తగుల్పాటు మరియు పాతస్వభావాన్ని మార్చుకోవటం ద్వా
రా విశ్వపరివర్తన.
దృష్టి ద్వారా అద్భుతం చేసేవారు, దు:ఖ అశాంతుల నుండి
దూరంగా తీసుకువెళ్ళేవారు, ముక్తిజీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇచ్చేవారు, లైట్
హౌస్ మరియు మైట్ హౌస్ గా తయారుచేసేవారు, సర్వుల మనోకామనలను పూర్తి చేసే
కళ్యాణకారి శివబాబా మాట్లాడుతున్నారు -
మాటల్లోకి వచ్చే స్థితి ఎంత ప్రియమనిపిస్తుందో, మాటలకి
అతీతంగా శాంతిగా ఉండే స్థితి కూడా అంతగానే ప్రియమనిపిస్తుందా? ధ్వనిలోకి రావటం
మరియు ధ్వనికి అతీతం అవ్వటం; ఈ రెండూ ఒకేలా మరియు సహజంగా అనిపిస్తున్నాయా? లేక
ధ్వనికి అతీతంగా వెళ్ళటం కష్టమనిపిస్తుందా? వాస్తవానికి మీ స్వధర్మం - శాంతి.
కనుక శాంతి స్వరూపంలో అనగా ధ్వనికి అతీతంగా వెళ్ళటం అతి సహజం అనిపించాలి. ఒక్క
సెకనులో ఇప్పుడిప్పుడే స్థూల శరీరం ద్వారా ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడికి
వెళ్ళటం మరియు రావటం రెండూ సహజంగా అనుభవం అవుతాయి కదా! అదేవిధంగా బుద్ధి ద్వారా
ఈ శరీర స్మృతికి అతీతంగా వెళ్ళటం మరియు రావటం; ఈ రెండూ కూడా అంతే సహజంగా
అనుభవమవ్వాలి. అంటే ఒక్క సెకనులో ఇలా చేయగలరా? ఎప్పుడు కావాలంటే అప్పుడు
శరీరాన్ని ఆధారంగా తీసుకోవాలి. మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర ఆధారాన్ని
వదిలి మీ యొక్క అశరీరి స్వరూపంలో స్థితులవ్వాలి. ఇలాంటి అనుభవాన్ని నడుస్తూ
తిరుగుతూ చేస్తున్నారా? శరీరాన్ని ధరించటం తిరిగి శరీరానికి అతీతం అవ్వటం - ఈ
రెండూ ఒకేలా అనుభవం అవుతున్నాయా? ఈ అనుభవమే అంతిమ పరీక్షలో మొదటి నెంబరు
తీసుకోవడానికి ఆధారం అవుతుంది. ఆ అంతిమ పరీక్ష కోసం ఇప్పటి నుండి తయారయ్యారా
లేక అవుతూ ఉన్నారా? ఏవిధంగా అయితే వినాశనం చేసేవారు ఒక్క సైగ లభించగానే తమ
కార్యాన్ని సంపన్నం చేస్తారు. అంటే వినాశనకారి ఆత్మలు సంసిద్ధంగా ఉన్నారు. ఒక్క
సెకను యొక్క సైగతో తమ పనిని ఇప్పుడు కూడా ప్రారంభించగలరు. మరయితే విశ్వ నవ
నిర్మాణం చేసేవారు అనగా స్థాపనకి నిమిత్తమైన ఆత్మలు అంతగా సంసిద్ధంగా ఉన్నారా?
వినాశకారులకి సైగ లభిస్తే చాలు, అలాగే స్థాపనా కార్యాన్ని కూడా అలా చేయగలరా?
యాదవసేన తమ పూర్తి శక్తితో తయారీలు అన్నీ చేసేశారు. మరి పాండవ సేన అయిన మీరు
కూడా అన్ని తయారీలు చేసేశారా? సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారా? సంసిద్ధులేనా?
ఏవిధంగా అయితే లైట్ హౌస్ లేదా మైట్ హౌస్ కి పవర్ హౌస్ తో కనెక్షన్ ఉంటుంది.
కనుక ఒక్క సెకనులో స్విచ్ వేయగానే నలువైపుల లైట్ లేదా మైట్ ని వ్యాపింపచేయగలవో,
అదేవిధంగా పాండవ సేన ఒక్క సెకను యొక్క ఆజ్ఞానుసారం లైట్ హౌస్ మరియు మైట్ హౌస్
అయ్యి సర్వాత్మలకు లైట్ మరియు మైట్ యొక్క వరదానాన్ని ఇవ్వగలరా? స్థూలమైన దృష్టి
ద్వారా ఒక స్థానంలో ఉండగానే ఒక్క సెకనులో నలువైపుల చూడగలరు. అదేవిధంగా
మూడవనేత్రం ద్వారా ఒక్క సెకనులో మీ నలువైపుల అనగా కేవలం భారతదేశమే కాదు, మొత్తం
విశ్వంలోని ఆత్మలకు మీ దృష్టి ద్వారా అద్భుతం చేయగలరా? ఎలాగైతే సరళమైన మరియు
సహజమైన రీతిలో స్థూల నేత్రాల ద్వారా దృష్టిని వ్యాపింప చేయగలుగుతున్నారో
అదేవిధంగా మీ దృష్టి ద్వారా అద్భుతం చేయగలరా? మూడవ నేత్రం తెరుచుకోగానే ఒక్క
సెకనులో వినాశనం అయిపోతుంది అనే మహిమ కూడా ఉంది. వినాశనంతో పాటు స్థాపన కూడా కదా!
ఈ మహిమ తండ్రితో పాటు పిల్లలది కూడా. మరి మీ మూడవనేత్రం శక్తిశాలిగా ఉందా? దూరం
వరకు దృష్టి వెళ్తుందా? స్థూల నేత్రాల దృష్టి బలహీనంగా ఉంటే దూరం వరకు చూడలేరు.
అదేవిధంగా మీ మూడవనేత్రం యొక్కశక్తి ఎంత ఉందో చూసుకుంటున్నారా? ఈ మూడవనేత్రాన్ని
శక్తిశాలిగా తయారుచేసుకునేటందుకు కేవలం రెండు విషయాలపై ధ్యాస అవసరం. అదేవిధంగా
మూడవ నేత్రం బలహీనం అవ్వటానికి కూడా రెండు విషయాలే కారణం, అవి ఏమిటి? స్థూల
నేత్రాలకి బలహీనత రావటానికి గల కారణం ఏమి ఉంటుంది? మెదడుతో ఎక్కువ పని చేయటం
వలన నేత్రాలు బలహీనమవుతాయి. అదేవిధంగా అవి రెండు మాటలే, అన్ని మాటలను కలిపి
రెండు మాటలుగా సార రూపంలోకి తీసుకువస్తే ధ్యాస పెట్టడం సహజం అవుతుంది.
మూడవనేత్రం బలహీనం అవ్వటానికి గల కారణమైన రెండు మాటలు ఏమిటంటే 1. తగుల్పాటు 2.
పాత స్వభావం. కొందరిని తమలో ఉన్న ఏదో పాత స్వభావం బలహీనం చేస్తుంది, మరికొందరిని
ఏదోక రకమైన తగుల్పాటు బలహీనం చేస్తుంది. ఈ రెండే ముఖ్య బలహీనతలు. వీటి విస్తారం
మాత్రం చాలా ఎక్కువ. ప్రతీ ఒక్కరికీ ఏదోక తగుల్పాటు ఉంది, మరియు ప్రతీ ఒక్కరిలో
నెంబరువారీగా, శాతాన్ని అనుసరించి ఇప్పటి వరకు పాత స్వభావం ఉంది. ఈ స్వభావం
మరియు తగుల్పాటు మారిపోతే విశ్వం కూడా మారిపోతుంది. ఎందుకంటే విశ్వపరివర్తకులు
స్వయాన్నే మార్చుకోలేకపోతే ఇక విశ్వాన్ని ఏవిధంగా మార్చగలరు? కనుక మిమ్మల్ని
మీరు పరిశీలించుకోండి - మాకు ఏ రకమైన తగుల్పాటు ఉంది? ఆ తగుల్పాటు సంకల్ప రూపంలో
కావచ్చు, సంబంధ రూపంలో కావచ్చు, సంప్రదింపుల రూపంలో కావచ్చు మరియు మీలో ఉన్న
ఏదోక విశేషత వైపు కూడా తగుల్పాటు ఉండవచ్చు. మీలో ఉన్న విశేషతపై మీకు తగుల్పాటు
ఉన్నట్లయితే ఆ తగుల్పాటు కూడా మిమ్మల్ని బంధనయుక్తులుగా చేసేస్తుంది మరియు
బంధన్ముక్తులు కానివ్వదు. ఎందుకంటే తగుల్పాటు అనేది అశరీరిగా అవ్వనివ్వదు.
విశ్వకళ్యాణకారిగా కూడా అవ్వనివ్వదు. తమ తగుల్పాటుకే బంధించబడి ఉన్నవారు ముక్తి
- జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని విశ్వమంతటికీ ఏవిధంగా ఇప్పించగలరు? తగుల్పాటు
ఉన్నవారు ఎప్పుడూ కూడా సర్వశక్తిసంపన్నులు కాలేరు. తగుల్పాటు ఉన్నవారు ధర్మరాజు
శిక్షల నుండి సంపూర్ణంగా ముక్తులై నమస్కారం చేసి వెళ్ళలేరు. తగుల్పాటు ఉన్నవారు
అపరాధ రుసుము కట్టవలసి ఉంటుంది. తగుల్పాటు ఉన్నవారు మొదటి జన్మ యొక్క
రాజ్యభాగ్యాన్ని సంపూర్ణంగా పొందలేరు. అదేవిధంగా పాత స్వభావం గల వారు కొత్త
జీవితం మరియు కొత్త యుగం యొక్క సంపూర్ణ అనుభవాన్ని సదా చేసుకోలేరు. ప్రతీ ఆత్మ
పట్ల సోదరభావం పెట్టుకోకపోతే మీ స్వభావం ఒక విఘ్నంగా అయిపోతుంది. దీని యొక్క
విస్తారం మీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఏమి చేయాలి? విస్తారాన్ని ఇముడ్చుకుని
బాబా సమానంగా తయారవ్వాలి. ఏ పాత స్వభావం ఉండకూడదు మరియు ఏ తగుల్పాటు ఉండకూడదు.
తనువు మనస్సు మరియు ధనం అన్నింటినీ బాబాకి సమర్పణ చేసేశారు. అలా బాబాకి
ఇచ్చేసిన తర్వాత ఆ ఆలోచన, నా తెలివి, నా స్వభావం... ఈ మాటలు ఎక్కడి నుండి
వస్తున్నాయి. ఇప్పటికీ కూడా నాది అనేది ఉందా? లేక నాది నుండి నీదిగా చేసేశారా?
నాది అనేది నీది అని ఎప్పుడైతే అన్నారో అప్పుడిక నా మనస్సు అనేది సమాప్తం
అయిపోయినట్లే కదా! మనస్సు మరియు తనువు కూడా బాబా మీకు ఇచ్చిన తాకట్టు వస్తువులు.
మీవి కాదు. నా మనస్సు చంచలమైనది, ఈ మాట ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పటి వరకు నాది
అనేది వదల్లేదా? నాది అనే భావం ఏ జంతువులో ఉంటుంది? కోతిలో ఉంటుంది. కోతి
చనిపోయినా కానీ దాని యొక్క నాది అనే భావం మాత్రం చనిపోదు. అందువలనే చిత్రకారులు
మహావీరునికి కూడా తోకని గుర్తుగా చూపించారు. అవ్వటానికి మహావీర్ కానీ తోక
తప్పనిసరి. అది ఏ తోక? తగుల్పాటు మరియు స్వభావం యొక్క తోక. ఎప్పటి వరకు ఈ తోకకి
నిప్పంటించరో అప్పటి వరకు లంకకి నిప్పంటదు. కనుక వినాశనం యొక్క హెచ్చరికకి
సహజమైన గుర్తు ఏమిటి? ఈ తోకకి నిప్పంటుకోవటమే. మహావీరుల అందరి సంలగ్నత అగ్ని వలె
అయిపోతే ఈ పాత విశ్వం మిగిలి ఉంటుందా? ఇప్పుడు అన్ని రకాల తగుల్పాటు మరియు
స్వభావాలను సమాప్తం చేయండి. ఎలాగైతే వినాశకారి ఆత్మలు వినాశనం కోసం
తపిస్తున్నారో అదేవిధంగా స్థాపన చేసే మీరు విశ్వకళ్యాణం కోసం తపిస్తున్నారా?
స్వ సేవ మరియు విశ్వ సేవ కోసం కొత్త కొత్త పద్ధతులు పరిశోదిస్తున్నారా? వారు
చాలా ఆవిష్కరణలు చేస్తున్నారు, శక్తిశాలి యంత్రాలు తయారు చేస్తున్నారు, వాటి
ద్వారా వినాశనం సహజంగా మరియు త్వరగా అయిపోవాలని. మరయితే మహావీరులు అయిన మీరు
శాంతిశక్తి ద్వారా ఆవిష్కరణలు, పద్దతులు తయారుచేస్తున్నారా? వాటి ద్వారా విశ్వం
అంతా పరివర్తన అయిపోవాలి. మరియు ముక్తి - జీవన్ముక్తి యొక్క వారసత్వం
తీసుకోవటంలో ఒక్క సెకనే పట్టాలి మరియు సహజంగా కూడా తీసుకోవాలి. మీ వలె 25 సం
||లు పట్టకూడదు. అలాంటి పరిశుద్ధమైన ఆవిష్కరణలు చేయండి. ఒక్క సెకనులో దృష్టి
ద్వారా అద్భుతం, ఒక్క సెకనులో దు:ఖి నుండి సుఖి, నిర్బలం నుండి శక్తివంతులుగా,
అశాంతి నుండి శాంతిని అనుభవం చేయించాలి. ఇలాంటి రిఫైన్ ఆత్మిక ఆయుధాలు మరియు
యుక్తులు ఆలోచిస్తున్నారా? సెకనులో అనేకుల యొక్క తపన పూర్తవ్వాలి. బాంబుల ద్వారా
ఒక్క సెకనులో ఎలాగైతే చనిపోతారో అలాగే ఒక్క సెకనులో వారికి వరదానం లేదా మహాదానం
ఇవ్వాలి. అలాంటి మహాదాని మరియు వరదాని అయ్యారా? సర్వుల మనోకామనలను పూర్తి చేసే
కామధేనువుగా అయ్యారా? లేక ఇంకా మీలోనే ఏమైనా కామనలు మిగిలిపోయాయా? మీకే కామనలు
ఉంటే కామధేనువుగా ఎలా అవుతారు? నాకు పేరు రావాలి, నన్ను గౌరవించాలి....ఈ కామనలు
కూడా ఉండకూడదు. అర్ధమైందా!
ఈవిధంగా ఒక్క సెకనులో మూడవనేత్రం ద్వారా విశ్వమంతటికీ
దృష్టి ద్వారా అద్భుతం చేసేవారికి, ఒక్క సెకనులో అశాంతి మరియు దు:ఖం నుండి
దూరంగా తీసుకువెళ్ళేవారికి, తగుల్పాటు మరియు స్వభావానికి అతీతంగా కర్మాతీత
స్థితిలో స్థితులయ్యేవారికి, ముక్తి - జీవన్ముక్తి యొక్క వారసత్వ ప్రాప్తి
యొక్క జీవితంలో సదా ఉండేవారికి, ముక్తి మరియు జీవన్ముక్త ఆత్మలకు బాప్ దాదా
యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.