రాజయోగులే విశ్వరాజ్యాధికారి.
సర్వశ్రేష్ట సహయోగి, రాజయోగి , కర్మయోగి, జ్ఞానయోగిగా
తయారుచేసి మహిమాయోగ్యంగా మరియు పూజాయోగ్యంగా తయారుచేసే సదా పూజ్యుడు,
యోగీశ్వరుడైన శివబాబా మట్లాడుతున్నారు -
మీరందరు స్వయాన్ని యోగిగా భావిస్తున్నారా? యోగి అనే
టైటిల్ మీ అందరికి లభించిందా? యోగి అయినప్పటికీ మీరందరు ఒకే విధమైన యోగీలు కారు,
నెంబర్ వారీగా ఉంటారు. ఎలా అయితే ఏదైనా చదువు చదువుకున్న తర్వాత పరీక్ష పాస్
అయిన తర్వాత సర్టిఫికెట్ లభిస్తుంది లేదా డిగ్రీ యొక్క సర్టిఫికెట్ లభిస్తుంది
అనేటప్పుడు కూడా వీరు డాక్టర్, వీరు లాయర్ అని అంటారు. అలాగే ఇక్కడ కూడా
జ్ఞానసాగరుడైన బాబా ద్వారా యోగి మరియు భోగి జీవితం యొక్క జ్ఞానం లభించింది. భోగి
తర్వాత మరజీవ అయ్యారు. కనుక ఇక్కడ కూడా బ్రహ్మకుమారీ మరియు బ్రహ్మకుమార్ యొక్క
టైటిల్ స్వతహగానే లభిస్తుంది మరియు అలాగే యోగి యొక్క టైటిల్ కూడా లభిస్తుంది.
కానీ నెంబర్ వారీగా లభిస్తుంది. దీనిలో తేడా ఏమిటి? యోగం యొక్క మహిమ - సహజయోగం,
నిరంతరయోగం, కర్మయోగం లేదా ఙ్ఞానయోగం మరియు బుద్ధియోగం. ఎలా అయితే వైద్యులకు
లేదా మిలట్రీ వారికి రకరకాలైన గ్రేడ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా యోగులలో
కర్మయోగులు, బుద్ధియోగులు ఉంటారు. అక్కడ కూడా కొందరు అన్ని లక్షణాలు కలిగి
ఉంటారు. కొందరు ఒకటి, రెండింటిలో ఉంటారు, అన్నింటిలో ఉండరు. ఎవరికైనా బుద్ధియోగం
ఉంటే వారికి కర్మయోగం ఉండదు, ఎవరైనా కర్మయోగిగా ఉంటే వారు, సహజయోగిగా ఉండరు లేదా
ఎవరైతే జ్ఞానంలో సదా ఉండరో వారిని జ్ఞానయోగి అని అనరు. ఇక్కడ కూడా ఒకే టైటిల్
లభిస్తుంది. కనుక మీరు ఏదైతే ఇతరులకు యోగం యొక్క మహిమ వినిపిస్తున్నారో దానిని
స్వయంలో ధారణ చేయండి. రాజయోగం అంటే ఎవరైతే కర్మేంద్రియాలపై విజయం పొంది వాటిపై
రాజ్యం చేస్తారో వారు భవిష్యత్తులో కూడా శ్రేష్టపదవి పొందుతారు. శక్తిశాలి యోగం
చేసేవారినే రాజయోగి అని అంటారు. మిగతావారిని యోగి అని అంటారు కానీ రాజయోగి అని
అనరు. ఇప్పుడు ఇది పరిశీలన చేసుకోండి - నేను అన్ని టైటిల్ ధారణ చేసే యోగిగా
అయ్యానా? అని. కొంతమంది. 8,10 చేస్తున్నారు మరియు కొంతమంది ఒకటి రెండు
చేస్తున్నారు.
ఎలా అయితే డాక్టర్, లాయర్ మరియు ఇంజనీర్, మిలట్రీలో
ఇవన్నీ ఉంటాయి. ఎలా అయితే బెనారస్ లో యూనివర్సిటి ద్వారా టైటిల్స్ లభిస్తాయి
కొందరికి ఒకటి, రెండు, లేదా ఆరు, కొందరికి ఎనిమిది, పది అలాగే ఇక్కడ కూడా
టైటిల్స్ లభిస్తాయి. నేను యోగిని అని కేవలం దీనిలోనే సంతోషపడిపోకూడదు. యోగానికి
ఏదైతే మహిమ చేయబడుతుందో వాటన్నింటిని ఒకవేళ మీ జీవితంలో ధారణ చేస్తే కనుక ఎవరు
ఎంతగా ఇక్కడ మహిమాయోగ్యంగా అవుతారో వారు అక్కడ అంతగా పూజాయోగ్యంగా అవుతారు.
లౌకికంలో కూడా కొడుకు తండ్రిని పూజించరు. కానీ తండ్రిని పూజ్యనీయులు అని అంటారు
కదా? అలాగే సత్యయుగంలో ప్రజలు మీకు పూజ చేయరు. కానీ మిమ్మల్ని పూజ్యనీయులు అని
అంటారు. అంటే గౌరవం ఇస్తారు. మీలో ఎన్ని టైటిల్స్ ధారణ చేసాను అనే లిస్ట్ తీయండి,
మరియు దేనిలో లోపంగా ఉంది అని పరిశీలన చేసుకోండి. పాస్ అయినప్పుడే టైటిల్ కూడా
లభిస్తుంది. ఇప్పుడు మీలో మీ సహజయోగి స్థితి కనిపించాలి. అందరు మీ సహజయోగాన్ని
అనుభవం చేసుకోవాలి. అప్పుడే పాస్ అని అంటారు. అలాగే జ్ఞానయోగంలో కూడా జ్ఞానానికి
ఏదైతే మహిమ ఉందో అది నేను నాలో ధారణ చేసానా? అని చూసుకోండి అప్పుడే స్వయానికి
స్వయమే మీ నెంబర్ తెలుసుకోగలరు. ఎవరైనా చదువు చాలా శక్తిశాలి అని అంటే అది
జ్ఞానం యొక్క మహిమ కదా, మీది కాదు. కనుక ఇప్పుడు జ్ఞానానికి ఎన్ని పేర్లు
ఉన్నాయో అవన్నీ నేను ధారణ చేసానా? అని చూసుకోండి.
ఒకవేళ జ్ఞానం మరియు యోగం యొక్క అన్ని టైటిల్స్ ధారణ
చేయకపోతే విశ్వమహారాజుగా లేదా విశ్వమహారాణీగా కాలేరు. పాస్ విత్ ఆనర్ కాకపోయినా
కనీసం పాస్ అయినా అవ్వాలి, పాస్ అవ్వాలంటే కూడా 75 శాతం మార్కులు రావాలి. అంటే
ఈ అన్ని ధారణలు లేదా యోగ్యతలు అన్నీ అందరికి మీలో కనిపించాలి. రోజంతటి చార్ట్
లో 24 గంటలు ఉంటాయి. వాటిలో 8 గంటలు విశ్రాంతికి ఇక మిగిలినవి 16 గంటలు, 16
గంటలలో ముప్పావువంతు అంటే 12 గంటలు కానీ ఎవరికైతే బుద్ధితో ఎక్కువ పని ఉంటుందో
వారికి 3 గంటలు విశ్రాంతి ఇస్తారు. అలాగే బాబా వారిగా అయిన కారణంగా ఒక గంట
లభిస్తుంది. ఈ విధంగా 8 గంటలు మిగిలాయి కనుక సహజయోగి, రాజయోగి మరియు జ్ఞానం
మరియు యోగానికి ఏవైతే టైటిల్స్ ఉన్నాయో అవి మీలో 8 గంటలు పూర్తిగా ఉండాలి. దీని
ద్వారా ఇతరాత్మలు కూడా అనుభవం చేసుకుంటారు లేదా సర్టిఫికెట్ ఇస్తారు - ఈ
లక్షణాలన్నీ వీరిలో ఉన్నాయి అని. అప్పుడే వీటిలో 75 శాతం మార్కులు వస్తాయి.
ఎవరైతే మహారథీ అంటే పాస్ విత్ ఆనర్ అయ్యేవారి నిద్రా
సమయం కూడా యోగయుక్త స్థితిలో లెక్కించబడుతుంది. నిద్రించే సమయంలో వారి స్థితి
ఎలా ఉంటుందంటే పాత్ర సమాప్తి చేసుకుని పరంధామంలో ఉన్నట్లు అనిపిస్తుంది మరియు
అది యోగంగానే అనుభవం అవుతుంది. బ్రహ్మ నుండి బ్రాహ్మణులు తయారయ్యారు అని మహిమ
ఉంది కదా! ఇక్కడైతే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నారు. కానీ బ్రహ్మ నుండి
బ్రాహ్మణులు అంటే రాత్రి నిద్రించే ముందు ఇదే సంకల్పం ఉంటుంది - ఇప్పుడు నేను
నా పాత్రను పూర్తి చేసుకుని కర్మేంద్రియాలతో వేరుగా అయ్యి పరబ్రహ్మనికి
వెళ్ళిపోతున్నాను అని. అలాగే అమృతవేళ లేచినప్పుడు నేను పాత్ర అభినయించడానికి ఈ
ఆధారం తీసుకుంటున్నాను అని అనుభవం చేసుకుంటారు. అంటే బ్రహ్మ నుండి బ్రాహ్మణులుగా
అయ్యి వచ్చినట్లే కదా! ఇక్కడి నుండి వెళ్ళి మరలా అక్కడ డైరెక్ట్ దేవతగా
అయిపోతారు. కానీ ఈ సమయంలోనే అష్టరత్నాలకు మహిమ ఉంది. సాకారంలో బ్రహ్మబాబాని
మరియు సరస్వతి తల్లిని చూసారు కదా - వారికి మొదటి మరియు రెండవ నెంబర్ దేని
ఆధారంగా లభించింది? వారికి ఎక్కువ సంపాదన నిద్రలో కూడా జమ అయ్యింది కదా? భలే,
నిద్రపోయేవారు కానీ మేము నిద్రలో లేము మేల్కొనే ఉన్నాము అని అనుభవం చేసుకునేవారు.
వారి అలసట కూడా దూరం అయిపోయేది. ఎందుకంటే ఆత్మిక సంపాదనలో మేల్కొని ఉండేవారికి
అలసట అనేది ఉండదు. ఎలా అయితే తల్లి, తండ్రి నిద్రను కూడా యోగంలోకి పరివర్తన
చేసుకున్నారో, అలాగే మొదటి గ్రేడ్ మహారథీలు కూడా దీనిని అనుసరించాలి. ఇప్పుడు
నిద్ర తక్కువ అయిపోవాలి, అటువంటి స్థితిని తయారుచేసుకోవాలి. నిద్రను యోగంలోకి
మార్చుకోండి మరియు తండ్రిని అనుసరించండి. మొత్తం రోజంతా వారు మీ వలె సాధారణంగానే
ఉండేవారు కదా? ఇది ఫస్ట్ గ్రేడ్ అష్టరత్నాలలోకి వచ్చేవారి గుర్తు. రెండవవారు -
100 మంది మరియు మూడవ వారు - 16000లోకి వచ్చేవారు. కానీ ఇక్కడ అందరు మహారథులే,
గుఱ్ఱపుసవారీలు ఎవరు లేరు. కానీ మొదటివారు, రెండవ, నెంబర్ వారిగా ఉంటారు. అలాగే
ఏ కర్మేంద్రియానికి అయినా మీరు ఆజ్ఞ ఇచ్చారు, అది అలాగే చేసింది అంటే వారు
కర్మయోగులు, కానీ రెండవ గ్రేడ్ వారు దీనిలో అప్పుడప్పుడు సఫలత పొందుతారు. వీరిలో
కూడా అన్ని యోగాలు అనుభవం అవుతాయి. కానీ అప్పుడప్పుడు అవ్వవు. మూడవగ్రేడ్ వారి
గురించి అయితే మీకు తెలుసు. కనుక మీరు మొదటి గ్రేడ్ వారిగా అవ్వాలంటే
జ్ఞాన,యోగానికి ఎన్ని టైటిల్స్ ఉన్నాయి అనే లిస్ట్ తీసి వాటిలో నేను ఎన్ని ధారణ
చేసాను? అని చూసుకోండి. ఈ క్లాస్ చేయించాలి. బ్రహ్మకుమార్ లేదా బ్రహ్మకుమారీ
టైటిల్ అయితే అందరికి లభించింది కానీ దీనిలోనే సంతోష పడకూడదు, పూర్తిగా అన్ని
టైటిల్స్ ధారణ చేయాలి. మంచిది.