ఉన్నతపదవి బుకింగ్ చేసుకునేటందుకు లోతైన రూపం
ద్వా రా పరిశీలన అవసరం.
నియమం మరియు ఆజ్ఞలో ఉండేవారు, విశ్వరాజ్యం యొక్క
స్థాపన చేసేటువంటి, సర్వశక్తులు లేదా సర్వగుణాల రూపి ఖజానాతో సంపన్నంగా
చేసేటువంటి త్రిమూర్తి రచయిత శివబాబా మాట్లాడుతున్నారు -
ఈరోజు అదృష్టవంతులైన విశేషాత్మల యొక్క విశేషత
చూస్తున్నారు. కొంతమంది తమ విశేషతను కూడా యదార్ధరీతిలో తెలుసుకోవటం లేదు,
కొంతమంది తెలుసుకుంటున్నారు కానీ వారు తమ విశేషతను కార్యంలో ఉపయోగించటం లేదు
మరియు కొంతమందికి తెలుసుకుంటున్నప్పటికీ సదా ఆ విశేషతలో స్థిరంగా ఉండటం లేదు.
వారు అప్పుడప్పుడు విశేషాత్మగా అవుతున్నారు మరియు అప్పుడప్పుడు సాధారణ ఆత్మగా
అయిపోతున్నారు. కోట్లలో కొద్దిమంది అంటే పూర్తి బ్రాహ్మణ పరివారంలో చాలా
కొద్దిమంది ఆత్మలు తమ విశేషతను తెలుసుకుంటున్నారు కూడా, విశేషతలో ఉంటున్నారు
కూడా మరియు కర్మలోకి వస్తున్నారు కూడా. అంటే తమ విశేషతతో ఈశ్వరీయ కార్యంలో
సహయోగిగా అవుతున్నారు. ఇటువంటి సహయోగి ఆత్మలు బాప్ దాదాకి అతి స్నేహి. అటువంటి
ఆత్మలు సదా సరళయోగిగా, సహజయోగిగా మరియు స్వతహయోగిగా ఉంటారు. వారి ముక్తిలో సదా
సర్వశక్తివంతుని సమీప సంతానం యొక్క నషా మరియు సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది.
అంటే సదా సర్వప్రాప్తి సంపన్న లక్షణాలు వారి మస్తకం ద్వారా, నయనాల ద్వారా మరియు
ప్రతి కర్మ ద్వారా అనుభవం అవుతాయి. వారి బుద్ధి సదా బాబా సమానంగా అయ్యే ఒకే
స్మృతిలో ఉంటుంది. అటువంటి ఆత్మల ప్రతి అడుగు బాప్ దాదా అడుగు వెనుక స్వతహగా
పడుతూ ఉంటుంది.
అటువంటి ఆత్మలలో ముఖ్యంగా మూడు విషయాలు కనిపిస్తాయి.
అవి ఏమిటి? మూడు సంబంధాలు నిలుపుకునే త్రిమూర్తి స్నేహి ఆత్మలు, మూడు విషయాలలో
సంపన్నంగా ఉంటారు. తండ్రి సంబంధంలో వారిలో ఏ విశేషత ఉంటుంది? ఆజ్ఞాకారిగా ఉంటారు.
శిక్షకుని రూపంలో ఏమి విశేషత ఉంటుంది? శిక్షణలో నమ్మకదారిగా ఉంటారు. సద్గురువు
యొక్క సంబంధంతో ఆజ్ఞాకారిగా ఉంటారు. ఈ మూడు విశేషతలు త్రిమూర్తి స్నేహి ఆత్మలలో
స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మూడు విషయాలు ఎంత శాతంలో ఉన్నాయి అని స్వయాన్ని
చూసుకోండి. రోజంతటి దినచర్యలో మూడు సంబంధాల యొక్క విశేషతలు కనిపిస్తున్నాయా?
వీటి ద్వారానే మీ ఫలితాన్ని తెలుసుకోగలరు. కొంతమంది తండ్రికి స్నేహిగా, లేదా
విశేషంగా శిక్షకునికి స్నేహిగా, లేదా సద్గురువుకి స్నేహిగా అయ్యి కూడా
నడుస్తున్నారు. కానీ త్రిమూర్తి స్నేహిగా అవ్వాలి. మూడింటిలో పాస్ శాతం ఉండాలి.
ఒక విషయంలో పాస్ విత్ ఆనర్ అయ్యి రెండు విషయాలలో మార్కులు తక్కువ అయితే ఫలితంలో
బాబాకి సమీపంగా ఉండే ఆత్మలలోకి రారు. అందువలన మూడింటిలో మీ శాతాన్ని మంచిగా
చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు కనుక ప్రతి సబ్జెక్టులో మరియు ప్రతి
విశేషతలో అధికారులు, కనుక వ్యర్థ సంకల్పాలను తొలగించుకోవటంలో కూడా అధికారులుగా
అవ్వండి. విశ్వానికి అధికారి అయిన బాబాకి సంతానం అని అనిపించుకుంటున్నప్పుడు
మీరు మీ స్వభావాలపై, సంస్కారాలపై మరియు సంకలాలపై విజయీగా అయ్యే అధికారిగా
అవ్వలేరా? ఎవరిలో అయితే స్వయంలో అన్నింటిపై నియమం మరియు ఆజ్ఞానుసారం నడిపించే
అధికారం ఉంటుందో వారే విశ్వంలో నియమం మరియు ఆజ్ఞతో ఉండే రాజ్యాన్ని నడిపించగలరు.
ఒకవేళ ఇప్పటి నుండి నియమం మరియు ఆజ్ఞానుసారం నడిచే సంస్కారం కనిపించకపోతే
భవిష్యత్తులో కూడా విశ్వంపై రాజ్యం నడిపించలేరు. నడిచేవారే నడిపించేవారిగా
అవుతారు. నడవటంలో బలహీనంగా ఉంటూ నడిపించే నమ్మకం పెట్టుకుంటే అది స్వయాన్ని
సంతోషపరుచుకోవటం. మొదట స్వయాన్ని అడగండి - నా సంకల్పం, నియమం మరియు ఆజ్ఞానుసారం
ఉందా? అని. నా స్వభావం, నియమం మరియు ఆజ్ఞానుసారం ఉందా? ఒకవేళ నియమపూర్వకంగా
లేకపోతే కనుక మాస్టర్ సర్వశక్తివంతులు అనే అధికారం ఉంటుందా? సర్వశక్తివంతులు
ఎప్పుడు, ఎవరికి వశీభూతం అవ్వరు. ఇలా అయ్యారా?
ఇప్పుడు పురుషార్ధీలకు స్వయం పరిశీలన చేసుకునే సమయం
నడుస్తుంది. పరిశీలన చేసుకునే సమయంలో పరిశీలన చేసుకోకపోతే తమ భాగ్యాన్ని
పరివర్తన చేసుకోలేరు. ఎవరు ఎంతగా లోతైన రూపంతో స్వయం యొక్క పరిశీలన చేసుకుంటారో,
అంతగానే భవిష్యత్తులో ఉన్నత పదవికి బుకింగ్ జరుగుతుంది. పరిశీలన చేసుకోవటం అంటే
బుకింగ్ చేసుకోవటం. ఇలా చేసుకుంటున్నారా? లేదా బుకింగ్ సమాప్తి అయిపోయిన తర్వాత
చేసుకుంటారా? ఎయిర్ కండీషన్ (ఏ.సి) సీట్ తీసుకున్నారా? ఎయిర్ కండీషన్ సీట్ కొరకు
కండీషన్స్ (నియమాలు) ఉంటాయి. ఎలా అయితే ఎయిర్ కండీషన్ లో ఎప్పుడు కావాలంటే
అప్పుడు, ఎలా కావాలంటే అలా గాలిని కండీషన్లో పెడతారో, అలాగే స్వయాన్ని ఎక్కడ
కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా సెట్ చేసుకుంటే ఎయిర్ కండీషన్ సీట్ తీసుకోగలరు.
దీని కొరకు అన్ని ఖజానాలు జమ అయ్యి ఉన్నాయా? సర్వఖజానాలు ఏమిటి? ఖజానాలు
వినిపించటంలో అందరు తెలివైనవారు. అలాగే జమ చేసుకోవటంలో కూడా తెలివైనవారిగా
అవ్వండి. సర్వఖజానాలు జమ అయ్యి ఉండాలి. ఒకవేళ ఒకటి తక్కువగా ఉన్నా ఎయిర్ కండీషన్
సీట్ లభించదు. మొదటి డివిజన్ లోకి వస్తారు. ఇప్పుడు మీ బుకింగ్ చూసుకోండి.
ఇప్పుడైతే మీకు ఇంకా అవకాశం ఉంది. కానీ అవకాశం అయిపోతే మరలా ఏం చేస్తారు?
అందువలన ఇప్పుడు ముఖ్య పురుషార్ధం చేయాలి. ప్రతి సమయం, ప్రతి విషయంలో, ప్రతి
సబ్జక్టులో మరియు ప్రతి సంబంధం యొక్క విశేషతలో స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి.
అర్ధమైందా!
ఇలా త్రిమూర్తి స్నేహి ఆత్మలకు, స్వయం యొక్క మరియు
విశ్వం యొక్క జ్ఞానంలో త్రికాలదర్శి ఆత్మలకు, మూడవ నేత్రం ద్వారా స్వయం యొక్క
సూక్ష్మ పరిశీలన చేసుకునేవారికి, బాప్ దాదాకి సదా సమీపంగా, స్నేహిగా మరియు సదా
సహయోగిగా ఉండేవారికి, నియమం మరియు ఆజ్ఞలో సదా నడిచే విశేషాత్మలకు బాప్ దాదా
యొక్క ప్రియస్మృతులు శుభరాత్రి మరియు నమస్తే.