మహిమను స్వీకరించడం ద్వారా ఆత్మిక శక్తిలో లోపం.
ఒక బిడ్డకు మనోహర శిక్షణలను ఇస్తూ ఆత్మిక తండ్రి
పరమాత్మ మాట్లాడుతున్నారు -
బిడ్డా! నీవు యుద్ధమైదానంలో ఉపస్థితులై ఉన్న ఆత్మిక
వీరుడవు, నీ ఆత్మిక వీరత్వాన్ని మర్చిపోయి నీ జీవితాన్ని సహజంగా, సాధారణంగా
గడుపుతూ మీ జీవితం పట్ల సాధనాలు మరియు సంపత్తిని ఉపయోగిస్తూ సమయాన్ని గడిపేయటం
లేదు కదా? ఎలా అయితే వీరునికి విజయం పొందాలి అనే ధ్యాసే ఉంటుందో, అలాగే మాయాజీత్
గా అయ్యేటువంటి సంలగ్నత అగ్ని వలె ప్రజ్వలితం అవుతుందా? బిడ్డా! ఇప్పుడు నీ
ఎదురుగా సేవా ఫలం సాధనాల రూపంలో మరియు ప్రాప్తి రూపంలో లభించే సమయం. ఈ సమయంలో
ఒకవేళ ఈ ఫలం కనుక స్వీకరిస్తే కర్మాతీత స్థితి యొక్క ఫలం, సంపూర్ణస్థితి యొక్క
ఫలం మరియు అతీంద్రియసుఖం యొక్క ఫలం పొందలేవు.
ఏ ఆధారంపై జీవితం యొక్క ఆధారం ఉండకూడదు మరియు
పురుషార్థం కూడా ఏ ఆధారంగా ఉండకూడదు. దీని ద్వారా యోగబలం యొక్క, శక్తి యొక్క
ప్రయోగంలో లోపం వచ్చేస్తుంది మరియు ఎంతగా యోగబలం యొక్క శక్తిని ప్రయోగంలోకి
తీసుకురారో అంతగా ఆ శక్తి పెరుగదు. యోగబలం అభ్యాసం ద్వారా తప్పకుండా పెరుగుతుంది.
ఏదైనా విషయం ఎదురుగా వస్తే వెంటనే స్థూల సాధనాలపై ధ్యాస వస్తుంది. కానీ స్థూల
సాధనాలు ఉన్నప్పటికీ కూడా యోగబలం యొక్క ప్రయోగమే చేయాలి. మంచిది.