మహారథి స్థితి యొక్క లక్షణాలు.
ఆత్మిక పిల్లలకు సహయోగిగా అయ్యి, వారి ధైర్యం మరియు
ఉల్లాసాన్ని పెంచేటువంటి, అన్ని రకాలైన బంధనాలు మరియు సర్వ ఆకర్షణలకు అతీతంగా
ఉండేవారు మరియు సదా ఏకరస స్థితిలో స్థితులై ఉండేటువంటి నిష్కామ సేవాధారి శివబాబా
మాట్లాడుతున్నారు -
ఈ సమయంలో అందరిలో వినే కోరిక ఉందా లేక సమానంగా అయ్యే
కోరిక ఉందా? విన్న తర్వాత ప్రతి విషయాన్ని ఇముడ్చుకోవటం ద్వారా సమానంగా అవుతారు
మరియు ఇముడ్చుకోవటం ద్వారా ఎదుర్కునే శక్తి స్వయం సహజంగా వస్తుంది. ఎదుర్కునే
శక్తి ద్వారా సర్వ కోరికల నుండి స్వతహాగానే ముక్తి లభిస్తుంది. ఇలా స్వయాన్ని
ముక్తి ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? ఏ రకమైన బంధన తన వైపు ఆకర్షితం చేసుకోవటం
లేదు కదా? బంధనముక్తులే యోగయుక్తంగా అవుతారు. ఏదైనా స్వభావ, సంస్కారం, వ్యక్తి
లేదా వైభవం యొక్క బంధన తన వైపు ఆకర్షితం చేసుకుంటే బాబా స్మృతి యొక్క ఆకర్షణ సదా
ఉండదు. ఎవరికైనా వశం అయితే ఆ ఆత్మను వీరు వశీభూతమై ఉన్నారు అని అంటారు. వశీభూతం
అవ్వటం ఇది కూడా పంచభూతాలతో పాటు ఇది కూడా రాయల్ భూతం. ఎలా అయితే భూతాలు
ప్రవేశించినప్పుడు తమ స్వరూపాన్ని, తమ స్వభావాన్ని, తమ కర్తవ్యాన్ని మరియు తమ
శక్తిని మర్చిపోతారో, అలాగే ఏ విషయానికైనా వశీభూతం అవ్వటం ద్వారా ఇదే రూపు, రేఖ
తయారవుతుంది. వశీకరణ మంత్రం ఇచ్చేవారు ఎప్పుడు వశీభూతం అవ్వరు. కనుక ఇప్పుడు
ఎక్కడ వశీభూతం అవ్వలేదు కదా? అనిపరిశీలించుకోండి.
ఈరోజుల్లో బాప్ దాదా విశేష కార్యక్రమంలో బిజీగా
ఉంటున్నారు. ఆ కార్యం ఏమిటి? ఏ కార్యంలో అయినా బాబాతో పాటు పిల్లలకు కూడా సంబంధం
ఉంటుంది కదా? మరి మీకు సంబంధించిన కార్యక్రమం గురించి తెలుసుకోలేకపోతున్నారా?
అమృతవేళ ఎప్పుడైతే బాబాకి శుభోదయం లేదా ఆత్మిక సంభాషణ చేయడానికి వస్తున్నారో, ఆ
సమయంలో అనుభవం చేసుకోవటం లేదా ఆ సమయంలో తీసుకోవటంలోనే బిజీగా ఉంటున్నారా? టచ్
అవుతుందా? వర్తమాన సమయంలో సమాప్తి సమయం సమీపంగా వస్తుంది. సమాప్తిలో లాస్ట్ (అంతిమం)
మరియు పాస్ట్ (తీవ్రత) రెండు ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం అవుతాయి. బాప్ దాదా
ప్రతి రోజు ప్రతి ఒక్కరి సెట్టింగ్ మరియు ఫిట్టింగ్ రెండు విషయాలను చూస్తారు.
కొంతమంది స్వయాన్ని సెట్ చేసుకునే ప్రయత్నం కూడా చేసున్నారు, కానీ ఫిట్టింగ్
సరిగా లేని కారణంగా సెట్టింగ్ కూడా అవ్వటంలేదు. సెట్టింగ్ అంటే ఏమిటి మరియు
ఫిట్టింగ్ అంటే ఏమిటి? ఇదైతే మీకు తెలుసు కదా! ఈశ్వరీయ మర్యాదలలో స్వయాన్ని
నడిపించుకోవడం అంటే ఈ ఈశ్వరీయ మర్యాదలే ఫిట్టింగ్. ఈ మర్యాదల ఆధారంగానే స్వయం
యొక్క సెటింగ్ అవుతుంది. బాప్ దాదా ఎప్పుడైతే నెంబర్‌వారీ మహావీరుల లేదా
మహారధుల మహారధీ సెట్ యొక్క సెట్టింగ్ చేస్తూ ఏమి చూస్తారు? ఏదోక విషయం యొక్క
లేదా మర్యాద యొక్క ఫిట్టింగ్ లేని కారణంగా సీటుపై సెట్ అవ్వలేకపోతున్నారు.
ఇప్పుడిప్పుడే సీటుపై ఉంటున్నారు మరియు ఇప్పుడిప్పుడే సిట్‌కు బదులు ఏదోక
స్థానంలో కనిపిస్తున్నారు. బాప్ దాదా ఈ పనిలోనే బిజీగా ఉంటున్నారు. ఆశావాదులుగా
చాలా మంది కనిపిస్తున్నారు మరియు వరుస కూడా చాలా పెద్దది ఉంది కానీ ప్రమాణ
స్వరూపం కొద్ది కొద్ది మందికే ఉంటుంది.
నమ్మకదారులుగా అయ్యేటందుకు ముఖ్యంగా ఏ పురుషార్ధం
చేయాలి? అది చాలా సహజ పురుషార్ధం కానీ స్వయం యొక్క బలహీనతల కారణంగా సహజాన్ని
కష్టంగా చేసేసుకుంటున్నారు. నమ్మకదారులుగా అయ్యేటందుకు సహజ పురుషార్ధం ఇదే -
ప్రతి విషయంలో బాబాకి పిల్లల పట్ల ఏదైతే ఆశ ఉందో ఆ ఆశను పూర్తి చేయటమే
నమ్మకదారులుగా అవ్వటం. బాబా యొక్క ఆశలను పూర్తి చేయటం పిల్లలకు కష్టం అవుతుందా?
పిల్లలు జన్మించేదే తండ్రి యొక్క ఆశలను పూర్తి చేయటానికి. తండ్రి యొక్క ఆశలను
పూర్తి చేయాలి అనేదే పిల్లల జీవిత లక్ష్యంగా ఉంటుంది. దీనినే మరొక మాటలో
తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అని అంటారు. ఇటువంటి నమ్మకదారులుగా అవ్వటమే
బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్య లక్ష్యం. బాప్ దాదా ఒక అడుగుకి లక్ష అడుగులు స్వయం
సహయోగిగా అయ్యి ధైర్యం మరియు ఉల్లాసాన్ని పెంచుతూ ఉంటే ఇక కష్టం ఎందుకు? ప్రపంచం
యొక్క అన్ని కష్టాలను స్వయం తొలగించేవారు, కష్ట విషయాన్ని సహజం చేసేవారు,
ఇటువంటి అనుభవీ ఆత్మలకు ఏ విషయం కష్టంగా అనిపించటమనేది ఆలోచనలో కూడా రాకూడదు.
కాల్బలం వారి అనుభవం కష్టాన్ని తెలుసుకోవటం ఇది మంచిదే, కానీ ఇప్పుడు స్వయాన్ని
ఏ విషయంలో ఒకరికంటే ఒకరు తక్కువగా భావించటం లేదు. అంటే ఏదోక రకంగా స్వయాన్ని
మహారథీగా భావిస్తున్నారు. చివర వచ్చినవారు కూడా తీవ్రంగా ముందుకి వెళ్ళే లక్ష్యం
పెట్టుకుంటున్నారు అంటే మహారథీ అయ్యారు కదా? ఏ విషయంలో స్వయం ఎవరి ముందు తల
వంచటం లేదా స్వయం యొక్క బలహీనతను అనుభవం చేసుకోవటం మంచిగా అనిపించదు కదా!
స్వయాన్ని ప్రసిద్ధం చేసుకునేటందుకు, ప్రతి విషయాన్ని సిద్ది చేసుకుంటారు అంటే
ఇటువంటి వారిని ఏమంటారు? స్వయాన్ని కాల్బలం వారిగా భావిస్తున్నారా లేదా ఏదోక
రూపంలో మహారథీగా భావిస్తున్నారా? సిద్ధి చేసుకునేవారు ఎప్పుడు ప్రసిద్ధం కాలేరు.
వాస్తవానికి ప్రసిద్ధం అయ్యేవారు ఏ విషయంలో సిద్ధి చేసుకోరు. సిద్ధి
చేసుకునేవారు అంటే మొండిగా ఉండేవారు ఎప్పుడు ప్రసిద్ధం కాలేరు. మొండితనంతో
ఉండేవారు ఎప్పుడు సిద్ధిని పొందలేరు. సిద్ధిని పొందేవారు స్వయాన్ని నమ్రచిత్,
నిర్మాణంగా, ప్రతి విషయంలో స్వయాన్ని గుణగ్రాహకులుగా చేసుకుంటారు. ప్రసిద్ధమయ్యే
లక్ష్యం పెట్టుకుంటున్నానా మరియు దూరంగా అయ్యేటందుకు పురుషార్థం చేస్తున్నానా
అని స్వయాన్ని పరిశీలన చేసుకోండి. పరిశీలన కూడా లోతు ఉండాలి.
ఏ విషయంలోనైనా కష్టాన్ని అనుభవం చేసుకునేవారు మహారథియే
కాదు. మహారథీలు స్వయం యొక్క సహయోగంతో మరియు బాబా యొక్క సహయోగంతో ఇతరుల కష్టాలను
కూడా సహజం చేస్తారు. మహారథీల సంకల్పంలో కూడా ఎప్పుడు ఇది ఎలా? ఇలా ఎందుకు? అనే
ప్రశ్నలే రావు. ఎలా అనేదానికి బదులు ఇలా అనే మాట వస్తుంది. ఎందుకంటే మాస్టర్
జ్ఞానసాగరులు మరియు త్రికాలదర్శుల కదా? కనుక ఈ విషయాలను పరిశీలన చేసుకోండి. ఎలా
చేయము? ఎలా అవుతుంది? ఈ ఆలోచనలు స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల కూడా నడవకూడదు.
రెండు రూపాలలో ప్రశ్నలు సమాప్తి అయిపోవాలి. అటువంటి వారే సదా ప్రసన్నచిత్తంగా
మరియు హర్షితంగా ఉంటారు. మహారథీల లక్షణాలు ఏమిటో ఇప్పుడు అర్థమైందా? చేయటంలో
తక్కువగా ఉండకూడదు. ఒకరికొకరు సంపర్కంలోకి వచ్చినప్పుడు ఒకరికొకరు స్వయాన్ని
తక్కువగా భావించటం లేదు. భావించటంలో అందరు స్వయాన్ని అధికారిగా భావిస్తున్నారు
మరియు తమ హక్కు తీసుకుంటున్నారు. అలా భావించటంలో మరియు చేయటం రెండింటిలో
హక్కుదారులుగా అవ్వండి. అప్పుడే విశ్వం యొక్క మరియు ఈ ఈశ్వరీయ పరివారం యొక్క
ప్రశంసకు హక్కుదారులుగా అవుతారు. ప్రతి ఒక్కరూ స్వయమే మీ రాజ్యం యొక్క గౌరవాన్ని
ఇస్తారు. ఏ విషయంలో అడిగేవారిగా అవ్వకండి, దాతగా అవ్వండి. పేరు, గౌరవం, మర్యాద,
గొప్పతనం మొదలైనవి అడిగే కోరిక పెట్టుకోకండి. ఈరోజుల్లో అడుక్కునే వారు ఏ
ప్రాప్తిని పొందటం లేదు. అంతేకాకుండా వారిని దూరం నుండే అందరు తరిమేస్తున్నారు.
అలాగే రాయల్ గా అడుక్కునేవారు స్వయాన్ని స్వతహాగానే సర్వాత్మలతో దూరం
చేసుకుంటారు. ఇలా మహారథీ సీట్ పై సెట్ అవ్వటం లేదు. అందువలన ఇప్పుడు మీరందరు
మహారథులేనా? గుఱ్ఱపుసవారీలు మరియు కాల్బలం వారి సమయం అయిపోయింది. ఇప్పుడు ప్రతి
మహారథీ, మీ మహారథీ స్థితి యొక్క లక్షణాలను ఎదురుగా ఉంచుకుని స్వయంలో నింపుకోవాలి.
మంచిది! సర్వ కోరికలను ఇముడ్చుకునేవారికి, బాబా
సమానంగా సర్వశక్తుల అధికారులకు, సదా ఒకే సంలగ్నత, ఏకరస స్థితిలో స్థితులై
ఉండేవారికి, ఒకే బలం, ఒకే నమ్మకం, సదా ఏకాగ్రంగా, ఏకాంత నివాసిగా, అంతర్ముఖిగా
మరియు బాప్ దాదా ఆశా సితారలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు శుభరాత్రి మరియు
నమస్తే.