సంఘటనా శక్తి ఒకే సంకల్పం.
సర్వ శ్రేష్టమతాన్ని ఇచ్చేవారు, సదా పొరపాటు
చేయనివారిగా తయారుచేసే శివబాబాను మాట్లాడుతున్నారు.
అందరూ ఏ సంకల్పంతో కూర్చున్నారు? అందరి సంకల్పం ఒకటే
కదా? ఏవిధంగా అయితే ఇప్పుడు అందరికీ ఒకే సంకల్పం నడుస్తూ ఉందో అదేవిధంగా అందరూ
ఒకే సంలగ్నతలో అనగా బాబాని కలుసుకోవాలి మరియు అశరీరిగా తయారవ్వాలనే శుద్ధ
సంకల్పంలో స్థితులవ్వండి. సంఘటిత రూపంలో అందరూ ఈ ఒకే శుద్ధ సంకల్పం ఏమి చేయగలరు?
ఎవరికి కూడా మారే ఇతర సంకల్పం రాకూడదు. అందరూ ఏకరస స్థితిలో స్థితులవ్వాలి.
ఇప్పుడు చెప్పండి ఆ ఒక్క సెకెను యొక్క అందరి శుద్ధ సంకల్పం యొక్క శక్తి ఏ
అద్భుతం చేస్తుంది? ఈవిధంగా సంఘటిత రూపంలో ఒకే శుద్ధ సంకల్పం అనగా ఏకరస సితిని
తయారుచేసుకునే అభ్యాసం చేయాలి. అప్పుడే విశ్వంలో శక్తి సేన యొక్క పేరు ప్రసిద్ధి
అవుతుంది. ఏవిధంగా అయితే స్థూల సైనికులు యుద్ధ మైదానానికి వెళ్లినప్పుడు ఒకే
ఆర్డర్ తో ఒకే సమయంలో నలువైపులా కాల్చటం ప్రారంభిస్తారు. ఒకవేళ ఒకే సమయంలో ఒకే
ఆర్డర్ తో నలువైపులా ముట్టడించకపోతే వారు విజయీగా కాలేరు. అదేవిధంగా ఆత్మిక సేన
సంఘటిత రూపంలో ఒకే సైగతో మరియు ఒకే సెకెనులో అందరూ ఏకరస స్థితిలో స్థితులైపోతే
విజయం యొక్క నగాడా మ్రోగుతుంది. సంఘటిత రూపంలో అందరికీ ఒకే సంకల్పం మరియు ఒకే
శక్తిశాలి స్థితి యొక్క అనుభవం అవుతుందా లేక కొందరు తమను తాము స్థితులు
చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారా? కొందరు స్థితిలో స్థితులవుతున్నారు, మరికొందరు
విఘ్నాలను వినాశనం చేసుకోవడంలోనే నిమగ్నమై ఉన్నారు. అలా ఉన్నారా? ఇలాంటి సంఘటన
యొక్క ఫలితంలో విజయీ నగాడా మ్రోగుతుందా? విజయీ నగాడా ఎప్పుడు మ్రోగుతుందంటే
ఎప్పుడైతే అందరి యొక్క అన్ని సంకల్పాలు ఒకే సంకల్పంలోను కలిసిపోతాయో అప్పుడే
మ్రోగుతుంది. ఇలాంటి స్థితి ఉందా? కొద్ది మంది విశేష ఆత్మల యొక్క ఏకరస స్థితి
అనే వేలుతో కలియుగ పర్వతం లేవనెత్తబడుతుందా? చిత్రంలో అందరి వ్రేలుని చూపించారు.
దాని అర్థం కూడా ఇదే. సంఘటిత రూపంలో ఒకే సంకల్పం, ఒకే మతం - ఏకరస స్థితికి
గుర్తు. ఈ రోజు బాప్ దాదా పిల్లలను అడుగుతున్నారు - ఈ కలియుగ పర్వతాన్ని ఎప్పుడు
లేవనెత్తుతారు మరియు ఎలా లేవనెత్తుతారు? ఇదైతే చెప్పాను, కానీ ఎప్పుడు
లేవనెత్తుతారు ( మీరు ఆజ్ఞాపించినప్పుడు) ఏకరస స్థితిలో ఎవరెడీగా ఉన్నారా, ఏమి
ఆర్డర్ లభిస్తుంది? అందరూ ఒక్కసెకెనులో ఏకరస స్థితిలో స్థితులవ్వండి - ఇదే ఆజ్ఞ
లభిస్తుంది. ఈ ఆజ్ఞను ప్రత్యక్షంలో తీసుకువచ్చేటందుకు ఎవరెడీగా ఉన్నారా? ఆ
ఒక్కసెకెను సదాకాలిక సెకెను అవుతుంది. ఒక్క సెకను స్థిరమై మరలా కిందికి
వచ్చేయకండి. ఎలాగైతే అజ్ఞాని ఆత్మలకు జ్ఞానమనే వెలుగు ఇచ్చేటందుకు సదా శుభభావన
లేదా కళ్యాణకారీ భావన పెట్టుకుని ప్రయత్నిస్తుంటారో, అదేవిధంగా మీ యొక్క ఈ దైవీ
సంఘటనను కూడా ఏకరస స్థితిలో స్థితులు చేసేటందుకు, సంఘటనా శక్తిని
పెంచుకునేటందుకు ఒకరికొకరు భిన్నభిన్న రూపాల్లో ప్రయత్నిస్తున్నారా? ఎవరికైనా
కానీ ఈ దైవీ సంఘటన యొక్క మూర్తిలో ఏకరస స్థితి యొక్క ప్రత్యక్షరూపం సాక్షాత్కారం
అవ్వాలి. ఇలాంటి ప్లాన్స్ కూడా ఏమైనా తయారుచేస్తున్నారా? ఎప్పటివరకైతే ఈ దైవీ
సంఘటన యొక్క ఏకరస స్థితి ప్రఖ్యాతి అవ్వదో అప్పటి వరకు బాప్ దాదా యొక్క
ప్రత్యక్షత సమీపంగా రాదు.
ఇటువంటి ఎవరెడీయేనా? విశ్వమహారాజుగా అవ్వాలి, అంతేకాని
వ్యక్తిగత రాజుగా కాదు కదా! ఇదే లక్ష్యం పెట్టుకున్నారు కదా! కనుక ఇప్పటి నుండి
లక్షణాలు ధారణ చేయడం ద్వారా లక్ష్యాన్ని ప్రాప్తింపచేసుకోగలరు. కేవలం స్వయాన్ని
ఏకరసంగా తయారుచేసుకోవడం కాదు. సంఘటన అంతటినీ ఏకరస స్థితిలో స్థితులు చేసేటందుకు
సహయోగి అవ్వాలి. ఇది ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ యొక్క బాధ్యత. నేను సరిగానే
ఉన్నానని దీంట్లో సంతోష పడిపోకండి. సంఘటనలో లేదా మాలలో ఒక్క మణి అయినా వేరేరకంగా
ఉంటే మాల అందంగా ఉండదు. అదేవిధంగా సంఘటనా శక్తియే పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత.
ఉత్తముల జ్ఞానము మరియు పరమాత్మ జ్ఞానము, రెండింటిలో తేడా ఇదే. అక్కడ సంఘటనా
శక్తి ఉండదు. ఇక్కడ సంఘటనా శక్తి ఉంటుంది పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత ఇదే. దీని
ద్వారానే విశ్వంలో కల్పమంతటిలో ఆ సమయం గురించి మహిమ చేయబడింది. ఒకే ధర్మం, ఒకే
రాజ్యం, ఒకే మతం వీటి యొక్క స్థాపన ఎక్కడ జరుగుతుంది? బ్రాహ్మణ సంఘటన యొక్క
విశేషతయే దేవతా రూపంలో ప్రత్యక్షంలో నడుస్తుంది. అందువలన బాబా అడుగుతున్నారు -
ఈ విశేషత ద్వారా అద్భుతం జరుగనున్నది, పేరు ప్రసిద్ధం కానున్నది, ప్రత్యక్షత
కానున్నది, అసాధారణ అలౌకిక రూపం ప్రత్యక్షత కానున్నది. అది ఇప్పుడు ప్రత్యక్షం
అయిందా? ఈ విశేషతలో ఎవరెడీగా ఉన్నారా? సంఘటిత రూపంలో ఎవరెడీ యేనా? కల్పపూర్వ
ఫలితం అయితే నిశ్చితం, కానీ ఇప్పుడు పరదాని తొలగించండి. ప్రేయసీలందరూ పరదా లోపల
ఉన్నారు. ఇప్పుడు మీ నిశ్చయాన్ని సాకార రూపంలోకి తీసుకురండి. అక్కడక్కడ సాకార
రూపం ఆకారంలోకి వెళ్ళిపోతుంది. దీనిని సాకార రూపంలోకి తీసుకురండి అంటే సంపూర్ణ
స్థితిని ప్రత్యక్షం చేయండి. ఆ రోజు చెప్పాను కదా - పరివర్తన అందరిలో వచ్చింది.
కానీ ఇప్పుడు సంపూర్ణ పరివర్తనను ప్రత్యక్షం చేయండి. మీ గురించి మీరు
వర్ణించేటప్పుడు కూడా ఇదే చెబుతున్నారు. చాలా పరివర్తన అయ్యాము, అయినా కానీ....
అయినా కానీ అని ఎందుకు వస్తుంది? ఈ మాట కూడా సమాప్తం అయిపోవాలి. ప్రతి ఒక్కరిలో
ఏదైతే ముఖ్య సంస్కారం ఉంటుందో దానిని మీరు స్వభావం అని అంటుంటారు. ఆ ముఖ్య
సంస్కారం అంశమాత్రంగా కూడా ఉండకూడదు. ఇప్పుడైతే మిమ్మల్ని మీరు
తప్పించుకుంటున్నారు, ఏమీ పరవాలేదు అంటున్నారు, నా భావం ఇదికాదు, నా స్వభావమే
అంత, నా సంస్కారమే అంత అంటున్నారు. ఇది సంపూర్ణ స్వభావమా? ప్రతి ఒక్కరికి ఏదైతే
తమ ముఖ్య సంస్కారం ఉంటుందో, అదే ఆది సంస్కారం. దానిని కూడా ఎప్పుడైతే
పరివర్తనలోకి తీసుకువస్తారో అప్పుడే సంపూర్ణంగా తయారవుతారు. చిన్న చిన్న
పొరపాట్లను పరివర్తన చేసుకోవడం సహజం, కానీ ఇప్పుడు అంతిమ పురుషార్థం ఏమిటంటే
మీలో ఉన్న ముఖ్య సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి. అప్పుడే సంఘటిత రూపంలో ఏకరస
స్థితి తయారవుతుంది. ఇప్పుడు అర్ధమైందా! ఇది చేయడం సహజమే కదా? అనుసరించడం
ఎప్పుడూ సహజంగా ఉంటుంది. మీమీ ముఖ్యసంస్కారాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకుని,
బాప్ దాదా యొక్క సంస్కారాలను అనుసరించడం సహజమా లేక కష్టమా? దీనిలో అనుసరించడం
అనేది కూడా నిజమైనదిగానే ఉంటుంది. అందరూ సంస్కారాల్లో బాప్ దాదాతో సమానులేనా,
ఒకొక్కరు బాప్ దాదా సమానంగా అయిపోతే ఒక్కొక్కరిలో బాప్ దాదా యొక్క సంస్కారాలు
కనిపిస్తాయి. అప్పుడు ఎవరి ప్రత్యక్షత జరుగుతుంది? బాప్ దాదా యొక్క ప్రత్యక్షత
జరుగుతుంది. భక్తిమార్గంలో చెబుతారు కదా! ఎక్కడ చూసినా నువ్వే నువ్వు, కానీ
ఇక్కడ ప్రత్యక్షంలో అలా కనిపించాలి. ఎవరిని చూసినా కానీ వారిలో బాప్ దాదా యొక్క
సంస్కారాలు ప్రత్యక్షంలో కనిపించాలి. ఇది కష్టమా... కష్టమని ఎప్పుడనిపిస్తుందంటే
అనుసరించడానికి బదులు మీ బుద్ధిని ఉపయోగించినప్పుడు, మీ సంకల్పాల జాలంలో మీరే
చిక్కుకుపోతున్నారు. కానీ ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు. బయటపడే పురుషార్థం
కూడా ఎప్పుడు చేస్తున్నారంటే పూర్తిగా దాంట్లో చిక్కుకుపోయిన తరువాత అప్పుడు
సమయం కూడా పడుతుంది మరియు శక్తి కూడా పడుతుంది. ఒకవేళ బాబాని అనుసరించుకుంటే
వెళ్తే ఈ సమయం, శక్తి రెండూ వ్యర్ధం అవ్వవు కదా! జమ అవుతాయి. కష్టాన్ని సహజంగా
చేసుకునేటందుకు, అంతిమ పురుషార్ధంలో సఫలత పొందేటందుకు ఏ పాఠాన్ని పక్కా
చేసుకోవాలి? ఫాలో ఫాదర్. ఇది మొదటి పాఠం. ఈ మొదటిపాఠం అంతిమ స్థితిని
తీసుకువస్తుంది. అందువలన ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి, దీనిని మర్చిపోకండి.
సదాకాలికంగా మరిచిపోని వారిగా, ఏకరసంగా తయారయిపోతారు. మంచిది.
ఈ విధంగా తీవ్ర పురుషార్థీ , సదా ఏకరస, ఏకమత మరియు
ఒకని సంలగ్నతలో ఉండే శ్రేష్ఠాత్మలకు నమస్తే.