30.06.1974
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
ఆత్మిక సేన యొక్క ముఖ్య నియమం.
ఆత్మికసేన యొక్క ఉన్నతోన్నతమైన సేనాపతి శివబాబా తన
పిల్లలతో మాట్లాడుతున్నారు-
ఆత్మిక సేన అంటే సదా శస్త్రధారిగా, నియమం మరియు
ఆఙ్ఞానుసారం నడిచేవారిగా ఉంటారు. సేన యొక్క ముఖ్య గుణం ఇదే కనిపిస్తుంది. కనుక
నియమం మరియు ఆజ్ఞ ఎంత వరకు ఉన్నాయి? మీరందరు నియమం మరియు ఆజ్ఞానుసారం
నడుస్తున్నారా? ఆత్మిక సేన యొక్క ముఖ్య నియమం ఏమిటి దానిలో అన్ని నియమాలు
వచ్చేస్తాయి. ఆత్మిక సేన యొక్క ముఖ్య నియమం ఇదే - ఎప్పుడు కూడా మీ దేహన్ని మరియు
ఇతర దేహధారిని చూడకూడదు. బాబా వైపే ప్రతి అడుగు వేయాలి. ఇదే ఆత్మిక సేనకు ముఖ్య
నియమం. ఒకవేళ కొద్దిగా అయినా మీ దేహన్ని లేదా దేహధారిని చూస్తే బాబా వరకు
చేరుకోవటం లేదా బాబాని కలుసుకోవటం అనే గమ్యం వరకు చేరుకోలేరు. మంచిది.