మురళీలో ఇచ్చిన సలహల ద్వారానే అన్ని లోపాల నుండి
విడిపించబడతారు.
దృష్టి మరియు వృత్తిని సత్వప్రధానంగా తయారుచేసేటువంటి,
కర్మబంధన నుండి ముక్తి ఇప్పించేటువంటి, సర్వశక్తుల యొక్క తాళంచెవిని ప్రదానం
చేసేటువంటి అతి మధురమైన శివబాబా అడుగుతున్నారు -
స్వయాన్ని మహదానిగా, సర్వశక్తుల అధికారిగా, త్రిమూర్తి
బాబా ద్వారా లభించిన మూడు సింహసనాలకు అధికారిగా భావిస్తున్నారా? మూడు సింహసనాలు
ఏమిటి? ఒకటి నిశ్చింతా చక్రవర్తిగా అయ్యేటందుకు సాక్షి స్థితిలో
స్థితులయ్యేటువంటి సాక్షిస్థితి యొక్క సింహసనం, రెండు శక్తిశాలి మాస్టర్
సర్వశక్తివాన్ బాబా సమానంగా ఉదాహరణగా తయారుచేసే బాబా యొక్క హృదయసింహసనం, మూడు
భవిష్య విశ్వమహరాజు యొక్క సింహసనం. ఈ మూడు సింహసనాల యొక్క అధికారిగా అయ్యారా?
మూడు సింహసనాల అధికారికి వర్తమాన స్థితి ఏమిటి? మూడు సింహసనాలకు మూడు విశేషతలు
చెప్పండి!
సాక్షిస్థితి యొక్క సింహసనం యొక్క ముఖ్య గుర్తు ఏమి
ఉంటుంది? వారు సదా ప్రతి అడుగు, ప్రతి సంకల్పంలో బాప్ దాదాని సదా సాథీగా(తోడుగా)
అనుభవం చేసుకుంటారు. ఎంత సాథీ స్థితి అనుభవం అవుతుందో అంతగా అచంచలంగా, అడోల్
మరియు అతీంద్రియసుఖంలో ఉంటారు. వారి ప్రతి మాట బాబా యొక్క తోడుని చూపిస్తుంది.
ఎలా అయితే బాప్ దాదాలు ప్రత్యక్షంగా సదా సాథీగా ఉంటారో, మీరు వేరు చేయలనుకున్నా
వేరు చేయలేరు. ఎలా అయితే అప్పుడప్పుడు ఇద్దరి స్నేహితులు తోడు వీరు ఇద్దరా లేక
ఒకరా అనే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇద్దరి తోడు సమానంగా ఉండాలి. ఒకరిలా కాదు,
సమానంగా ఉండాలి. సమాన స్థితినే ప్రజలు ఇమిడిపోవటంగా చెప్పారు. ఇలా స్వయాన్ని
బాప్ దాదాకి సాథీగా అనుభవం చేసుకుంటున్నారా? తండ్రిని అనుసరిస్తున్నారా?
తండ్రిని అనుసరించేవారిగా అవ్వటం అంటే సాక్షిస్థితి మరియు సాథీస్థితి ప్రతి
సెకను, ప్రతి అడుగులో ఉండాలి. అటువంటి సాక్షిస్థితి యొక్క అనుభవీలే
సింహసనాధికారిగా అవుతారు. రెండవది సుపుత్రులే బాబా యొక్క హృదయసింహసనాధికారిగా
అవుతారు అంటే మనసా, వాచా, కర్మణా మరియు తనువు, మనస్సు, ధనం అన్ని విషయాలలో
బాబాని అనుసరించే ఋజువు చూపిస్తారు. మూడవది - విశ్వమహరాజుగా అయ్యి
విశ్వరాజ్యాధికారిగా అవ్వటం. వారు కేవలం కర్మేంద్రియజీతులుగానే కాదు, కానీ
ప్రకృతిజీతులుగా కూడా ఉంటారు. వీరే వికార్మాజీతులు, కర్మేంద్రియాజీతులు,
ప్రకృతిజీతులుగా, జగత్ జీతులుగా అవుతారు. ఇలా మూడు సింహసనాధికారులుగా అయ్యారా?
ఒకవేళ మూడు సింహసనాలకు అధికారిగా అయితే అటువంటి అధికారులు, బాబా దగ్గర ఏ క్యూలో
ఉండరు. ఎవరైనా ఏదైనా క్యూలో ఉన్నారు అంటే - వారు ఏదోక రకమైన అధికారాన్ని
పొందలేనట్లే.
ఈరోజు బాప్ దాదా ప్రతి క్యూ వారికి జవాబు ఇస్తున్నారు.
అది చేయండి, ఇది చేయండి అని రకరకాలైన కోరికలు కోరుతున్నారు, అలా కోరుకునేటప్పుడు
బాప్ దాదా పిల్లలకు స్వయం కంటే ఎక్కువగా ప్రతి కార్యంలో ముందు పెడుతున్నారు
అనేది స్మృతి రావటం లేదు. ఇప్పుడు సర్వశక్తులు అంటే పవర్స్ పిల్లలకు ఇచ్చారు,
అటువంటి పిల్లల నుండి యజమానులు అయినవారు ఇక కోరికలు ఏమి కొరుతారు? బాబా ఎవరి
బుద్ధితాళం అయినా తెరవగలరు, లేదా సంస్కారాలను పరివర్తన చెయగలరు, మరి మీరు
చేయలేకపోతున్నారా? మీ బుద్దితాళం తెరుచుకుంది కదా! దీనిలో లేదు అని అనరు కదా?
బాప్ దాదా ప్రతి ఒక్కరి బుద్దితాళం తెరిచి అనుభవీగా చేసారు కదా? ఎలా అయితే మీది
బాబా తెరిచారో, అనుభవం చేయించారో మరి అనుభవం అయిన విషయం స్వయం చేయలేరా? ఎలా
అయితే మీది బాబా తెరిచారో అలాగే మీరు ఇతరులది తెరవండి. ఇతరుల తాళం తెరవటం కష్టమా
ఏమిటి? తాళం యొక్క తాళంచెవి ఏమిటి? ఆ తాళంచెవి బాబా మీకు ఇవ్వలేదా ఏమిటి?
తాళంచెవి మీదే కదా? తాళంచెవి ఉంది, అయినా బాబాని తాళం తెరువు అని చెప్తున్నారు.
లేదా సమయానికి తాళంచెవి దొరకటంలేదా? బాబా అయితే తన దగ్గర దివ్యదృష్టి యొక్క
తాళంచెవి పెట్టుకుంటున్నారు, కానీ బుద్దితాళం తెరిచే తాళంచెవి తన దగ్గర
పెట్టుకోవటం లేదు. బుద్దితాళం తెరిచే తాళంచెవి ఏమిటి? సర్వశక్తులు. ఇదే తాళంచెవి.
ఇది అందరి దగ్గర ఉంది కదా? దివ్యదృష్టిదాతలైతే కాదు, కానీ మాస్టర్
సర్వశక్తివంతులు కదా? మరి సర్వశక్తుల తాళంచెవి బాబా ద్వారా లభించినప్పుడు ఇక
మరలా కోరికలు ఎందుకు కోరుతున్నారు? బాబాని సేవాధారిగా చేసేసారు కనుక ఇది చేయి,
అది చేయి అని ఆజ్ఞాపిస్తున్నారు. వానప్రస్త స్థితి వరకు చేరుకున్నవారు కూడా
ఇప్పటి వరకు చిన్న పిల్లలుగానే ఉన్నారు. ఇప్పుడు మీ రచన రచించే సమయం మరియు
భక్తిమాల తయారుచేసే సమయం. రచయిత నేను చిన్నవాడిని అంటే రచన ఎలా రచిస్తారు?
అందువలనే ఈ రకరకాలైన కోరికలు బాబాని అడుగుతున్నారు. మొదట తాళంచెవిని పొందితే
కోరికలు స్వతహగానే పూర్తి చేయగలరు.
రెండవ విషయం - బాబాని నిందిస్తున్నారు. నిందల క్యూ
కూడా ఉంది కదా? ఏ రకమైన నింద అయినా ఎవరు వేస్తారు? జ్ఞానసాగరులుగా లేనివారే ఏ
విషయంలోనైనా నింద వేస్తారు. ఇలా జరుగకూడదు, వెనుక ఎందుకు వచ్చావు, సాకారంలో
ఎందుకు కలుసుకోలేదు, ఇవన్నీ నిందలే కదా? ఒకవేళ మాస్టర్ జ్ఞానస్వరూప స్థితిలో,
త్రికాలదర్శి స్థితిలో స్థితులైతే నిందిస్తారా? నిందించటం ద్వారా సాకార తనువు
ద్వారా కలుసుకునే ప్రాప్తి లభిస్తుందా? జరిగిపోయిన పాత్ర మరలా రిపీట్ అవుతుందా?
అది మరలా 5000 సంవత్సరాల తర్వాతే రిపీట్ అవుతుంది. జ్ఞానస్వరూప స్థితిలో
స్థితులయ్యేవారు ఎప్పుడు నిందించరు. నిందించటం అంటే జ్ఞానం యొక్క మరియు లైట్,
మైట్ యొక్క లోపం.
మూడవ విషయం - ఫిర్యాదులు చేసేవారి క్యూ కూడా చాలా
పెద్దది కదా! యోగం కుదరటం లేదు, వ్యర్దసంకల్పాలు చాలా వస్తున్నాయి లేదా ఫలానా
శక్తిని ధారణ చేయలేకపోతున్నాను. ఇలా రకరకాలైన ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఈ
ఫిర్యాదులకు కారణం ఏమిటి? వ్యర్దసంకల్పాలు. చాలా మందిలో ఎక్కువగా ఈ ఫిర్యాదు
కనిపిస్తుంది. రెండవ ముఖ్యమైన ఫిర్యాదు - వృత్తి మరియు దృష్టి యొక్క చంచలత.
ఎప్పటి వరకు అయితే రోజు మురళి ద్వారా ఏదైతే సలహ లభిస్తూ ఉందో ఆ సలహను అంటే
మురళిని ధ్యాసతో విని ధారణ చేయరో అంత వరకు ఈ ఫిర్యాదులు ఉంటూనే ఉంటాయి.
వ్యర్దసంకల్పాలు నడవడానికి ముఖ్య కారణం ఇదే - రోజు బాబా ద్వారా ఏదైతే జ్ఞానఖజానా
లభిస్తుందో, ఆ ఖజానా యొక్క లోపం. ఒకవేళ మొత్తం రోజంతా జ్ఞానరత్నాలతో ఆడుకోవటంలో,
లేదా జ్ఞానఖజానాను చూడటంలో, స్మరణ చేయటంలో బుద్ధిని బిజీగా ఉంచుకుంటే కనుక
వ్యర్థ సంకల్పాలు వస్తాయా? మొదట స్వయాన్ని అడగండి - మొత్తం రోజంతా నా బుద్ధి
జ్ఞానం యొక్క స్మరణలో లేదా విశ్వకళ్యాణం యొక్క ప్లాన్స్ తయారు చేయటంలో బిజీగా
ఉంటుందా? అని. ఎలా అయితే లౌకికంలో కూడా ఏదైనా కార్యంలో బుద్ధి బిజీగా ఉంటే వేరే
సంకల్పాలు లేదా వేరే విషయాలు రావు, ఎందుకంటే బుద్ధి బిజీగా ఉంటుంది. మీ బాధ్యత
లేదా బాబా ద్వారా లభించిన కార్యం ఎంత పెద్దది? మరియు ఇప్పటి వరకు ఆ కార్యం కూడా
ఇంకా ఎంత ఉంది! ఇప్పుడు విశ్వం యొక్క మొత్తం ఆత్మల లెక్కతో పంచపాండవులే వచ్చారు.
ఇంత మిగిలి ఉన్న పెద్ద కార్యం, మీ వికర్మలను భస్మం చేసుకునే కార్యం ఉంది. ఎన్ని
జన్మల బరువుని భస్మం చేసుకోవాలి? 63 జన్మల పాప కర్మల ఖాతాను భస్మం చేసుకోవాలి.
వెనువెంట జ్ఞానఖజానాను స్మరణ చేసుకుంటూ ఉంటే సమయం మిగులుతుందా లేదా తక్కువ
అవుతుందా? మూడు విషయాలు చెప్పాను. ఒకటి - జ్ఞానఖజానా స్మరణ చేసే కార్యం, రెండు
- వికర్మలను భస్మం చేసుకునే కార్యం, మూడు - విశ్వకళ్యాణం యొక్క కార్యం. ఈ మూడు
విశేషమైనవి మరియు బేహద్ కార్యాలు. ఇంత బుద్ధి యొక్క పని ఉన్నప్పుడు ఇక బుద్ధి
ఖాళీగా ఎలా ఉంటుంది? మీకు ఖాళీ ఎలా లభిస్తుంది? విశ్వకళ్యాణకార్యం పూర్తి
చేసేసారా ఏమిటి? వికర్మలను భస్మం చేసేసుకున్నారా ఏమిటి? ఇంత వ్యవహరం నడిపించే
లేదా ఇంత పెద్ద కార్యానికి నిమిత్తమైన ఆత్మలు ఖాళీగా ఉంటే వారిని ఏమంటారు? మీ
కార్యం యొక్క జ్ఞానం లేనట్లే లేదా స్వయాన్ని నడిపించుకునే జ్ఞానం లేనట్లే, లేదా
మీ దినచర్యను సెట్ చేసుకునే జ్ఞానం లేనట్లే. ఈ రోజుల్లో కౌరవ గవర్నమెంట్ యొక్క
చిన్న చిన్న క్లర్క్స్ కూడా దినచర్యను సెట్ చేసుకుంటుంటే మీరు మాస్టర్
జ్ఞానసాగరులు, మాస్టర్ సర్వశక్తివాన్, మీ దినచర్యను సెట్ చేసుకోలేరా? ఎందుకంటే
మీరు స్వయాన్ని సీటుపై సెట్ చేసుకోవటం లేదు, అందువలనే అప్ సెట్ అవుతున్నారు.
రోజు అమృతవేళ బాబాతో కలయిక జరుపుకున్న తర్వాత స్మృతి
లేదా ఆత్మిక సంభాషణ చేసిన తర్వాత రోజంతటి దినచర్యను సెట్ చేసుకోండి. ఎలా అయితే
స్థూలకార్యం యొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటారో, వ్యవహారంతో పాటు పరమార్థం యొక్క
ప్రోగ్రామ్ కూడా సెట్ చేసుకోండి. వ్యర్దసంకల్పాలు నడవటం అంటే కిరీటధారిగా కాలేరు.
బాధ్యతాకిరీటం స్వయం యొక్క బాధ్యత మరియు విశ్వం యొక్క బాధ్యత. ఒకవేళ ఇప్పుడు
కూడా మాటిమాటికి కిరీటం తీసేస్తున్నారు లేదా కిరీటధారిగా అవ్వటం లేదు అంటే,
భవిష్యత్తులో ఎప్పుడు కిరీటధారిగా కాలేరు. భవిష్యత్తులో కిరీటధారిగా,
సింహసనాధికారిగా అయ్యేటందుకు ఇప్పటి నుండి అభ్యాసం కావాలి. సాక్షిస్థితి యొక్క
సింహసనం మరియు బాబా యొక్క హృదయసింహసనం. ఇప్పటి నుండే కిరీటదారిగా మరియు
సింహసనాధికారిగా అయితేనే భవిష్యత్తులో కూడా కిరీటం మరియు సింహసనం పొందగలరు. మీ
దినచర్యను సెట్ చేసుకోండి మరియు స్వయానికి స్వయమే శిక్షకునిగా అయ్యి స్వయానికి
హోమ్ వర్క్ ఇచ్చుకోండి. టీచర్ విద్యార్థికి హోమ్ వర్క్ ఇస్తారు కదా? దీనిలో
బద్ది బిజీగా ఉంటుంది. ఇలా రోజు మీకు హోమ్ వర్క్ ఇచ్చుకోండి మరియు మరలా సాక్షి
అయ్యి హోమ్ వర్క్ లో బిజీగా ఉన్నానా లేదా, మాయా ఆకర్షణలో హోమ్ వర్క్ మర్చిపోయానా?
అని పరిశీలన చేసుకోండి. అప్పుడిక ఫిర్యాదులు సమాప్తి అయిపోతాయి.
రెండవ విషయం - దృష్టి మరియు వృత్తి చంచలం అయ్యే విషయం.
వర్తమాన సమయంలో ఎక్కువ మంది యొక్క ఫలితం చూస్తే 50 శాతం ఇప్పుడు కూడా దీని
యొక్క ఫిర్యాదు ఉంది. సంకల్పంలో, స్వప్నంలో, మరియు కర్మలో వృత్తి మరియు దృష్టి
చంచలం అవుతుంది. వృత్తి మరియు దృష్టి ఎందుకు చంచలం అవుతుంది? ఏదైనా వస్తువు
ఎందుకు చంచలం అవుతుంది. కారణం ఏమిటి? ఏ వస్తువైనా ఎందుకు కదులుతుంది? కదిలే
అవకాశం ఉన్నప్పుడే కదులుతుంది. ఒకవేళ అది ఫుల్ అంటే సంపన్నముగా ఉంటే కదులుతుందా?
దృష్టి మరియు వృత్తి చంచలం అవ్వడానికి కారణం ఇదే. బాబా స్మృతి గురించి చెప్పారు
కాని విస్మృతి వస్తున్న కారణంగా కదులుతున్నారు మరియు చంచలం అవుతున్నారు. ఒకవేళ
సదా స్మృతి స్వరూపంగా, స్మృతి సంపన్నంగా ఉంటే వృత్తి మరియు దృష్టి చంచలం అయ్యే
అవకాశమే ఉండదు. దీని కొరకు చాలా చిన్న స్లోగన్ మర్చిపోతున్నారు. లౌకికంలో కూడా
చెప్తారు- చెడుని చూడకండి, చెడు ఆలోచించకండి మరియు చెడు వినకండి అని. ఈ స్లోగన్
సదా స్మృతి ఉంచుకోండి, మరియు ప్రత్యక్షంలోకి తీసుకురండి. దేహన్ని చూడటం అంటే
చెడుని చూడటం. దేహధారి గురించి ఆలోచించటం లేదా సంకల్పం చేయటం కూడా చెడు,
దేహధారిని దేహధారిగా భావించి మాట్లాడటం కూడా చెడు, అందువలన ఈ సాధారణ స్లోగన్
ప్రత్యక్షంలోకి తీసుకువచ్చినా దృష్టి మరియు వృత్తి చంచలం అవ్వవు.
ఏ సమయంలో అయితే వృతి,దృష్టి చంచలం అవుతున్నాయో ఆ
సమయంలో నేను బాబా ద్వారా సర్వ సంబంధాలు, సర్వ రసనలు పొందలేదు అని అర్థం
చేసుకోవాలి. దృష్టి మరియు వృత్తి చంచలం అవుతున్నాయి అంటే ఏదైనా రసం ఉండిపోయిందా?
అని చూసుకోండి. ఏ సంబంధంతో అయినా వృత్తి, దృష్టి చంచలం అవుతుంటే ఆ సంబంధం యొక్క
రచన బాబాతో తీసుకునే అనుభవం చేసుకుంటే రెండవ వైపు దృష్టి వెళ్తుందా? ఆడవారికి
మగవారిపై దృష్టి వెళ్తుంది లేదా మగవారికి ఆడవారిపై దృష్టి వెళ్తుంది అంటే, బాబా
యొక్క అన్ని రూపాలు ధారణ చేయలేనట్లే కదా? ప్రియుడు మరియు ప్రేయసి రూపంలో బాబాకి
ప్రేయసిగా అయ్యి లేదా ప్రియునిగా అయ్యి అతీంద్రియసుఖం యొక్క రసం, సదాకాలికంగా,
సమర్థంగా స్మృతి ఉండే అనుభవం చేసుకోలేకపోతున్నారా? బాబాతో సర్వసంబంధాల రసం లేదా
స్నేహం అనుభవం అవ్వని కారణంగా దేహధారిపై దృష్టి మరియు వృత్తి చంచలం అవుతున్నాయి.
అటువంటి సమయంలో బాబాని ధర్మరాజు రూపంలో ఎదురుగా తెచ్చుకోవాలి మరియు స్వయన్ని
రౌరవ నరకవాసిగా భావించాలి. మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి ఎక్కడ మరియు ఈ సమయంలో
ఎలా అయిపోయాను అని చూసుకోండి. రౌరవ నరకవాసిగా లేదా మురికిలో పురుగుగా స్వయం
యొక్క రూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. మరియు నిన్న ఏమిటి మరియు ఇప్పుడు ఏమిటి?
అని స్వయాన్ని పోల్చుకోండి. సింహసనాధికారి నుండి ఎలా అయిపోయాను? సింహసనాన్ని
మరియు కిరీటాన్ని వదిలేసి ఏమి తీసుకుంటున్నాను? మురికి. కనుక ఆ సమయంలో ఏమి
అయ్యారు? మురికిని చూసేవారు మరియు ధారణ చేసేవారు ఎవరు అయ్యారు? మురికి పని
చేసేవారిని ఏమంటారు? బాధ్యతాధారి ఆత్మల నుండి తనిఖీ చేసేవారిగా అయిపోతారు.
అటువంటి వారిని బాప్ దాదా టచ్ చేస్తారా? స్నేహదృష్టి ఇస్తారా? కోరిక
అంగీకరిస్తారా? ఫిర్యాదు లేదా నింద వింటారా? ఇంత జ్ఞానసాగరులుగా అయిన తర్వాత
కూడా వృత్తి మరియు దృష్టి చంచలం అవుతుంది. అంటే వారిని భక్తి ఆత్మ కంటే
పడిపోయిన ఆత్మ అని అంటారు. భక్తులు కూడా ఏదోక యుక్తితో తమ వృత్తిని స్థిరం
చేసుకుంటారు. మాస్టర్ జ్ఞానసాగరులు భక్తి ఆత్మ కంటే కూడా పడిపోతున్నారు. అటువంటి
ఆత్మకు ఎవరైనా ప్రజలు అవుతారా? లేదా వారే స్వయం ప్రజలుగా అవుతారా? మీది ఒక ఫోటో
తీసుకుని ఉంచుకోండి. ఎవరైనా చెడుని ఎత్తుకునేవారు కట్టపై తట్ట మురికినే
పెట్టుకుంటారు. మీరు అటువంటి ఫోటో తీసుకుని బుద్ధిలో పెట్టుకోండి. ఏ సమయంలో
వృత్తి, దృష్టి చంచలం అవుతుందో ఆ సమయంలో ఆ ఫోటో చూసుకోండి. ఎలా అయితే బాప్ దాదా
భవిష్య ప్రాలబ్దం యొక్క ఫోటో తీయించారు కదా! ఎందుకంటే చిత్రాన్ని చూస్తే చరిత్ర
స్మృతి వస్తుంది. అటువంటి చిత్రం మీ ఎదురుగా పెట్టుకుంటే సిగ్గుగా అనిపించదా?
ఒకవైపు మాస్టర్ సర్వశక్తివాన్ చిత్రం, రెండవ వైపు ఆ చిత్రం పెట్టుకుని చూడండి,
అప్పుడు మీకే తెలుస్తుంది. మేము ఎలా అయ్యాము అని. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు
ఇప్పటి వరకు దృష్టి, వృత్తి చంచలం అవ్వటం శోభించదు.
మొదటి పొరపాటు అయితే ఇదే - శరీరాన్ని ఎందుకు
చూస్తున్నారు? మీరు మస్తకంలో ఆత్మను చూడాలి కదా! మస్తకంలో మణి ఉంది కదా?
మస్తకంలో మణికి బదులు సర్పాన్ని ఎందుకు చూస్తున్నారు, దీని ద్వారా విషం వస్తుంది.
మొదటి పొరపాటు ఇదే చేస్తున్నారు. మస్తకానికి బదులు శరీరాన్ని చూస్తున్నారు.
కొంతమంది వాతావరణం మరియు సాంగత్యం అలా ఉంది, సహయోగులు అలా ఉన్నారు. ఆఫీసులో,
వ్యాపారంలో పని చేయాల్సి ఉంటుంది. సంపర్కంలోకి రావల్సి ఉంటుంది, అని ఫిర్యాదులు
చేస్తున్నారు. సంపర్కంలోకి వస్తూ, మాట్లాడుతూ మస్తకంలో కాకుండా వేరే చోట ఎందుకు
చూస్తున్నారు? రెండవ విషయం - వాతావరణానికి వశీభూతం అయ్యేవారు. స్వయానికి స్వయం
అడగండి - బాబాతో పాటు స్వయం ఏ విషయం బాధ్యత తీసుకున్నాము? అని. మీరందరు
బాధ్యతాధారులు కదా? నరకాన్ని స్వర్గంగా తయారుచేయాలి. తమోగుణీ ప్రకృతిని సత్వ
ప్రధానంగా పరివర్తన చేయాలి. అనే ఈ బాధ్యత తీసుకున్నారు కదా? ప్రకృతిని
మార్చేవారు స్వయాన్ని మార్చుకోలేరా? పంచతత్వాలను మార్చే బాధ్యత తీసుకున్నారు.
మరి వాతావరణానికి వశీభూతం అయిపోతున్నారా? ఏ సమయంలో వాతావరణానికి వశీభూతం
అవుతున్నారో ఆ సమయంలో స్థూల ఉదాహరణ ఎదురుగా పెట్టుకోండి. అగరబత్తి ఎప్పుడు
వాతావరణానికి వశీభూతం అవ్వదు. వాతావరణాన్ని మార్చేటందుకే అగరబత్తి ఉంటుంది. మీ
రచనలో ఈ విశేషత ఉన్నప్పుడు రచయిత అయిన మీలో ఉండదా? అంటే రచయిత అయ్యారా లేర
బలహీనం అయ్యారా! ఈ ఫిర్యాదులను కూడా మీ స్మృతి మరియు యుక్తి ద్వారా సమాప్తి
చేసుకోండి.
ముఖ్యంగా ఈ రెండు ఫిర్యాదులే ఉన్నాయి. ఒకటి, రెండు
పార్టీలను కలుసుకున్నప్పుడు ఈ ఫిర్యాదులే విశేషంగా ఉంటున్నాయి. అందువలనే
డ్రామానుసారం మాటిమాటికి ఇవే విషయాలు చెప్పాల్సి వస్తుంది. మరియు మాటి మాటికి
బాబా ద్వారా ఇవే శిక్షణలు లభిస్తున్నాయి. వీటికి కూడా కర్మలఖాతా తమారవుతుంది.
అందువలన డ్రామానుసారం ఇప్పటి వరకు విశేష సేవ చేయటమనే పాత్ర కూడా సమాప్తి
అయిపోతుంది. దీనిలో కూడా రహస్యం ఉంది. అదే విషయం చాలా సార్లు అడుగుతున్నారు.
మరుసటి సంవత్సరం నుండి ఈ ఫిర్యాదు ఉండదు అని ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు. మరలా
సంవత్సరం మరలా రెండవసారి వచ్చే సంవత్సరం ఉండదు అని అంటున్నారు. ఏవైతే సంవత్సరాలు
గడిచిపోతున్నాయో అవి ఏ ఖాతాలోకి వెళ్తాయి? బాప్ దాదా ప్రతిజ్ఞ మర్చిపోతారు,
బాబాకి జ్ఞాపకం ఉంటుందేమిటి అని అనుకుంటున్నారు. బాప్ దాదాకి అందరి ప్రతిజ్ఞలు
జ్ఞాపకం ఉంటాయి, కానీ బాప్ దాదా పిల్లల్ని అగౌరవపరచరు. ఎదురుగా కూర్చున్నప్పుడు
ప్రతిజ్ఞ నిలుపుకోలేదు అని చెప్తే ఇది అగౌరవపరిచినట్లే. శిరోకిరీటాలుగా
తయారుచేస్తున్నారు, స్వయం కంటే ముందు పెడుతున్నారు, అటువంటి ఆత్మలను ఎలా
అగౌరవపరుస్తారు? అందువలనే నవ్వుకుంటున్నారు. బాబాకి జ్ఞాపకం ఉండకపోవటమనేది ఉండదు.
ఆత్మల దగ్గరైతే నడిచిపోతుంది. నిమిత్తంగా అయిన టీచర్స్ దగ్గర చాలా చతురంగా
నడిచేస్తున్నారు. వారు మా భావాన్ని అర్థం చేసుకోలేదు అని అంటారు.మా భావం ఇది
కాదు, కానీ నోటి నుండి ఆ మాట వచ్చేసింది అని అంటారు. కానీ బాప్ దాదా భావం యొక్క
భావాన్ని కూడా తెలుసుకుంటున్నారు. దానిలో దాచలేరు. టీచర్ కి అయితే మా పొరపాటు
జరిగిపోయింది అని చెప్పినా కుదురుతుంది, కాని బాబా దగ్గరైతే అలా కుదరదు కదా!
అందువలన ఇప్పుడు చిన్న, చిన్న విషయాలకు సమయం లేదు. ఇది కూడా వ్యర్థంలో
కలిసిపోతుంది. బాబా ద్వారా ఎంత శ్రమ తీసుకుంటారో అంత బదులు ఇవ్వాల్సి ఉంటుంది.
వ్యక్త రూపంలో శ్రమ చేసారు, ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా ఎన్ని సంవత్సరాలు
అయిపోయింది! 34వ సంవత్సరం నడుస్తుంది. అవ్యక్త రూపంలో కూడా 6 సంవత్సరాలు, ఈ
విషయాల గురించి శిక్షణ లభిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఇదే శిక్షణ కావాలా?
ఇప్పుడు సేవ తీసుకునే సమయమా లేదా బదులు ఇచ్చే సమయమా? ఒకవేళ బదులు ఇవ్వకపోతే
ప్రజలు తయారవ్వరు. అందువలన ఇప్పుడు స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోండి.
జ్ఞానస్వరూపంగా తయారుచేసుకోండి. అనేక రకాలైన క్యూల నుండి స్వయాన్ని ముక్తి
చేసుకోండి. యుక్తి ఏదైతే లభించిందో దానిని పనిలో ఉపయోగించటం లేదు, అందువలనే
ముక్తి పొందలేకపోతున్నారు. ఇది క్యూ యొక్క జవాబు. ఇప్పుడు బాప్ దాదా పిల్లల
నుండి వీడ్కోలు తీసుకుంటున్నారు. మంచిది.