సదా సహయోగి మరియు సహజయోగిగా అవ్వండి.
అవ్యక్త బాప్ దాదా యొక్క గదిలో మధువనం నివాసీయులతో
మధుర సంభాషణ చేస్తూ పాండవపతి శివబాబా తెలియచేసిన మధుర మహావాక్యాలు -
ఎలా అయితే బాబా యొక్క మహిమ ఉందో, అలా బాబా యొక్క
కర్తవ్యంలో సదా సహయోగి మరియు బాబాతో సదా స్నేహిగా ఉంటారో అటువంటి శ్రేష్టాత్మలకు
కూడా మహిమ జరుగుతుంది. సదా సహయోగి అంటే ప్రతి సంకల్పం మరియు ప్రతి శ్వాస బాబా
కర్తవ్యం పట్ల ఉపయోగిస్తున్నారో, అలాగే సదా సహయోగిగా మరియు సహజయోగిగా ఉంటున్నారా?
విశేషంగా వరదాన భూమి యొక్క నివాసి అయిన కారణంగా పురుషార్థంతో పాటు వెనువెంట
అనేక రకాలైన సహయోగాలు ప్రాప్తిస్తాయి. వృత్తి మరియు స్మృతి ఈ రెండు పురుషార్థంలో
ముందుకి వెళ్ళటంలో సహయోగి అవుతాయి. స్మృతి అనేది సాంగత్యంతో తయారవుతుంది మరియు
వృత్తి వాతావరణం లేదా వాయుమండలంతో తయారవుతుంది. ఎలా అయితే స్థూలధనం
సంపాదించేవారు రోజంతా ఆ సంపాదనలోనే ఉంటారు. కనుక వారికి ఆ సాంగత్యం యొక్క
ప్రభావం ఎంతగా పడుతుంది అంటే వారికి కలలో కూడా అదే స్మృతి ఉంటుంది. మీకు కూడా
అమృతవేళ నుండి రాత్రి వరకు రోజంతా ఇదే శ్రేష్ట సాంగత్యం, శుద్ధ వాతావరణం మరియు
శాంతి వాయుమండలం ఉంటుంది. ఎప్పుడైతే సాంగత్యం మరియు వాతావరణం రెండు శ్రేష్టంగా
ఉంటాయో, స్మృతి మరియు వృత్తి సహజంగానే శ్రేష్టంగా అవుతాయి. డ్రామాలో ఎప్పుడైతే
స్వర్ణిమ అవకాశం లభిస్తుందో అంతగా దాని లాభాన్ని తీసుకుంటున్నారా?
బయట ఉండేవారు మురికిలో కమలం. మీకైతే కమలం కంటే
శ్రేష్టమైనది, ఆత్మికమైన ఆత్మ మరియు గులాబీగా అయ్యే అవకాశం ఉంది. గులాబి పుష్పం
పూజకు పనికి వస్తుంది. అంటే దానిని దేవతలకు అర్పితం చేస్తారు. కమలపుష్పం యొక్క
విశేషతను మహిమ చేస్తారు. కానీ దానిని దేవతలకు అర్పితం చేయరు. మీరందరు బాబా ముందు
అర్పితమైన గులాబీలు. ఎలా అయితే గులాబి యొక్క సువాసన వాయుమండలంలో వ్యాపిస్తుందో,
అలాగే మీరందరు కూడా నలువైపుల మీ ఆత్మీయత యొక్క సువాసనను వ్యాపింపచేసేవారే కదా?
ఎటువంటి పేరుయో అటువంటి పని, ఎటువంటి స్థానమో అటువంటి స్థితి, ఎటువంటి వాతావరణమో
అటువంటి వృత్తి, ఎటువంటి సాంగత్యమో అటువంటి స్మృతి ఉంటుందా? దీనిలో సోమరితనం
ఎందుకు ఉంటుంది? కారణమేమిటంటే, ఎలా అయితే బాబాని గ్రహించకపోతే ప్రాప్తి కూడా
లేదు. అలాగే మీకు లభించిన శ్రేష్టభాగ్యాన్ని గ్రహించటం లేదు. కనుక సోమరితనానికి
కారణం, జ్ఞానం యొక్క లోపం మరియు గ్రహింపు యొక్క లోపం. అందువలన ఇప్పుడు సమయం
యొక్క సమీపతననుసరించి సంపూర్ణ జ్ఞానస్వరూపంగా అవ్వండి. అప్పుడే జ్ఞానం యొక్క
ఫలాన్ని అనుభవం చేసుకోగలరు. అర్థమైందా!
పాండవుల కోట ప్రసిద్ధమైనది. కోటను గట్టిగా తయారుచేయటం
ఇదే పాండవుల కర్తవ్యం. స్వయం గట్టిగా అయితే కోట కూడా గట్టిగా అవుతుంది. కోటకు
గోడ ఏమిటి? స్వయమే గోడ. గోడ మధ్యలో ఒక ఇటుక లేదా రాడు అయినా కదిలితే మరియు గోడలో
ఏదైనా పగులు వస్తే మొత్తం గోడ అంతా బలహీనం అయిపోతుంది. మాయా తుఫానులు మరియు మాయా
భూకంపాలు పునాదిని చలింపచేయటం లేదు కదా లేదా పగలటం లేదు కదా? కోట గట్టిగా ఉంది
కదా? విశ్వంపై ప్రభావం వేయగలుగుతున్నప్పుడు, సమీపంగా ఉన్నవారిపై ప్రభావం వేయలేరా?
ఎంత సహజయోగిగా అవ్వాలంటే మిమ్మల్ని చూస్తూనే ఇతరులకు యోగం జోడింపబడాలి. ఒక ఘడియ
యొక్క అహంకారం రోజంతటి ఆత్మీయతను పోగొడుతుంది. దీనిని వెంటనే తొలగించుకోవాలి.
పురుషులకు ఈ అహంకారమనేది జన్మసిద్ధ అధికారమా? అవ్వటం అయితే అందరు ఆత్మలే కదా!
నేను ఆత్మ అనుకున్నప్పుడే స్నేహం కూడా ఉత్పన్నం అవుతుంది కదా! అందరు సోదరులు అనే
దృష్టిలో అహంకారం ఉండదు. ఇది కలియుగీ జన్మసిద్ధ అధికారం, ఈశ్వరీయ అధికారం కాదు.
అన్నయ్య, అక్కయ్యగా కూడా చూడకండి. దీని ద్వారా కూడా ప్రమాదం జరుగుతుంది.
అందువలనే సదా ఆత్మనే చూడండి, కనుకనే ఈ దృష్టి యొక్క అభ్యాసాన్ని చేయిస్తున్నారు.
నేను పురుషుడిని ఈ స్మృతిలో పాండవులు చనిపోయారు. శరీరంతో చనిపోవటం అంటే ఏమిటి?
శరీర స్మృతితో చనిపోవటం, పాండవులకే అందరు చనిపోయారు అనే మహిమ ఉంది. బంగారాన్ని
కాలిస్తే బంగారంగానే ఉంటుంది. కానీ దాని రూపం మారిపోతుంది. అలాగే ఇక్కడ కూడా
చనిపోయారు అంటే పరివర్తన అయ్యారు. అందువలన ఈ అహంకారం కూడా సమాప్తి అయిపోవాలి.
మంచిది.