ఉపరామ్ వృత్తి (అతీతవృత్తి) లేదా జ్వాలారూపం
యొక్క ధృడసంకల్పంతో వినాశన కార్యాన్ని సంపన్నం చేయండి.
ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క ద్వారాలు తెరిచేటువంటి,
తపించే ఆత్మలను శీతలంగా, శాంతిగా, ఆనందమూర్తిగా తయారుచేసేటువంటి మరియు సదా సర్వ
బంధనాల నుండి ముక్తులుగా, సర్వులకు కళ్యాణం చేసేటువంటి నిరాకార శివపిత
మాట్లాడుతున్నారు -
ఎలా అయితే బాప్ దాదాను సాకారునిగా, ఆకారిగా,
నిరాకారునిగా అనుభవం చేసుకుంటున్నారో అలాగే స్వయాన్ని కూడా బాబా సమానంగా
సాకారంలో ఉంటూ కూడా ఆకారిగా మరియు నిరాకారునిగా సదా అనుభవం చేసుకుంటున్నారా? ఈ
అనుభవం ద్వారా స్వతహాగానే ఉపరామ్(అతీతం)గా అయిపోతారు. పై నుండి సాక్షి అయ్యి ఈ
పాత ప్రపంచాన్ని ఆటగా చూస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఈ విధమైన శక్తిశాలి
స్థితి ఇప్పుడు సదాకాలికంగా ఉండాలి. అటువంటి స్థితిలో స్థితులైన ఆత్మను చూస్తూనే
ఏమి కనిపిస్తుంది? లైట్హౌస్ (ప్రకాశగృహం) మరియు పవర్హౌస్(శక్తిగృహం)గా
కనిపిస్తారు. అటువంటి ఆత్మలు బాబా సమానంగా విశ్వకళ్యాణకారిగా పిలవబడతారు. ఎవరు
ఎదురుగా వచ్చినా ప్రతి ఒక్కరు లైట్ మరియు మైట్ పొంది వెళ్ళాలి. ఇటువంటి బండారీగా
అయ్యారా? ఇలా మహాదానిగా, వరదానిగా, సర్వగుణదానిగా, దృష్టి ద్వారా అద్భుతం
చేసేవారిగా, భ్రమించే ఆత్మలకు గమ్యం చెప్పేవారిగా, తపించే ఆత్మలను శీతలంగా
చేసేవారిగా, శాంతిగా మరియు ఆనందమూర్తిగా తయారుచేసే ఆత్మగా అయ్యారా? ఈ గుర్తుల
యొక్క నషాలో ఉంటున్నారా? వీరినే బాబా సమానం అని అంటారు.
ఎలా అయితే సమయం సమీపంగా కనిపిస్తుందో, అలాగే మీ స్థితి
యొక్క సమీపత మరియు సమానత కనిపిస్తుందా? ఎలా అయితే ప్రపంచం వారు మీరు వినిపించిన
రెండు సంవత్సరాల యొక్క సమయం కోసం ఎదురుచూస్తున్నారో, అలాగే స్థాపన మరియు వినాశన
కార్యం చేసే మీరు రెండు సంవత్సరాలలో మీ కార్యం మరియు మీ స్థితిని సంపన్నంగా
చేసుకునే తయారీలో నిమగ్నమై ఉన్నారా? లేక తయారయ్యేవారు సోమరిగా మరియు నిరీక్షణ
చేసేవారు తీవ్రంగా ఉన్నారా? స్వయం ఏమని భావిస్తున్నారు? చాలా హడావిడిగా
తయారవుతున్నారా లేక ఎలా అయితే ప్రపంచంవారు ఏది జరుగుతుందో చూద్దాం అని
అంటున్నారో, అలాగే తయారీకి నిమిత్తమైన మీరు కూడా ఏది జరుగుతుందో చూద్దాం అని
ఆలోచించటంలేదు కదా? దీనినే సోమరితనం అని అంటారు. ఇప్పుడు ఇంత పెద్ద కార్యం
చేసేటందుకు చాలా తయారీ చేయాలి. ఏమి తయారీ చేయాలో తెలుసా? శంకరుని కార్యం
చేయించాలా? శంకరుడు ఎప్పుడు వినాశనం చేస్తారు అని చూడటంలేదు కదా? వినాశజ్వాల
ఎప్పుడు మరియు ఎలా ప్రజ్వలితం అయ్యింది? ఎవరు నిమిత్తంగా అయ్యారు? శంకరుడు
నిమిత్తంగా అయ్యారా లేక యజ్ఞం రచించిన బాబా మరియు బ్రాహ్మణ పిల్లలు నిమిత్తంగా
అయ్యారా? ఎప్పుడైతే స్థాపనాకార్యార్ధం యజ్ఞం రచించారో, స్థాపనతో పాటు యజ్ఞకుండం
నుండి వినాశన జ్వాల కూడా ప్రజ్వలితం అయ్యింది. కనుక వినాశనాన్ని ప్రజ్వలితం
చేసినవారు ఎవరు అయ్యారు? బాబా మరియు వెనువెంట మీరు కూడా ఉన్నారు కదా? కనుక
ప్రజ్వలితం చేసిన వారిని సంపన్నం కూడా చేయాలి కదా! లేక శంకరుడిని చేయాలా?
శంకరుని సమానంగా జ్వాలారూపంగా అయ్యి ప్రజ్వలితం అయిన వినాశన జ్వాలను సంపన్నం
చేయాలి. ఎప్పుడైనా, ఏదైనా కార్యార్ధం ఏదైనా అంటిస్తే అంటించిన తర్వాత మధ్యమధ్యలో
అగ్నిని తీవ్రం చేస్తూ ఉంటారు. మరి ఈ వినాశన జ్వాల ఎంత పెద్ద అగ్ని దీనిని కూడా
సంపన్నంగా చేసేటందుకు నిమిత్తంగా అయిన ఆత్మలను తీవ్రం చేసేటందుకు కదిలిస్తూ
ఉండాలి, ఎలా కదిలించాలి? చేతితోనా లేదా కర్రతోనా? సంకల్పంతో ఈ వినాశి జ్వాలను
తీవ్రం చేయాలి. కనుక ఇలా జ్వాలారూపంగా అయ్యి వినాశన జ్వాలను తీవ్రం చేసేటువంటి
సంకల్పం ప్రత్యక్షం అవుతుందా లేక ఇది మన పని కాదు అని అనుకుంటున్నారా?
డ్రామానుసారం నిర్ణయమై ఉన్నప్పటికీ నిమిత్తంగా అయిన ఆత్మలు పురుషార్ధం చేయాల్సే
ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క ద్వారాలు తెరిచే
బాధ్యత బాబాతో పాటు మీ అందరికీ కూడా ఉంది. ఈ వినాశనం అనేది సర్వాత్మల సర్వ
మనోకామనలు పూర్తి చేయడానికి నిమిత్త సాధనం. ఈ సాధనం మీ సాధన ద్వారా పూర్తి
అవుతుంది. ఇప్పుడు సర్వాత్మలకు కళ్యాణం జరగాలి అనే సంకల్పం ప్రత్యక్షం అవ్వాలి.
తపించేటువంటి, దు:ఖీ మరియు అశాంతి ఆత్మలు వరదాత బాబా మరియు పిల్లల ద్వారా
వరదానాన్ని పొంది శాంతిగా మరియు సుఖీగా అవ్వాలి మరియు ఇప్పుడిక ఇంటికి
వెళ్ళిపోవాలి. ఈ స్మృతి సమయం యొక్క సమీపతననుసరించి తీవ్రం అవ్వాలి. ఎందుకంటే ఈ
సంకల్పం ద్వారానే మరియు ఈ స్మృతి ద్వారానే వినాశన జ్వాల పెరుగుతుంది మరియు
సర్వులకు కళ్యాణం జరుగుతుంది.
ఇప్పుడు ఎంతగా బేహద్ విశాల రూపం యొక్క సేవ తీవ్రంగా
చేస్తూ ఉంటారో, అంతగానే బెహద్ ఉపరామ్ వృత్తి తీవ్రంగా ఉండాలి. మీ యొక్క బేహద్
ఉపరామ్ వృత్తి లేదా వైరాగ్యవృత్తి ద్వారా విశ్వాత్మలకు కూడా అల్పకాలికంగా
వైరాగ్యం వస్తుంది. వారి నోటి నుండి వైరాగ్యం ఉత్పన్నం చేస్తారు, ఇలా వైరాగ్యం
తర్వాతే సమాప్తి అవుతుంది. మాలో బేహద్ వైరాగ్యవృత్తి ఉంటుందా? అని స్వయాన్ని
అడగండి. అకర్త, సంబంధ,సంపర్కంలో ఉంటూ కర్మాతీతం అని ఏదైతే మహిమ ఉందో మరి ఆ
స్థితి ఉంటుందా? ఏ తగుల్పాటు ఉండకూడదు మరియు సేవ కూడా తగుల్పాటుగా ఉండకూడదు.
కానీ నిమిత్తభావంతో ఉండాలి, దీని ద్వారానే కర్మాతీతంగా అవుతారు. ఇప్పుడు మీ
కార్యాన్ని సర్దుకోవటం ప్రారంభించండి. ఎప్పుడైతే ఇప్పటి నుండి సర్దుకోవటం
ప్రారంభిస్తారో అప్పుడే తొందరగా సంపన్నం చేయగలరు. సర్దుకోవటంలోనే సమయం పడుతుంది.
ఎప్పుడైనా, ఏదైనా కార్యం లేదా దుకాణం సర్దుకోవటం ప్రారంభిస్తే ఏమి చేస్తారు?
వాటిని అమ్మకానికి పెడతారు. బోర్డ్ వ్రాసి పెడితే ఆ సామానులు తొందరగా అయిపోతాయి
మరియు ఇక్కడ కూడా ఏమి చేయాలి? ఇది కూడా అమ్మకానికి ఉంది కదా! త్వరత్వరగా సందేశం
అందించాలి. ఎవరు కావాలంటే వారు కొనుక్కోండి అని సందేశం ఇవ్వాలి. లేదంటే నింద
ఉండి పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? కార్యాన్ని సర్థుకోవటం అంటే స్వయం యొక్క
తగుల్పాటుని సర్దుకోవటం. స్వయాన్ని అన్ని వైపుల నుండి మలుచుకుని ఎవరెడిగా
చేసుకుంటే మీరు ఎవరెడి అవ్వటం ద్వారా వినాశనం రెడి అయిపోతుంది. ఇప్పుడు అగ్నిని
వెలిగించేవారే శీతలంగా అయ్యి కూర్చుంటే అగ్ని ఏమౌతుంది? అగ్ని మధ్యలో
ఉండిపోతుంది కదా? అందువలన ఇప్పుడు జ్వాలారూపంగా అయ్యి, స్వయం ఎవరెడిగా అయ్యే
శక్తిశాలి సంకల్పంతో వినాశన జ్వాలను పెంచండి. ఎలా అయితే దు:ఖీ ఆత్మల మనస్సు
నుండి ఇప్పుడు వినాశనం అవ్వాలి అనే మాట ప్రారంభం అయ్యిందో అలాగే విశ్వకళ్యాణకారి
ఆత్మలైన మీ మనస్సు నుండి ఇప్పుడు తొందరగా సర్వులకు కళ్యాణం జరగాలి అనే సంకల్పం
రావాలి. అప్పుడే సమాప్తి అవుతుంది. అర్ధమైందా?
పాలన అయితే చేసారు, ఇప్పుడు కళ్యాణకారి అవ్వండి మరియు
అందరిని ముక్తి చేయండి. వినాశనకారులకు కళ్యాణకారి ఆత్మల సహయోగం కావాలి. వారికి
సంకల్ప సైగ కావాలి. ఎప్పటి వరకు మీరు జ్వాలారూపంగా అవ్వరో, అప్పటి వరకు సైగ
చేయలేరు. అందువలన ఇప్పుడు స్వయం యొక్క తయారీతో పాటు, విశ్వ పరివర్తనకు కూడా
తయారవ్వండి. ఇది మీ యొక్క అంతిమ కర్తవ్యం. ఎందుకంటే ఇదే శక్తి స్వరూపం యొక్క
కర్తవ్యం. స్వయం భయపడటం లేదు కదా! వినాశనం అవుతుందా లేక లేదా ఏమౌతుంది మరియు ఎలా
అవుతుంది? అని ఇలా అనుకోవడానికి బదులు అది మా ద్వారానే జరుగుతుంది అని అనుకోండి.
ఇది తెలుసుకుని ఇప్పుడు స్వయాన్ని శక్తి స్వరూపంగా చేసుకోండి. స్వయాన్ని లైట్
హౌస్ గా మరియు పవర్హౌస్ గా చేసుకోండి. మంచిది. మీరు ప్రతి విషయంలో
నిశ్చయబుద్ధియే కదా?
ఇలా సదా అచంచలంగా, అడోల్ గా, నిర్భయంగా, శుద్ధ
సంకల్పంలో స్థితులై ఉండేవారికి, సంకల్ప సిద్ధిని పొందేవారికి, సదా సర్వ
కర్మబంధనాల నుండి ముక్తులకు, కర్మాతీత స్థితిలో స్థితులై ఉండేవారికి మరియు బాప్
దాదా యొక్క శ్రేష్ట కార్యంలో సహయోగి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు
మరియు నమస్తే.