేషాత్మల
నోటి ద్వారా మరియు వారి అనుభవం ద్వారా ప్రతి ఆత్మకు ఒక సెకనులో మరియు చాలా
సహజంగా డైరెక్ట్ బాబాతో సంబంధం జోడించబడిపోతుంది. మరియు ఎవరైతే సాధారణాత్మలు
ఉంటారో వారు మధ్యలో ఎవరైతే దళారిగా అవుతారో మొదట దళారి దగ్గర ఆగి తర్వాత బాబాతో
డైరెక్ట్ సంబంధం పెట్టుకుంటారు. సాధారణాత్మల సేవా ఫలితంలో వచ్చే ఆత్మలు అంత
శక్తిశాలిగా అవ్వరు, ఎవరైతే సహజంగా మరియు చాలా తొందరగా బాబాతో సంబంధం
జోడింపచేయడానికి నిమిత్తంగా అవుతారో, వారు ఎవరికి నిమిత్తం అవుతారో, వారు కూడా
శ్రమను అనుభవం చేసుకుంటారు. శ్రమ, కష్టం మరియు సమయం పడుతుంది. ఏం చేయము, ఎలా
చేయము ఇది అవుతుందా లేక లేదా ఈ ప్రశ్నలు వారి ఎదురుగా వస్తాయి. కానీ విశేషాత్మ
తన విశేషత ఆధారంగా, తన శక్తి ఆధారంగా ఈ ఎందుకు మరియు ఎలా అనే ప్రశ్నలు సమాప్తి
చేసుకుంటారు. వారు శ్రమ మరియు కష్టం అనుభవం చేసుకోరు. రావటంతోనే ప్రతి ఒక్కరు
ఇది నేను పోగొట్టుకున్న పరివారం మరియు మర్చిపోయిన తండ్రిని నాకు మరలా లభించారు
అని అనుభవం చేసుకుంటారు. ఇటువంటి తండ్రిని నేను ఎలా మర్చిపోయాను? నేను ఎలా
మర్చిపోయాను అని అనిపిస్తుంది. విశేషాత్మలకు మరియు సాధారణాత్మలకు ఇదే ముఖ్యమైన
తేడా. సాధారణాత్మ బాబాతో డైరెక్ట్ సంబంధం జోడింపచేయడానికి ప్రయత్నం చేస్తుంది.
కానీ ఈ రోజుల్లో నిర్భల ఆత్మలకు కేవలం తన బలం అవసరం లేదు. ఎందుకంటే కేవలం జ్ఞానం,
యోగం ఆధారంగా నడవలేరు, వారికి పూర్తిగా, నిమిత్తంగా అయిన ఆత్మల యొక్క శక్తి
యొక్క సహయోగం కావాలి. దీనితో వారు జంప్ చేస్తారు.
రోజు రోజుకి మీ దగ్గరకు వచ్చే ఆత్మలు అతి నిర్భల
స్థితిలో ఉన్నవారే వస్తారు. ఎలా అయితే మీరు మొదటి గ్రూపులో వచ్చినప్పుడు మొదటి
గ్రూప్ యొక్క ధైర్యానికి మరియు శక్తికి, రెండవ గ్రూప్ యొక్క ధైర్యానికి మరియు
శక్తికి మరియు మూడవ గ్రూప్ యొక్క ధైర్యానికి మరియు శక్తికి తేడా కనిపిస్తుంది
కదా! అలాగే ఇప్పుడు వచ్చే క్రొత్త క్రొత్త ఆత్మలు ఇప్పుడు ఎవరైతే వస్తారో వారి
ధైర్యం మరియు శక్తిలో తేడా వస్తుంది. తనువుతో కూడా మరియు మనస్సుతో కూడా ప్రతి
గ్రూపులో తేడా కనిపిస్తుంది. ఇదైతే అందరికి అనుభవం ఉంది కదా? ఈ లెక్కతో
ఆలోచిస్తే చివర వచ్చే ఆత్మలు ఎలా ఉంటారు? చాలా నిర్బలంగా ఉంటారు కదా? అటువంటి
నిర్భల ఆత్మలకు కేవలం జ్ఞానం ఇవ్వటం, వారికి కోర్స్ చెప్పటం, మరియు యోగంలో
కూర్చోపెట్టటం వారు వీటి ద్వారా ముందుకి వెళ్ళరు. ఇప్పుడు నిమిత్తంగా అయిన
ఆత్మలు మీ ప్రాప్తుల యొక్క శక్తుల ద్వారా నిర్బల ఆత్మలకు శక్తి ఇస్తూ ముందుకి
తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. దీని కొరకు ఇప్పటి నుండి మీలో సర్వశక్తుల యొక్క
స్టాక్ జమ చేసుకోండి. ఎలా అయితే స్థూలభోజనం యొక్క గుంపు ఉంటుందో అలాగే మీ
దగ్గరకు శక్తిని తీసుకునేటందుకు గుంపు పెడతారు. దీని కొరకు మీరు మొదటే స్టాక్
జమ చేసుకోవాలి. ద్రౌపది యొక్క వంట పాత్రకు మహిమ ఉంది కదా! మీరందరు ద్రౌపదులే కదా?
ద్రౌపది అంటే యజ్ఞమాత యొక్క వంట. పాత్రకు రెండు విషయాలలో గొప్పతనం ఉంది. ఒకటి
స్థూల సాధనాలకు ఏ లోటు ఉండదు మరియు రెండవది సర్వశక్తుల యొక్క లోటు ఉండదు. సర్వ
శక్తులతో సంపన్నంగా వంట పాత్ర ఎప్పుడు ఖాళీగా ఉండదు. భలే ఎంత మంది వచ్చినా ఎంత
పెద్ద గుంపుగా వచ్చినా ఎవరు ఆకలితో ఉండరు. ఇక ముందు ప్రకృతి ప్రకోపించినప్పుడు
మరియు ఆపదలు వచ్చినప్పుడు అందరు పొట్ట నింపుకునేటందుకు వస్తారు. ఆ సమయంలో ఏ
వస్తువు అవసరం ఉంటుంది? ఆ సమయంలో అందరిలో ఏ ఆకలి ఉంటుంది? అన్నం యొక్క లోటుయా
లేదా ధనం యొక్క లోటుయా? అప్పుడు శాంతి మరియు సుఖం యొక్క ఆకలితో ఉంటారు. ఎందుకంటే
ప్రాకృతిక ఆపదల కారణంగా ధనం ఉన్నప్పటికీ ధనం పనిచేయదు. సాధనాలు ఉన్నప్పటికీ
సాధనాల ద్వారా ప్రాప్తి లభించదు. ఎప్పుడైతే అందరికి స్థూల సాధనాలతో లేదా స్థూల
ధనంతో ఏ ప్రాప్తి యొక్క ఆశ ఉండదో ఆసమయంలో అందరి సంకల్పం ఏమి ఉంటుంది! ఎవరైనా
శక్తి ఇవ్వాలి. ఈ ఆపదల నుండి దాటించాలి మరియు ఎవరైనా శాంతి ఇవ్వాలి అనే సంకల్పం
వస్తుంది. ఇలా చాలా గుంపు తయారుకానున్నది. ఆ సమయంలో నీటి యొక్క ఒక్క బిందువు
కూడా ఎక్కడ కనిపించదు. ధాన్యం కూడా ప్రకృతి ఆపదల కారణంగా తినడానికి యోగ్యంగా
ఉండదు. మరి ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? అటువంటి పరిస్థితులను సహించే ధైర్యం ఉందా?
ఆ సమయంలో యోగం చేస్తారా లేక దాహం వేస్తుందా? ఆ సమయంలో ఒకవేళ బావి కూడా ఎండిపోతే
ఏం చేస్తారు? ఇది విశేషాత్మల గ్రూప్. కనుక పురుషార్ధం కూడా విశేషంగా ఉండాలి కదా!
ఇంత సహనశక్తి ఉందా? మహిమ ఉంది కదా - నలువైపుల నిప్పు అంటుకున్నా కానీ భట్టీలో
ఉన్నటువంటి పిల్లి పిల్లలు ఎంత సురక్షితంగా ఉన్నాయి. అంటే వాటికి సెగ కూడా
తగలలేదు. మరి స్వయాన్ని ఇలా ఎందుకు అనుకోవటం లేదు? మీరు ఈ నిశ్చయంతో ఎందుకు
చెప్పటంలేదు? ఒకవేళ యోగయుక్తంగా ఉంటే సమీపంగా ఉన్న స్థానంలో నష్టం జరిగినా, నీరు
వచ్చేసినా కానీ, బాబా ద్వారా నిమిత్తంగా అయిన స్థానాలు రక్షణగా ఉండిపోతాయి. అది
కూడా మీ పొరపాటు లేకపోతేనే. ఒకవేళ ఇప్పటి వరకు ఎక్కడైనా నష్టం జరిగింది. అంటే
అది మీ బుద్ధి యొక్క నిర్ణయం లోపంగా ఉన్నట్లే. మహారథులు, విశాలబుద్ధి కలిగినవారు
మరియు సర్వశక్తుల వరదానం పొందినవారు ఏ స్థానంలో ఉంటున్నా అక్కడ శూలం ముళ్ళుగా
అయిపోతుంది. అంటే రక్షణగా ఉంటారు. ఎటువంటి సమయంలో అయినా శక్తుల స్టాక్ జమ అయ్యి
ఉంటే శక్తులు ప్రకృతిని మీకు దాసీగా చేసేస్తాయి. అంటే సాధనాలు స్వతహగా లభిస్తాయి.
ఆదిలో పేపర్లలో ఓం మండలి ప్రపంచంలోకెల్లా ధనవంతమైనది
అని వచ్చింది. ఇదే విషయం మరలా అంతిమంలో అందరి నోటి నుండి వస్తుంది. కానీ ఈ
ధ్యాస తప్పకుండా పెట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా శక్తి లోపంగా ఉంటే ఎక్కడోక్కడ
మోసపోయినట్లు కూడా అనుభవం అవుతుంది. అందువలన ఇప్పుడు పురుషార్ధం ఈ లోతైన
విషయాలపై చేయాలి. ఎవ్వరికి దు:ఖం ఇవ్వలేదు, పరిపాలనా శక్తి వచ్చిందా లేక లేదా
ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, ప్రియమైన పిల్లల పురుషార్ధం ఇప్పటి వరకు ఈ విషయాల
వరకే ఉండకూడదు. ఇప్పుడు సర్వ శక్తుల స్టార్ ను జమ చేసుకునే పురుషార్థం ఉండాలి.
ప్రియమైన పిల్లలు ఎవ్వరిపై కోప్పడలేదు కదా లేదా ఎవరు అసంతుష్టం అవ్వలేదు కదా అని
రోజు ఈ చార్ట్ ఉండకూడదు. ఇలా స్థూల విషయాల పరిశీలన అనేది - గుఱ్ఱపు సవారీల మరియు
కాల్బలం వారి పని. ప్రియమైన పిల్లల పురుషార్ధం ఇప్పుడు ఈ విషయాలలో ఉండకూడదు.
ఇప్పుడు సర్వ శక్తులు నింపుకునే పురుషార్థం చేయాలి. ఒక శక్తి అయినా లేదు అంటే
వారిని ప్రియమైన పిల్లల లిస్ట్ నుండి తీసేయాలి. 6 శక్తులు నాలో ఉన్నాయి, మరియు
8 శక్తులలో రెండు లేవు, 50 శాతం అయితే ముందుకి వెళ్ళాను ఇలా దీనిలో సంతోషం
అయిపోకూడదు. ముఖ్యంగా అష్టశక్తులు అని చెప్తారు కానీ సర్వశక్తులు ఉండాలి. కేవలం
అష్టశక్తులే కాదు కదా, చాలా శక్తులున్నాయి. ఇవి చెప్పడానికి సహజంగా ఉన్నాయి.
కనుక అష్టశక్తులు అని చెప్పారు. ఇప్పుడు ఏ ఒక శక్తి యొక్క లోపం ఉండకూడదు.
ఎందుకంటే ఇప్పుడు ఏ శక్తి లోపంగా ఉందో ఆ శక్తియే పరీక్ష రూపంలో వస్తుంది. అంటే
ప్రతి ఒక్కరికి డ్రామానుసారం పరీక్షలో అదే ప్రశ్న వస్తుంది. అందువలనే సర్వగుణ
సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా మరియు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి.
ఒకవేళ ఒక శక్తి లోపంగా ఉన్నా శక్తులు అని అంటారు. కానీ సర్వశక్తులు అని అనరు.
ప్రియమైన పిల్లలు అంటే మాస్టర్ సర్వశక్తివాన్. ప్రియమైన పిల్లలు అంటే మర్యాదా
పురుషోత్తములు. మర్యాదాపురుషోత్తములకు సంకల్పం కూడా మర్యాదకు వ్యతిరేకంగా నడవదు.
మీరు మీ నడవడికను మర్యాద లేదా ఈశ్వరీయ నియమ ప్రకారం నడిపించుకుంటున్నారు అంటే
మర్యాదా పురుషోత్తములే కదా!
బాప్ దాదా ఈ సంఘటన రూపి రూపురేఖ గురించి విన్నారు
మరియు చూసారు కూడా! చాలా మంచిగా చూసారు మరియు చాలా మంచిగా విన్నారు. నగ తయారు
చేసేటప్పుడు మొదట బంగారంతో దాని నమూనా తయారుచేసి తర్వాత దానిలో వజ్రాలు
పొదుగుతారు. నగ అయితే చాలా మంచిగా మంచి మంచి వ్యాపారస్తులు తయారుచేసారు, మంచి
డిజైన్ తయారుచేసారు. కానీ దానిలో ఇప్పటి వరకు రత్నాలు జోడించలేదు. ప్లాన్
ప్రత్యక్షంలోకి తీసుకువచ్చినప్పుడే అవి జోడించగలరు. మంచిగా తయారుచేసారు అంటే
ప్లాన్ మంచిగా వేసారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్ని అమూల్య రత్నాలతో
స్వయాన్ని అంటే నగలను శ్రేష్టంగా తయారుచేసుకుంటున్నారా అనేది చూసుకోవాలి.
ఇప్పుడు ఆ ఫలితం చూస్తాను. జ్ఞానస్వరూపులుగా అయితే అయ్యారు. కానీ ఇప్పుడు
సమయానుసారం శక్తిశాలిగా అయ్యే అవసరం ఉంది. జ్ఞానస్వరూపం యొక్క నగను అయితే
తయారుచేసారు మరియు ఇప్పుడు శక్తిశాలి నగను తయారు చేయటమే మిగిలి ఉంది. మంచిగా
చుట్టుముట్టారు. ఒకరి చేయితో ఒకరి చేయి కలిసింది అంటే చుట్టుముట్టడం జరిగింది
కదా? ఇప్పుడు ఇక ముందు ఏమి చేయాలి? చేయి కలిపినవారు ఎప్పుడైనా బలహీనం అయినా లేదా
అలసిపోయిన వారిని బలహీనం కానివ్వకూడదు. అలా అలసిపోయిన చేతిని కూడా అలసిపోనిదిగా
చేయాలి, అప్పుడే సఫలత లభిస్తుంది. ఈ సంఘటనలో సఫలత తీసుకురావాలి. స్వయాన్ని తయారు
చేసుకోవటంలో కాదు, సంఘటనను గట్టిగా చేయటం, సహయోగులను ఉత్సాహ, ఉల్లాసాలలోకి
తీసుకురావటం ఇదే సంఘటన యొక్క సఫలత. ఇతరుల పొరపాటుని తమ పొరపాటుగా భావించినప్పుడే
సంఘటనను సఫలం చేయగలరు. ఒకరి యొక్క లోపాన్ని, అలసటను, లేదా బలహీనతను చూస్తూ
స్వయము ఆ సాంగత్యం యొక్క అలలోకి రాకూడదు. ఫలానా వారు అలా చేస్తున్నారు కనుక నేను
కూడా చేస్తాను, ఫలానా వారు చేసారు కనుక నేను చేస్తే ఏమిటి? ఈ సంకల్పం కలలోకి
కూడా రానివ్వకూడదు అప్పుడే సఫలత వచ్చింది అని భావించండి.
మధువన నివాసీయులు కూడా అదృష్టవంతులు. మధువన నివాసీయుల
ఫలితం ఉత్సాహ, ఉల్లాసాలు మరియు అలసిపోనివారిగా ఉండటంలో మంచిగా ఉన్నారు. ఇక ముందు
కొరకు కూడా మాయాప్రూఫ్ గా అవ్వండి. ఎలా అయితే వాటర్ ఫ్రూఫ్ ఉంటుంది కదా? అలాగే
మధువన నివాసీయులు మాయాప్రూఫ్ అవ్వాలి. అర్ధమైందా!
ఇలా స్వయాన్ని మరియు సర్వాత్మలను శక్తిశాలిగా
తయారుచేసేవారికి, నిర్బల ఆత్మలను బలవాన్ గా తయారుచేసేవారికి, సంఘటనలో ఇతరుల
యొక్క లోపాన్ని స్వయం యొక్క లోపంగా భావించి తొలగించుకునేవారికి, సర్వశక్తివాన్
బండారీ మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు, సదా స్వయంతో మరియు సర్వులతో సంతుష్టంగా
ఉండేటువంటి సంతుష్ట మణులకు, బాప్ దాదా మరియు సర్వుల మనస్సుపై విజయం పొందేవారికి
అంటే సర్వాత్మల స్వభావాలను మరియు సంస్కారాలను బాబా సమానంగా తయారుచేసుకునేవారికి,
అటువంటి విజయీ రత్నాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, శుభరాత్రి మరియు నమస్తే.