యోగయుక్తంగా అవ్వటం ద్వారా స్వతహాగానే
యుక్తియుక్త సంకల్పం, మాట మరియు కర్మ జరుగుతాయి.
సదా విజయీగా తయారుచేసేవారు, మరణశయ్యపై ఉన్న ఆత్మలకి
ప్రాణదానం ఇచ్చేవారు, సదా శ్రేష్ట కర్మ చేసి, చేయించే శివబాబా మాట్లాడుతున్నారు
-
స్థూలమైన సైన్యానికి సైన్యాధిపతి ఆజ్ఞ ఇస్తారు. ఆ
ఆజ్ఞ అనుసారంగా ఒక్క సెకనులో ఎక్కడ ఏవిధంగా నిల్చోవాలో ఆవిధంగా నిల్చోవాలి.
ఒకవేళ ఆ ఆజ్ఞని అర్ధం చేసుకోవటంలో, ఆలోచించటంలో సమయం పడితే దాని ఫలితం ఏమి
వస్తుంది? విజయం కోసం ఏదైతే ప్లాన్ వేశారో అది అమలు అవ్వదు. అదేవిధంగా సదా
విజయీగా అయ్యే వారి విశేషత ఏమి ఉంటుందంటే ఒక్క సెకనులో తమ సంకల్పాలని
నిలిపేస్తారు. ఏ స్థూల కార్యంలోనైనా లేదా జ్ఞానాన్ని మననం చేయటంలో అయినా చాలా
బిజీగా ఉన్నా కానీ అటువంటి సమయాల్లో కూడా తమని తాము ఒక్క సెకనులో
నియంత్రించుకోగలరు. ఏవిధంగా అయితే వారు చాలా వేగంగా పరుగుపెడుతున్నారు, భయానక
యుద్ధంలో ఉపస్థితి అయ్యి ఉన్నారు. అలాంటి సమయంలో కూడా ఆగమనగానే ఆగిపోతారు.
అదేవిధంగా ఏ సమయంలోనైనా లేదా ఘడియల్లో అయినా మననచింతనకి బదులు బీజరూప స్థితిలో
స్థితులు అయిపోవాలి అనుకుంటే సెకనులో ఆగగలుగుతున్నారా? ఎలాగైతే స్థూల
కర్మేంద్రియాలను ఒక్క సెకనులో ఏవిధంగా కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆవిధంగా
కదపగలుగుతున్నారు కదా! వాటిపై మీకు అధికారం ఉంది కదా! అదేవిధంగా మీ బుద్ధిపై
అనగా సంకల్పాలపై కూడా అధికారిగా అయ్యారా? బిందువు పెట్టాలి అని అనుకోగానే
పెట్టగలుగుతున్నారా? ఈ అభ్యాసం ఉందా? విస్తారంలోకి వెళ్ళటానికి బదులు ఒక్క
సెకనులో బిందువు అయిపోవాలి. ఈ స్థితి ఉందని భావిస్తున్నారా? స్థూలంగా కూడా
డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వేగంగా నడిపి, వెనక్కి తిప్పి మరలా వెంటనే
ఆపమని అంటారు. అది కూడా ఒకరకమైన అభ్యాసమే కదా! అదేవిధంగా మీ బుద్ధిని నడిపించటం
మరియు ఆపటం రెండింటి అభ్యాసం ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సమయానికి ఒక్క
సెకనులో ఆగిపోవాలి. అదీ అద్భుతం. నిరంతర విజయీ ఎవరంటే వారి సంకల్పం, మాట, కర్మ
యుక్తియుక్తంగా ఉంటాయి. ఒక్క సంకల్పం కూడా వ్యర్ధం ఉండదు. అది ఎప్పుడు
జరుగుతుందంటే మీకు అభ్యాసం ఉన్నప్పుడు. సేవలో ఉన్నారు, అలాంటి సమయంలో కూడా
సంకల్పాలని నిలిపివేసే అభ్యాసం ఉండాలి. అలాంటివారే పూర్తి విజయీలు. ఇప్పుడు
ఎలాంటి సమయం రానున్నదంటే మొత్తం ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది. ఆ అగ్ని నుండి
రక్షించుకునేటందుకు ముఖ్యంగా రెండు విషయాలు అవసరం. ఎప్పుడైతే నలువైపులా
వినాశనాన్ని అగ్ని అంటుకుంటుందో ఆ సమయంలో శ్రేష్టాత్మలైన మీ యొక్క మొదటి
కర్తవ్యం - శాంతిదానం. అనగా సహనశీలత యొక్క బలాన్ని ఇవ్వటం, ఆ తర్వాత ఏమి కావాలి?
ఎవరికి ఏది అవసరమో అది పూర్తి చేయాలి. ఆ సమయంలో వారి యొక్క ఎలాంటి అవసరాలను మీరు
పూర్తి చేయవలసి ఉంటుంది? ఆ సమయంలో ప్రతీ ఒక్కరికీ వేర్వేరు శక్తులు అవసరం
అవుతాయి. కొందరికి సహనశక్తి అవసరం అవుతుంది. కొందరికి ఇముడ్చుకునే శక్తి అవసరం
అవుతుంది, కొందరికి నిర్ణయశక్తి అవసరం అవుతుంది. కొందరికి ముక్తి అవసరం అవుతుంది.
ఈ విధంగా ఎవరికి ఏ ఆశ ఉంటుందో ఆ ఆశని పూర్తి చేసేటందుకు బాబా పరిచయం ద్వారా
ఒక్క సెకనులో అశాంతి ఆత్మను శాంతి చేసే శక్తి ఈ సమయంలో చాలా అవసరం. కనుక ఆ
శక్తులన్నింటినీ ఇప్పటి నుండే జమ చేస్కోవాలి. లేకపోతే ఆ సమయంలో ప్రాణదానం ఎలా
చేయగలరు? విశ్వంలోని సర్వాత్మలకు శక్తులను దానంగా ఇవ్వవలసి ఉంటుంది. ఎంత స్టాకు
జమ చేసుకోవాలంటే ఆ శక్తి ఆధారంగా మీరు కూడా నడవగలగాలి మరియు ఇతరులకు కూడా
ఇవ్వగలగాలి. ఎవరూ వంచితం కాకూడదు. ఒక్క ఆత్మ అయినా కానీ వంచితం అయిపోతే ఆ భారం
ఎవరిపై ఉంటుంది? ప్రాణదానం ఇవ్వటానికి ఎవరైతే నిమిత్తం అయ్యారో వారిపై ఉంటుంది,
కనుక మీ యొక్క ప్రతీ శక్తి యొక్క స్టాకుని పరిశీలించుకోండి. ఎవరి దగ్గర శక్తుల
యొక్క స్టాకు జమ అయ్యి ఉంటుందో వారే అదృష్టసితారల రూపంలో విశ్వాత్మల మధ్య
మెరుస్తూ అందరికీ కనిపిస్తారు. కనుక ఇప్పుడు ఇది పరిశీలించుకోవాలి - అమృతవేళ
లేచి అటెన్షన్ అనే పట్టాలపై స్వయాన్ని నడిపించుకోవాలి. వాహనం పట్టాలపై సరిగ్గా
నడుస్తుంది కదా! మీపై విశ్వమంతటి భాద్యత ఉంది, కేవలం భారతదేశం యొక్క బాధ్యతయే
కాదు, మరి శ్రేష్ఠాత్మలైన మీ యొక్క ప్రతీ కర్మ గొప్పగా ఉంది కదా! ఇది
పరిశీలించుకోండి. రోజంతటిలో సాధారణమైన మాట ఏదీ మాట్లాడలేదు కదా! మనస్సులో ఏ
వ్యర్ధ సంకల్పం నడవలేదు కదా! పొరపాటు పని ఏదీ చేయలేదు కదా! ఇలా ప్రతీ సంకల్పంపై
ముందు నుండే ధ్యాస పెట్టాలి. యోగయుక్తులుగా అయితే, స్వతహాగానే యుక్తియుక్త
సంకల్పం, మాట మరియు కర్మ జరుగుతాయి.