బాబా హృదయం అనే సింహాసనంపై విరాజమానమైన పిల్లలే
అదృష్టవంతులు.
పదమాపదమ్ సౌభాగ్యశాలి పిల్లలను చూసి ఒకనితోనే
సర్వసంబంధాలను, సర్వప్రాప్తులను,సంతోషాల యొక్క అనుభూతిని చేయించే స్నేహ సాగరుడు,
విశ్వ ప్రియ పరమపిత శివుడు అన్నారు -
ఈరోజు బాప్ దాదా ఏమి చూస్తున్నారు? ఈరోజు
అదృష్టవంతులైన పదమాపదమ్ భాగ్యశాలి పిల్లల యొక్క మాలను చూస్తున్నారు. మాలలోని
ప్రతి మణి యొక్క విశేషతను చూస్తూ హర్షిస్తున్నారు. తండ్రి తన పిల్లల యొక్క
శ్రేష్ట భాగ్యాన్ని చూసి ఏవిధంగా హర్షిస్తున్నారో అదేవిధంగా మీరు మీ
సౌభాగ్యాన్ని చూసుకుని సదా హర్షితంగా ఉంటున్నారా? భాగ్యసితార మెరుస్తూ సదా
ఎదురుగా కనిపిస్తుందా లేక అప్పుడప్పుడు భాగ్యసితార మీ ముందు నుండి తొలగిపోతుందా?
స్థూల సితారలు అప్పుడప్పుడు స్థానాన్ని మారుస్తాయి. ఆవిధంగా భాగ్యసితార మారటం
లేదు కదా? ఒక్క సితార మాత్రం తన స్థానాన్ని మార్చదు. మీరు అటువంటి సితారయేనా? ఆ
సితార ఏది అంటే దృఢ సంకల్పం గల సితార. దీనినే మీ ప్రపంచంలో ధ్రువతార అని అంటారు.
ఈ విధమైన దృఢ నిశ్చయబుద్ది మరియు ఏకరస స్థితిలో సదా స్థితులయ్యే పదమాపదమ్
భాగ్యశాలిగా అయ్యారా లేక అవుతున్నారా? మీ అదృష్టం యొక్క విస్తారాన్ని మీ
స్మృతిలోకి తీసుకువస్తున్నారా? అదృష్టానికి లేదా సర్వప్రాప్తులు లభించిన దానికి
గుర్తులు ఏమిటో తెలుసా? ఎవరికైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో వారినే అదృష్టవంతులు
అని అంటారు. సర్వప్రాప్తులలో ఏ ప్రాప్తి అయినా లోటుగా ఉందా? జీవితంలో కావలసిన
ముఖ్య ప్రాప్తులు - శ్రేష్ట సంబంధాలు, శ్రేష్ట సంపర్కం, సత్యమైన స్నేహం మరియు
సర్వ రకాల సంపత్తి మరియు సఫలత. ఈ అయిదు ముఖ్య విషయాలను మీలో చూస్కోండి.
1. సంబంధం - ఇప్పుడు మీ సంబంధాన్ని ఎవరితో జోడించారు?
కల్పమంతటిలో ఇంత కంటే శ్రేష్ట సంబంధం ఎప్పుడైనా ప్రాప్తిస్తుందా? సంబంధంలో
ముఖ్య విషయం సంబంధం అనేది అవినాశిగా ఉండాలి. మరయితే అవినాశి తండ్రితో
సర్వసంబంధాలు అవినాశియే. ఒకని ద్వారానే సర్వసంబంధాలు ప్రాప్తిస్తున్నాయి.
ఇటువంటి సంబంధీ ఎప్పుడైనా లభించటం చూశారా? మరయితే సర్వ సంబంధాలతో సంపన్నులేనా?
2. సంపర్కం అంటే మీతో పాటు ఉండేవారు. ఎవరినైనా తోడుగా
ఎందుకు చేసుకుంటారు? ఇతరులు ఎవరితోనైనా ఎందుకు కలిసి ఉంటారు? అవసర సమయంలో, కష్ట
సమయంలో తోడుగా ఉంటారని లేదా సహయోగం ఇస్తారని; ఉదాసీన స్థితిలో మనస్సుని
సంతోషపెట్టేటందుకు లేదా దుఃఖసమయంలో దుఃఖం పంచుకుంటారని తోడుగా చేసుకుంటారు.
ఇటువంటి సత్యమైన తోడు కావాలని, మీతో పాటు ఉండేవారు శ్రేష్టంగా ఉండాలని ఏదైతే
లక్ష్యం పెట్టుకుని తోడు కావాలనుకుంటారో అటువంటి సత్యమైన తోడు ఎవరైనా దొరికారా?
నిష్కామి, నిష్పక్షపాతి, అవినాశి మరియు సమర్థుడు అయిన తోడు మీకు లభించారు.
ఇటువంటి తోడు ఎవరైనా దొరికారా, ఇటువంటి సంపర్కం ఎప్పుడైనా లభించిందా లేదా
లభించగలదా అసలు? అవినాశి మరియు సత్యమైన శ్రేష్ట తోడు లేదా సాంగత్యం ఎవరిది అని
కీర్తిస్తారు? పారసనాథుని సాంగత్యం లోహాన్ని కూడా సత్యమైన బంగారంగా చేస్తుంది.
ఇటువంటి సత్ సాంగత్యం లేదా సంపర్కం లభించిందా లేక కొంచెం అప్రాప్తి ఉందా?
లభించిందా లేక లభించాలా? లభించిందా లేక ఇప్పుడు ఇంకా పరిశీలిస్తున్నారా? అటువంటి
తోడు లభించిన తర్వాత కూడా అప్పుడప్పుడు తోడు అయిన బాబా నుండి ఎందుకు వేరు
అయిపోతున్నారు? తోడుని నిలుపుకోవటంలో తుంటరిగా ఎందుకు అవుతున్నారు? అప్పుడప్పుడే
అలిగే ఆటను కూడా ఆడుతున్నారు. అలా అలగటం తోడు అయిన బాబా అలక తీర్చటం మజాగా
అనిపిస్తుందా; అందువలనే ఈ ఆటలో ఆడుతున్నారా? లేక పిల్లలలో ఆటలు ఆడే సంస్కారం
ఉంటుంది కదా అందువలనా? ఈ ఆట మంచిగా అనిపిస్తుందా? ఇష్టం అనిపించి ఆడుతున్నారా
చెప్పండి. కానీ ఈ ఆటలో పోగొట్టుకుంటున్నది ఏమిటో తెలుసా? ఈ ఆట ఆడుతున్నంత సేపు
సత్యమైన తోడు అయిన బాబా యొక్క కలయిక ఉండదు. ఆటల్లో పడి కలయికను
పోగొట్టుకుంటున్నారు. తండ్రి మరియు పిల్లలు కలుసుకోవాలని ఇంత సమయం నుండి
పిలుస్తూ వచ్చారు, శుభ ఆశ పెట్టుకుంటూ వచ్చారు మరియు ఈ కలయిక కూడా ఎంత కొంచెం
సమయం ఉంటుందో, ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలుసు; ఈ కలయిక కొంచెం సమయమే ఉంటుంది
అని తెలిసినా కానీ ఆటల్లో కలయికను పోగొట్టుకుంటున్నారు. మరలా తిరిగి ఆ సమయం
దొరకుతుందా? అందువలన ఇప్పుడు ఈ ఆటను సమాప్తి చేయండి. ఇప్పుడు మీరు వానప్రస్థీలు.
వానప్రస్థీలు ఇటువంటి ఆటలు ఆడటం బావుంటుందా? సాక్షి అయ్యి చూడండి, ఇటువంటి
సత్యమైన తోడు, శ్రేష్ట సంపర్కం లేదా సాంగత్యం సదా దొరుకుతుందా?
3. స్నేహం - సర్వ సంబంధాల యొక్క స్నేహాన్ని
ప్రాప్తింప చేసుకోలేదా, అనుభవిగా కాలేదా? సర్వ సంబంధాలలో లేదా స్నేహంలో ఏదైనా
లోటు ఉందా? దీనిని నిలుపుకునేటందుకు ఒక్క విషయం అవసరం. అది లేకపోతే స్నేహం
లభిస్తున్నా కానీ అనుభవం చేసుకోలేరు. సత్యమైన స్నేహం లేదా ఒకని ద్వారా సర్వ
సంబంధాల స్నేహం ప్రాప్తింప చేసుకోవడానికి ముఖ్యంగా ఏ సాధనం కావాలి? మీ
అధికారాన్ని మీరు పొందడానికి ఏ ముఖ్య విషయం అవసరం? ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు,
ఈ విషయం జీవితంలో, సంకల్పంలో లేదా సాకారంలో ఉందా? కేవలం సంకల్పంలోనే కాదు,
సాకారంలో కూడా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనుకున్నప్పుడే సత్యమైన స్నేహం,
సర్వ స్నేహాన్ని అనుభవం చేసుకోగలరు.
4. సంపత్తి - ఇప్పటి వరకు ఏవైతే విషయాలు చెప్పానో ఆ
అన్ని విషయాలలో సహజంగానే సర్వప్రాప్తులు ఉంటాయి. మీరు ఎంత అదృష్టవంతులు అంటే
మీకు లోటుగా ఉన్న వస్తువు ఏదీ లేదు. ఇది తెలుసుకుని, అంగీకరించి, అలా భావించి
నడుస్తూ కూడా అప్పుడప్పుడు మీ భాగ్యసితారను ఎందుకు మర్చిపోతున్నారు?
బాప్ దాదా మీ భాగ్యసితారను చూసి హర్షిస్తున్నారు మరియు
గుణగానం చేస్తున్నారు. ఇటువంటి అదృష్టవంతులైన పిల్లల యొక్క మాలను రోజూ
స్మరిస్తారు. ఇలా బాబా స్మరణ చేసే మణిగా అయ్యారా? విజయీమాలలోని మణిగా అవ్వటం
గొప్ప విషయం కాదు, బాబా స్మరణ చేసే మణిగా అవ్వటమే అదృష్టం. ఇటువంటి అదృష్టవంతులు
లేదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు కానీ సింహాసనాన్ని వదిలేస్తున్నారు. బాబా
అయితే తన యొక్క శ్రేష్ట కార్యం యొక్క భాద్యతా కిరీటాన్ని పిల్లలకు పెట్టారు.
ఇటువంటి కిరీటధారులుగా అయిన తర్వాత సింహాసనం దిగిపోయి కిరీటానికి బదులు మీ
శిరస్సుపై ఏమి పెట్టుకుంటున్నారు? మీ యొక్క ఆ చిత్రాన్ని కూడా చూడండి మరియు
కిరీటధారియై సింహాసనాన్ని అధిష్టించిన చిత్రాన్ని కూడా చూడండి. అప్పుడు
ఏమవుతుంది? ఏ చిత్రం ఇష్టమనిపిస్తుంది? కిరీటం, సింహాసనాధికారి అయిన చిత్రమే
ఇష్టమనిపిస్తుంది కానీ చేసేది మాత్రం మరో చిత్రం వలె చేస్తున్నారా? కిరీటాన్ని
తీసేసి, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాట, నడవడిక అనే బరువుతో నిండిన తట్టను లేదా
గంపను నెత్తిన పెట్టుకుంటున్నారు. కిరీటం లేని వారిగా అయిపోతున్నారు. ఇటువంటి
చిత్రం చూడడమే ఇష్టం అనిపించటం లేదు. అటువంటి వారిని చూసి దయాహృదయులు
అవుతున్నారు. కాని తిరిగి అదే గంపను మీపై ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ విధంగా
మీరు ఇంత అదృష్టవంతులుగా అయ్యి లేదా మిమ్మల్ని మీరు ఆవిధంగా భావించి
నడుస్తున్నారా? అర్ధమైందా!
మంచిది,ఈవిధంగా సదా ఒకనితోనే సంబంధం, సంపర్కం మరియు
స్నేహంలో ఉండేవారికి, సదా అవినాశి సంపత్తితో సంపన్నంగా ఉండేవారికి, సత్యమైన
తోడుని నిలుపుకునేవారికి, ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అనే స్మృతిలో ఉండే
పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే.