సర్వ శక్తుల యొక్క స్టాక్.
విఘ్నవినాశకులు, సర్వశక్తివంతుడు, మహాదాని అయిన
శివబాబా మాట్లాడుతున్నారు -
స్వయాన్ని విఘ్నముక్తులుగా భావించి ఎప్పుడైతే స్వయం
విఘ్నముక్తులు అవుతారో, అప్పుడే ఇతరులను కూడా రకరకాల విఘ్నాల నుండి రక్షించగలరు.
స్వయంలోనే మానసిక విఘ్నం ఉంటే ఇతరులని విఘ్నముక్తులుగా ఎప్పటికీ చేయలేరు.
ఇప్పుడు ఎలాంటి సమయం రానున్నదంటే ఈ ప్రపంచానికంతటికీ నిప్పు అంటుకోనున్నది. ఆ
అగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేటందుకు కొన్ని ముఖ్య విషయాలు అవసరం.
మామూలుగా కూడా ఎక్కడైనా అగ్ని అంటుకుంటే ఆ అగ్ని నుండి రక్షించుకునేటందుకు మొదట
ఏది అవసరం అవుతుంది? వినాశన అగ్ని నలువైపుల అంటుకున్నప్పుడు ఆ సమయంలో
శ్రేష్టాత్మలైన మీ యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి? శాంతిదానం. అనగా శీతలత
యొక్క నీరుని అందించటం. నీరు వేసిన తర్వాత ఏమేమి చేయాలి? ఎవరికి ఏది అవసరమో ఆ
అవసరాలన్నీ పూర్తి చేయాలి. కొందరికి విశ్రాంతి అవసరం, కొందరికి గమ్యం కావాలి...
ఈ విధంగా ఎవరికి ఏది కావాలంటే ఆ అవసరాలను పూర్తి చేయాలి. మీరు ఏ అవసరాలను పూర్తి
చేయాలో మీకు తెలుసా? ఆ సమయంలో ప్రతీ ఒక్కరికీ వేర్వేరు శక్తులు అవసరం అవుతాయి.
కొందరికి సహనశక్తి అవసరం అవుతుంది, కొందరికి సర్దుకునే శక్తి అవసరం అవుతుంది,
కొందరికి నిర్ణయశక్తి అవసరం అవుతుంది, మరికొందరికి తమని తాము పరిశీలించుకునే
శక్తి అవసరం అవుతుంది, కొందరికి ముక్తి అనే గమ్యం అవసరం అవుతుంది. ఈవిధంగా
రకరకాల శక్తులు ఆ సమయంలో ఆ ఆత్మలకు అవసరం అవుతాయి. బాబా పరిచయం ద్వారా ఒక్క
సెకనులో అశాంతి ఆత్మలను శాంతి చేసే శక్తి కూడా ఆ సమయంలో అవసరం అవుతుంది. దానిని
ఇప్పటి నుండే జమ చేసుకోవాలి. లేకపోతే ఆ సమయంలో అంటుకున్న అగ్ని నుండి ఏవిధంగా
రక్షించగలరు? ప్రాణదానం ఎలా ఇవ్వగలరు? కనుక మిమ్మల్ని మీరు ముందుగానే తయారు
చేసుకునేటందుకు చూసుకోవలసి ఉంటుంది. ఎలాగైతే 6 నెలలకి సరిపడా స్టాకుని జమ
చేసుకుంటారో, ఆ 6 నెలల్లో ఏయే వస్తువులు అవసరం అవుతాయో అవన్నీ జమ చేసుకుంటారు,
ఏమేమి కావాలో చూసుకుంటారు. వాటి స్టాకు పెట్టుకుంటారు. అదేవిధంగా ఈ స్టాకుని
కూడా పరిశీలిస్తున్నారా? విశ్వంలోని ఆత్మలందరికీ శక్తిదానం ఇవ్వవలసి ఉంటుంది.
ఇంత స్టాకు జమ అయ్యి ఉందా? మీకు మీరు ఆ శక్తి ఆధారంగా నడవాలి మరియు ఇతరులకి కూడా
శక్తిని ఇవ్వగలగాలి, ఎవ్వరూ వంచితులుగా మిగిలిపోకూడదు. ఒకవేళ మీ దగ్గర శక్తులు
జమ అయ్యి లేకపోతే మరియు ఒక్క ఆత్మ అయినా వంచితంగా ఉండిపోతే ఆ భారం ఎవరిపై
ఉంటుంది? నిమిత్తమైన వారిపై, కనుక సదా ప్రతీ శక్తి యొక్క స్టాకుని జమ చేసుకోండి.
ఎవరి దగ్గర సర్వశక్తుల స్టాకు జమ అయ్యి ఉంటుందో, వారే ముఖ్యమైనవారిగా మహిమ
చేయబడతారు. నక్షత్రాలు ఎలాగైతే నెంబరు వారీగా ఉంటాయో అలాగే ఎవరి దగ్గర అయితే
సర్వశక్తుల స్టాకు జమ అయ్యి ఉంటుందో వారు అదృష్ట సితారల రూపంలో విశ్వాత్మలందరి
మధ్యలో కనిపిస్తారు. కనుక సర్వశక్తుల స్టాకు జమ అయ్యి ఉందా అని పరిశీలించుకోవాలి.
మహారథీలకు ప్రతీ సమయం, ప్రతి సంకల్పంపై ముందుగానే ధ్యాస ఉంటుంది. మహారథీలు
పరిశీలన చేసుకునే రూపురేఖయే వేరుగా ఉంటుంది. వారికి యోగశక్తి ఉంటుంది. కనుక
స్వతహాగానే యుక్తీయుక్త సంకల్పం,మాట, కర్మ చేస్తారు. ఇప్పుడిది స్వతహా
సిద్ధమైపోయింది. మహారథీలు పరిశీలించుకునే రూపురేఖ ఇది. సర్వశక్తులలో ఏయే స్టాకు
జమ అయ్యి ఉంది, జమ అయిన ఆ స్టాకు ద్వారా ఎంతమంది ఆత్మలకి కళ్యాణం చేయగలం.
ఎలాగైతే స్థూల స్టాకుని చూసుకుంటారో మరియు జమ చేసుకుంటారో మరియు అది మీ విధియో
అలాగే సర్వశక్తుల స్టాకు జమ చేసుకునే భాధ్యత కూడా మీదే. ఆల్రౌండర్ అయిన వారు
ప్రతీ వస్తువు యొక్క స్టాకుని అవసరాన్ని అనుసరించి జమ చేసుకుంటూ ఉండాలి.
అమృతవేళ లేచి స్వయాన్ని ధ్యాస అనే పట్టాలపై నడిపించుకోవాలి. వాహనం పట్టాలపైనే
సరిగ్గా నడుస్తుంది. పట్టాలపై ఉంటే అటుఇటు అయ్యే అవకాశం లేదు. కనుక ఇప్పుడు ఈ
స్టాకుని జమ చేసుకునేటందుకు పరిశీలించుకోవాలి. విశ్వమంతటి యొక్క భాద్యత
పిల్లలైన మీపై ఉంది. కేవలం భారతదేశం యొక్క బాధ్యతయే కాదు. మహారధీల యొక్క ప్రతీ
కర్మ మహాన్ గా ఉండాలి. ఎవరితో? గుఱ్ఱపు సవారీలు, కాలిబలం వారికంటే కూడా మంచిగా
ఉండాలి. మంచిది.