ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు కనుక ఆత్మిక పిల్లలు దేహీ అభిమాని లేక ఆత్మిక స్థితిలో, నిశ్చయబుద్ధి కలవారిగా అయి కూర్చోవాలి మరియు వినాలి. ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మనే వింటుంది అని బాబా అర్థం చేయించారు. ఇది పక్కాగా గుర్తు చేసుకుంటూ ఉండండి. సద్గతి మరియు దుర్గతుల ఈ చక్రము ప్రతి ఒక్కరి బుద్ధిలో తప్పకుండా ఉండాలి, ఇందులో జ్ఞానము మరియు భక్తి, అంతా వచ్చేస్తుంది. జ్ఞానము మరియు భక్తి, సుఖము మరియు దుఃఖము, పగలు మరియు రాత్రి యొక్క ఆట ఎలా నడుస్తుంది అనేది నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో ఉండాలి. మనము 84 జన్మల పాత్రను అభినయిస్తాము. బాబాకు అంతా గుర్తు ఉంది కనుక పిల్లల చేత కూడా స్మృతిలో ఉండే పురుషార్థము చేయిస్తారు, దీనితో మీ వికర్మలు కూడా వినాశనమౌతాయి మరియు మీరు రాజ్యాన్ని కూడా పొందుతారు. ఈ పాత ప్రపంచము అయితే ఇక సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. ఎలాగైతే ఇల్లు పాతబడినప్పుడు, కొత్తది నిర్మిస్తూ ఉంటే, ఇప్పుడు మేము కొత్త ఇంటికి వెళ్ళిపోతామని లోపల నిశ్చయముంటుంది. తర్వాత ఇల్లు తయారయ్యేందుకు 1-2 సంవత్సరాలు పడుతుంది. ఎలాగైతే కొత్త ఢిల్లీలో గవర్నమెంట్ హౌస్ మొదలైనవి తయారైనప్పుడు, మేము ట్రాన్సఫర్ అయ్యి తప్పకుండా కొత్త ఢిల్లీకి వెళ్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఈ అనంతమైన ప్రపంచమంతా పాతదిగా అయిపోయిందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. ఇలాంటి యుక్తులతో బుద్ధిని స్మృతియాత్రలో నిమగ్నం చేయాలని బాబా యుక్తులను తెలియజేస్తారు. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి కనుక మధురమైన ఇంటిని స్మృతి చేయాలి, దీనికోసమే మనుష్యులు తల బాదుకుంటారు. ఈ దుఃఖధామము ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని కూడా మధురాతి-మధురమైన పిల్లలకు అర్థం చేయించారు. మీరిక్కడే ఉన్నా కానీ ఈ పాత ప్రపంచము ఇష్టము ఉండదు. మనము మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. చిత్రాలేవీ ఎదురుగా లేకపోయినా కూడా ఇప్పుడు పాత ప్రపంచము యొక్క అంతము అని మీకు తెలుసు. ఇప్పుడు మనము కొత్త ప్రపంచములోకి వెళ్తాము. భక్తిమార్గానికి సంబంధించిన చిత్రాలు ఎన్ని ఉన్నాయి. వాటితో పోలిస్తే మీవి చాలా తక్కువ. మీవి ఈ జ్ఞానమార్గం యొక్క చిత్రాలు మరియు అవన్నీ భక్తిమార్గానికి చెందినవి. భక్తి అంతా చిత్రాల పైనే జరుగుతుంది. ఇప్పుడు మీవైతే రియల్ చిత్రాలు కనుక రైట్ ఏమిటో, రాంగ్ ఏమిటో మీరు అర్థం చేయించగలరు. బాబాను నాలెడ్జ్ ఫుల్ అంటారు. మీకు ఈ జ్ఞానముంది. మొత్తం కల్పములో మనం ఎన్ని జన్మలు తీసుకున్నాము, ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది మీకు తెలుసు. మీరు నిరంతరము తండ్రి స్మృతిలో మరియు ఈ జ్ఞానంలోనే ఉండాలి. తండ్రి మీకు రచయిత మరియు రచనల పూర్తి జ్ఞానాన్నిస్తారు. కనుక తండ్రి స్మృతి కూడా ఉంటుంది. నేను మీ తండ్రి, టీచర్, సద్గురువును అని బాబా అర్థం చేయించారు. మీరు నన్ను పతితపావనుడు, లిబరేటర్ (ముక్తిదాత), గైడ్ (మార్గదర్శకుడు) అని అంటారు కదా, మరి నేను ఎక్కడకు గైడ్ అని తండ్రి అంటున్నారని మీరు కేవలం ఇది అర్థం చేయించండి. శాంతిధామము, ముక్తిధామాలకు గైడ్. తండ్రి అక్కడ వరకు తీసుకువెళ్ళి వదిలేస్తారు. పిల్లలను చదివించి, నేర్పించి, పుష్పాలుగా తయారుచేసి ఇంటికి తీసుకువెళ్ళి వదిలేస్తారు. బాబా తప్ప ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఎవరు ఎంత తత్వ జ్ఞానులైనా లేక బ్రహ్మ జ్ఞానులైనా తీసుకువెళ్ళలేరు. మేము బ్రహ్మములో లీనమౌతామని వారు భావిస్తారు. శాంతిధామము మన ఇల్లు అని మీ బుద్ధిలో ఉంది. అక్కడకు వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి మనము మొట్టమొదట వస్తాము. వారంతా తర్వాత వస్తారు. అన్ని ధర్మాలు నంబరువారుగా ఎలా వస్తాయి అనేది మీకు తెలుసు. సత్య-త్రేతా యుగాలలో ఎవరి రాజ్యముంటుంది, వారి ధర్మశాస్త్రము ఏమటి. సూర్య వంశీ-చంద్ర వంశీయులకు ఒక్కటే శాస్త్రము ఉంటుంది. కానీ ఆ గీత సత్యమైనదేమీ కాదు ఎందుకంటే మీకు లభించే ఈ జ్ఞానము ఇక్కడే సమాప్తమైపోతుంది. అక్కడ ఏ శాస్త్రమూ ఉండదు. ద్వాపరయుగము నుండి వచ్చే ధర్మాలకు సంబంధించిన శాస్త్రాలు నిలిచి ఉన్నాయి. అవి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏక ధర్మ స్థాపన జరగుతుంది కావున మిగిలినవన్నీ వినాశనమవ్వనున్నాయి. ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే మతముండాలని అంటూ ఉంటారు. అవన్నీ ఒక్కరి ద్వారానే స్థాపనవ్వగలవు. సత్యయుగము నుండి మొదలుకొని కలియుగాంతము వరకు పూర్తి జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేయండి అని తండ్రి అంటారు. మీరు పతితులుగా అవ్వడానికి అర్థకల్పము పట్టింది. వాస్తవానికి పూర్తి కల్పమనే చెప్పాలి. ఈ స్మృతియాత్రను మీరిప్పుడే నేర్చుకుంటారు. అక్కడ ఇది ఉండదు. దేవతలు పతితుల నుండి పావనంగా అయ్యే పురుషార్థము చేయరు. వారు మొదట రాజయోగము నేర్చుకొని ఇక్కడ నుండే పావనంగా అవుతారు. దానిని సుఖధామమని అంటారు. పూర్తి కల్పములో కేవలం ఇప్పుడే మనం స్మృతియాత్ర యొక్క పురుషార్థము చేస్తామని మీకు తెలుసు. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేసే ఈ పురుషార్థము లేక కర్తవ్యం ఏదైతే నడుస్తుందో, అది మళ్ళీ కల్పము తర్వాత రిపీట్ అవుతుంది. చక్రములో తప్పకుండా తిరుగుతారు కదా. ఇది నాటకము, ఆత్మలందరూ పాత్రధారులు, వారిలో అవినాశీ పాత్ర నిండి ఉంది అని ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఎలాగైతే, ఆ డ్రామా నడుస్తూ ఉంటుంది కానీ ఆ ఫిల్మ్ అరిగిపోయి పాతదిగా అయిపోతుంది. ఇది అవినాశీ. ఇది కూడా అద్భుతము. ఎంత చిన్న ఆత్మలో పాత్రంతా నిండి ఉంది. తండ్రి మీకు ఎంత గుహ్యాతి-గుహ్యమైన సూక్ష్మ విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఎవరైనా వింటే, వీరు చాలా అద్భుతమైన విషయాలను అర్థం చేయిస్తారని అంటారు. ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడే అర్థము చేసుకున్నారు. శరీరం గురించైతే అందరికీ తెలుసు. డాక్టర్లు మనుష్యుల గుండెను కూడా బయటికి తీసి మళ్ళీ అమరుస్తారు కానీ ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ పతితము నుండి పావనంగా ఎలా అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. పతితాత్మ, పావనాత్మ, మహాన్ ఆత్మ అని అంటారు కదా. ఓ పతితపావనా, మీరు వచ్చి నన్ను పావనంగా చేయండి అని అందరూ పిలుస్తారు కూడా. కానీ ఆత్మ పావనంగా ఎలా అవుతుంది - దాని కొరకు అవినాశీ సర్జన్ కావాలి. పునర్జన్మ రహితుడిని ఆత్మ పిలుస్తుంది. ఆత్మను పవిత్రంగా చేసే ఔషధము వారి వద్ద మాత్రమే ఉంది. కనుక పిల్లలైన మీకు భగవంతుడు చదివిస్తున్నారు అని సంతోషంతో రోమాలు నిక్కబొడుచుకోవాలి, వారు తప్పకుండా మిమ్మల్ని భగవాన్-భగవతిగా తయారుచేస్తారు. భక్తిమార్గములో ఈ లక్ష్మీనారాయణులను భగవాన్-భగవతి అనే అంటారు. అంటే యథా రాజా-రాణి తథా ప్రజలు ఉంటారు కదా. బాబా తమ సమానంగా పవిత్రంగా కూడా తయారుచేస్తారు, జ్ఞానసాగరులుగా కూడా తయారుచేస్తారు, ఇంకా తమకన్నా కూడా గొప్పగా, విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. పవిత్రత, అపవిత్రతల సంపూర్ణ పాత్రను మీరు అభినయించాల్సి ఉంటుంది. బాబా ఆదిసనాతన దేవీ దేవతా ధర్మమును మళ్ళీ స్థాపన చేసేందుకు వచ్చారని మీకు తెలుసు. దీని గురించే ఈ ధర్మము ప్రాయః లోపమైపోయిందని చెప్తారు. దానిని మర్రి వృక్షముతోనే పోలుస్తారు. ఎన్నో శాఖలు వెలువడుతాయి, కాండము ఉండదు. ఇక్కడ కూడా అనేక ధర్మాలనే కొమ్మలు వెలువడ్డాయి, పునాది అయిన దేవతా ధర్మము లేదు. ప్రాయః లోపమైపోయింది. ఆ ధర్మము ఉంది కానీ ధర్మము పేరు మార్చేశారని బాబా అంటారు. పవిత్రంగా లేని కారణంగా తమను తాము దేవతలు అని చెప్పుకోలేరు. అలా లేరు కనుకనే తండ్రి వచ్చి రచనను రచిస్తారు కదా. మనము పవిత్రమైన దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు పతితులుగా అయ్యామని మీకిప్పుడు తెలుసు. ప్రతి వస్తువు ఇలాగే అవుతుంది. పిల్లలైన మీరు ఇది మర్చిపోకూడదు. మొదటి ముఖ్యమైన గమ్యము తండ్రిని స్మృతి చేయడం, దీని ద్వారానే పావనంగా అవ్వాలి. మమ్మల్ని పావనంగా చేయమని అందరూ అంటారు. మమ్మల్ని రాజా-రాణులుగా చేయమని అడగరు. కనుక పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. మనము భగవంతుని పిల్లలమని మీకు తెలుసు. ఇప్పుడు మనకు వారసత్వము తప్పకుండా లభించాలి. కల్ప-కల్పము ఈ పాత్రను అభినయించాము. వృక్షము పెరుగుతూనే ఉంటుంది. ఇవి సద్గతి యొక్క చిత్రాలని బాబా చిత్రాలపై కూడా అర్థం చేయించారు. మీరు ఒట్టి నోటితో కూడా అర్థం చేయిస్తారు, చిత్రాలతో కూడా అర్థము చేయిస్తారు. మీ ఈ చిత్రాలలో సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యం వచ్చేస్తుంది. సేవ చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు తమ సమానంగా తయారుచేస్తూ ఉంటారు. చదువుకొని చదివించే ప్రయత్నము చేయాలి. ఎంత ఎక్కువగా చదువుకుంటారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. నేను పురుషార్థము అయితే చేయిస్తాను కానీ భాగ్యం కూడా ఉండాలి కదా అని తండ్రి అంటారు. ప్రతి ఒక్కరు డ్రామా అనుసారముగా పురుషార్థము చేస్తూ ఉంటారు. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థము చేయించారు. తండ్రి, తండ్రి కూడా, టీచరు కూడా. తోడుగా తీసుకువెళ్ళే సత్యాతి-సత్యమైన సద్గురువు కూడా. ఆ తండ్రి అకాలమూర్తి. ఇది ఆత్మ యొక్క సింహాసనం కదా, దీని ద్వారా ఈ పాత్రను అభినయిస్తుంది. కనుక తండ్రికి కూడా పాత్రను అభినయించేందుకు, సద్గతినిచ్చేందుకు సింహాసనము కావాలి కదా. నేను సాధారణ తనువులోనే రావాలి అని తండ్రి చెప్తారు. ఏ ఆర్భాటము కలిగి ఉండను. ఆ గురువుల ఫాలోవర్స్ గురువుల కొరకు బంగారు సింహాసనం, మహళ్ళు మొదలైనవి తయారుచేస్తారు. మీరు ఏమి తయారుచేస్తారు? మీరు పిల్లలు కూడా, స్టూడెంట్ కూడా. మరి మీరు వారి కొరకు ఏమి చేస్తారు? ఎక్కడ తయారుచేస్తారు? వీరు సాధారణంగా ఉన్నారు కదా.
వేశ్యలకు సేవ చేయమని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. పేదవారిని కూడా ఉద్ధరించాలి. పిల్లలు ప్రయత్నం కూడా చేస్తారు, బనారస్ కు కూడా వెళ్ళారు. వారిని మీరు మేల్కొలిపితే, వాహ్ బి.కె.లు అద్భుతము చేస్తున్నారు, వేశ్యలకు కూడా ఈ జ్ఞానమిస్తున్నారు అని అంటారు. ఇప్పుడు మీరు ఈ వ్యాపారం వదిలి శివాలయానికి యజమానులుగా అవ్వండి అని వారికి కూడా అర్థం చేయించాలి. ఈ జ్ఞానము నేర్చుకుని, తర్వాత నేర్పించండి. వేశ్యలు కూడా ఇతరులకు నేర్పించగలరు. నేర్చుకుని తెలివైనవారిగా అయితే తమ ఆఫీసర్లకు కూడా అర్థము చేయిస్తారు. హాలులో చిత్రాలు మొదలైనవి పెట్టి కూర్చుని అర్థం చేయించినట్లయితే అందరూ, వాహ్, వేశ్యలను శివాలయవాసులుగా చేసేందుకు ఈ బి.కె.లు నిమిత్తంగా అయ్యారు అని అంటారు. సేవ కోసం పిల్లలకు ఆలోచనలు నడుస్తూ ఉండాలి. మీపై చాలా బాధ్యత ఉంది. అహల్యలు, కుబ్జలు, ఆటవికులు, గణికులు, వీరందరి ఉద్ధరణ చేయాలి. సాధువులను కూడా ఉద్ధరించారనే గాయనం కూడా ఉంది. సాధువుల ఉద్ధరణ చివర్లో జరుగుతుందని మీకు తెలుసు. ఇప్పుడే వారు మీ వారిగా అయిపోతే, ఇక భక్తిమార్గమంతా సమాప్తమైపోతుంది. పెద్ద విప్లవం జరుగుతుంది. సన్యాసులు తమ ఆశ్రమాలను వదిలేస్తారు, ఇక మేము ఓడిపోయామని అంటారు. ఇది చివర్లో జరుగుతుంది. ఈ విధంగా చేయండని బాబా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. బాబా అయితే బయటకు ఎక్కడికీ వెళ్ళరు. పిల్లల వద్దకు వెళ్ళి నేర్చుకోమని తండ్రి చెప్తారు. అర్థము చేయించేందుకు యుక్తులనైతే పిల్లలందరికీ చెప్తూ ఉంటారు. మనుష్యుల నోటి నుండి వాహ్-వాహ్ అని వెలువడేలా అటువంటి కార్యం చేసి చూపించండి. శక్తులలో భగవంతుడు జ్ఞాన బాణాలు నింపారనే గాయనము కూడా ఉంది. ఇవి జ్ఞాన బాణాలు. ఈ బాణాలు మిమ్మల్ని ఈ ప్రపంచము నుండి ఆ ప్రపంచానికి తీసుకువెళ్తాయని మీకు తెలుసు. కనుక పిల్లలైన మీరు చాలా విశాలబుద్ధి కలవారిగా అవ్వాలి. ఒక్కచోట మీ పేరు ప్రసిద్ధమయినా గవర్నమెంట్ కు తెలుస్తుంది, అప్పుడు చాలా ప్రభావము వెలువడుతుంది. ఒక చోట నుండే ఎవరైనా 5 - 7 మంది మంచి ఆఫీసర్లు వెలువడితే, అది వార్తాపత్రికలలో వేయడం మొదలుపెడతారు. ఈ బి.కె.లు వేశ్యల చేత కూడా ఆ వ్యాపారం వదిలింపజేసి, శివాలయానికి యజమానులుగా చేస్తారని అంటారు. వాహ్-వాహ్ అని ఎంతగానో అంటారు. వారు ధనము మొదలైనవన్నీ తీసుకొస్తారు. మీరు ధనాన్ని ఏం చేస్తారు! మీరు పెద్ద-పెద్ద సెంటర్లను తెరుస్తారు. ధనముతో చిత్రాలు మొదలైనవి తయారుచేయడం జరుగుతుంది. మనుష్యులు చూసి చాలా ఆశ్చర్యపోతారు. మొట్టమొదట మీకు ప్రైజ్ ఇవ్వాలని అంటారు. గవర్నమెంట్ హౌస్ కు కూడా మీ చిత్రాలు తీసుకువెళ్తారు. వీటిని చాలా ఇష్టపడతారు. మనుష్యులను దేవతలుగా ఎలా తయారుచేయాలనే కోరిక హృదయంలో ఉండాలి. ఎవరైతే కల్పక్రితము తీసుకున్నారో వారే తీసుకుంటారని మీకు తెలుసు. ఇంత ధనము మొదలైనదంతా వదలేయడం కష్టమవుతుంది. నాకు నా ఇల్లు, వాకిలి, మిత్ర-సంబంధీకులు మొదలైనవేవీ లేవు, నాకు ఏమి గర్తుకొస్తుంది, తండ్రి మరియు పిల్లలైన మీరు తప్ప ఇంకేమీ గుర్తు రాదు. అంతా ఎక్సేంజ్ చేసేశాను. ఇక బుద్ధి ఎక్కడకి వెళ్తుంది. తండ్రికి రథాన్నిచ్చాను. మీలాగే నేనూ చదువుకుంటున్నాను. కేవలం రథాన్ని బాబాకు లోన్ గా ఇచ్చాను.
సూర్యవంశములో మొట్టమొదట వచ్చేందుకు మనము పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. ఆత్మకు మూడవ నేత్రము లభిస్తుంది. ఆత్మలైన మనము చదువుకుని, జ్ఞానము విని, దేవతలుగా అవుతున్నాము. ఇక తర్వాత రాజులకే రాజుగా అవుతాము. నేను మిమ్మల్ని ద్వికిరీటధారులుగా తయారుచేస్తాను అని శివబాబా అంటారు. డ్రామానుసారముగా, కల్పక్రితము వలె ఇప్పుడు మీ బుద్ధి ఎంతగా తెరుచుకుంది. ఇప్పుడు స్మృతియాత్రలో కూడా ఉండాలి. సృష్టి చక్రమును కూడా స్మృతి చేయాలి. పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు మన కొరకు కొత్త స్థాపన జరుగుతుంది, ఈ దుఃఖపు పాత ప్రపంచము ఇక సమాప్తమైనట్లే అని బుద్ధిలో ఉండాలి. ఈ ప్రపంచము ఏమాత్రము నచ్చకూడదు.
2. ఏ విధంగా బాబా తమదంతా ఎక్స్ చేంజ్ చేసారు కనుక వారి బుద్ధి ఎక్కడకూ వెళ్ళదు, అదే విధంగా ఫాలో ఫాదర్ చేయాలి. మేము మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవ చేయాలి, ఈ వేశ్యాలయాన్ని శివాలయంగా చేయాలి అని హృదయంలో కేవలం ఇదే కోరిక ఉండాలి.